శివుడికి ఇష్టమైన వస్తువులు తులసికి ఎందుకు అర్పించకూడదు? అసలు కారణం ఇదే

హిందూ సంప్రదాయంలో తులసి మొక్క(Tulsi plant)ను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. తులసి పూజ సమయంలో పాటించాల్సిన నియమాలు, చేయకూడని తప్పులు, తులసికి ఏవి అర్పించాలి, ఏవి అర్పించకూడదు అనే ముఖ్యమైన విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

Tulasi-plant
Tulasi-plant

Tulsi plant

హైదరాబాద్: హిందూ సంప్రదాయంలో తులసి(Tulsi plant)ని కేవలం మొక్కగా కాకుండా సాక్షాత్తూ మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తాం. ఇంట్లో తులసి కోట ఉంటే అక్కడ శాంతి, సౌభాగ్యం ఉంటాయని మన నమ్మకం. అయితే, తులసి పూజ చేసే సమయంలో మనం చేసే కొన్ని చిన్న పొరపాట్లు అశుభ ఫలితాలకు దారితీస్తాయని మీకు తెలుసా? తులసి మొక్క వద్ద ఏ వస్తువులు ఉంచాలి, ఏవి ఉంచకూడదు అనే విషయాలను తెలుసుకుందా..

తులసి పూజ – పాటించాల్సిన ముఖ్య నియమాలు:
లక్ష్మీ నివాసం: తులసి మొక్కను ఇంట్లో పెంచడం వల్ల ఆరోగ్యం, ప్రశాంతత లభిస్తాయి. తులసిలో లక్ష్మీదేవి నివసిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రతిరోజూ దీపం వెలిగించి పూజించడం వల్ల శుభం కలుగుతుంది.

శివ పూజ వస్తువులు వద్దు: పురాణాల ప్రకారం శివుడికి, తులసి దేవికి వైరం ఉంది. అందుకే శివపూజలో వాడే బిల్వపత్రాలు, పారిజాత పూలు లేదా ఇతర వస్తువులను తులసి కోట వద్ద ఉంచకూడదు.

పాలు కలిపిన నీరు పోయకండి: చాలామంది పాలు కలిపిన నీటిని తులసికి పోస్తుంటారు. కానీ ఇది తప్పు. పాలలో ఉండే కొవ్వు వల్ల తులసి వేర్లు కుళ్లిపోయి మొక్క ఎండిపోయే ప్రమాదం ఉంది. మొక్క ఎండిపోవడం ఇంట్లో గొడవలకు, అశాంతికి దారితీస్తుందని పెద్దల మాట.

Tulasi-plant
Tulasi-plant

నల్ల వస్తువులకు దూరం: నల్ల నువ్వులు లేదా నలుపు రంగులో ఉండే వస్తువులను తులసికి అర్పించకూడదు. ఇవి ప్రతికూల శక్తులను ఆకర్షిస్తాయి.

పరిశుభ్రత ముఖ్యం: తులసి (Tulsi plant)పూజ చేసేటప్పుడు స్నానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించాలి. అశుద్ధిగా ఉన్నప్పుడు మొక్కను తాకకూడదు.

ఏవి అర్పించాలి?: తులసికి కేవలం పసుపు, కుంకుమ, స్వచ్ఛమైన నీరు, తేనె వంటి సాత్విక పదార్థాలను మాత్రమే సమర్పించాలి. ఇవి మొక్క ఆరోగ్యానికే కాకుండా మీకు ఆధ్యాత్మిక ఫలితాలను కూడా ఇస్తాయి.

ఇంట్లో తులసి మొక్క (Tulsi plant)పచ్చగా, ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం అంతా ఆనందంగా ఉంటుందని నమ్మకం. పైన చెప్పిన చిన్న జాగ్రత్తలు పాటిస్తూ తులసిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »