హైదరాబాద్: ప్రతి తల్లిదండ్రుల కల తమ పిల్లలు ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఎదగాలని. కానీ, ఆ కాన్ఫిడెన్స్ అనేది మార్కుల వల్లనో, ఖరీదైన బహుమతుల వల్లనో రాదు. అది ఇంట్లో పెరిగే వాతావరణం, తల్లిదండ్రుల ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేసే 10 అద్భుతమైన పేరెంటింగ్ చిట్కాలు ఇక్కడ ఉన్నాయి:
1. ప్రయత్నాన్ని మెచ్చుకోండి (Appreciate the Effort
పిల్లలు సాధించిన ఫలితం కంటే, వారు పడిన కష్టాన్ని గుర్తించండి. “నువ్వు బాగా ప్రయత్నించావు” అన్న చిన్న మాట వారిలో కొండంత నమ్మకాన్ని నింపుతుంది.
2. వారికి విలువ ఇవ్వండి (Active Listening)
పిల్లలు ఏదైనా చెబుతున్నప్పుడు ఫోన్లు పక్కన పెట్టి మరి వినండి. “నా మాట వినేవారు ఉన్నారు, నా అభిప్రాయానికి విలువ ఉంది” అనే భావన వారిని మానసిక దృఢంగా మారుస్తుంది.
3. పోలికలు వద్దు (No Comparisons)
“పక్కింటి అబ్బాయిని చూడు.. వాడికి ఎన్ని మార్కులు వచ్చాయో” అనే మాటలు పిల్లల మనసును గాయపరుస్తాయి. ప్రతి బిడ్డ ప్రత్యేకమని గుర్తించి, వారిలోని నైపుణ్యాలను ప్రోత్సహించండి.
4. చిన్న చిన్న బాధ్యతలు (Give Responsibilities)
వయసును బట్టి ఇంట్లో చిన్న చిన్న పనులు అప్పగించండి. ఉదాహరణకు.. తన బొమ్మలు తాను సర్దుకోవడం, మొక్కలకు నీళ్లు పోయడం. ఇలాంటి పనులు “నేను చేయగలను” అనే నమ్మకాన్ని ఇస్తాయి.
5. తప్పులు చేయనివ్వండి (Learning from Mistakes)
తప్పు చేస్తే తిట్టకండి. ఆ తప్పు నుండి ఏం నేర్చుకోవాలో నేర్పండి. తప్పుల ద్వారా పాఠాలు నేర్చుకునే పిల్లలే భవిష్యత్తులో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు.
6. షరతులు లేని ప్రేమ (Unconditional Love)
మార్కులు తక్కువ వచ్చినా, ఏదైనా పొరపాటు చేసినా.. మీ ప్రేమ తగ్గదని వారికి భరోసా ఇవ్వండి. ఆ ‘భద్రతా భావం’ (Security) వారిని ఏ సమస్యకైనా వెరవకుండా చేస్తుంది.
7. కొత్త నైపుణ్యాలు (Encourage Learning)
చదువుతో పాటు క్రీడలు, సంగీతం, పెయింటింగ్ వంటి రంగాల్లో వారిని ప్రోత్సహించండి. కొత్త విషయాలు నేర్చుకున్నప్పుడు సహజంగానే ధైర్యం పెరుగుతుంది.
8. చిన్న లక్ష్యాలు (Set Small Goals)
ఒకేసారి పెద్ద పనులు కాకుండా, చిన్న చిన్న లక్ష్యాలను పూర్తి చేసేలా చూడండి. ఒక్కో మెట్టు ఎక్కుతుంటే వారిలో విజేత అనే భావన కలుగుతుంది.
9. పాజిటివ్ మాటలు (Power of Words)
“నీవల్ల కాదు”, “నీకు రాదు” వంటి నెగటివ్ మాటలు వాడకండి. “నీకు సాధ్యమే”, “నేను నీ వెంటే ఉన్నాను” అనే మాటలు వారి ఆత్మవిశ్వాసానికి బూస్ట్‌లా పనిచేస్తాయి.
10. మీరే ఆదర్శం (Be a Role Model)
పిల్లలు మీ మాటల కంటే మీ ప్రవర్తనను చూసి ఎక్కువగా నేర్చుకుంటారు. మీరు ధైర్యంగా, క్రమశిక్షణతో ఉంటే వారు కూడా మిమ్మల్ని అనుసరిస్తారు.


