వంటల్లో టమాటా వాడుతున్నారా? కిడ్నీ ఆరోగ్యంపై దాని ప్రభావం ఎంత?

టమాటా తినడం (Kidney stones)వల్ల కిడ్నీ రాళ్లు వస్తాయనేది పూర్తిగా అపోహ మాత్రమే. టమాటాల్లో ఆక్సలేట్ పరిమాణం చాలా తక్కువ. కిడ్నీ రాళ్లకు అసలు కారణాలు తక్కువ నీరు తాగడం, జీవక్రియ లోపాలు, తప్పు ఆహారపు అలవాట్లు. ఆరోగ్యంపై సందేహాలుంటే తప్పకుండా వైద్యుల సలహా తీసుకోవాలి.

Kidney Stones: Tomato Eating Myth Busted | Causes, Prevention & Facts
Kidney Stones: Tomato Eating Myth Busted | Causes, Prevention & Facts

Kidney stones

హైదరాబాద్: వంట ఏదైనా సరే, అందులో టమాటా పడాల్సిందే. రుచికీ, రంగుకూ టమాటా ఇచ్చే కిక్కే వేరు. అయితే, టమాటాలు ఎక్కువగా తింటే కిడ్నీలో రాళ్లు (Kidney stones)ఏర్పడతాయని చాలా మంది భయపడుతుంటారు. ఈ భయం వల్ల టమాటాలను దూరం పెట్టే వారు కూడా ఉన్నారు. కానీ, అసలు నిజం ఏంటంటే.. టమాటా తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇదంతా కేవలం ఒక అపోహ మాత్రమేనని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఆక్సలేట్ భయం:
కిడ్నీలో ఏర్పడే రాళ్ల(Kidney stones)లో ‘కాల్షియం ఆక్సలేట్’ అత్యంత సాధారణం. టమాటాల్లో ఆక్సలేట్ ఉండటం వల్లే ఈ అపోహ పుట్టింది. అయితే, టమాటాల్లో ఉండే ఆక్సలేట్ పరిమాణం చాలా తక్కువ. 100 గ్రాముల టమాటాల్లో కేవలం 5 మిల్లీగ్రాముల ఆక్సలేట్ మాత్రమే ఉంటుంది. ఇంత తక్కువ మొత్తం ఆక్సలేట్ కిడ్నీలో రాళ్లు పెరగడానికి సరిపోదు.

Kidney Stones: Tomato Eating Myth Busted | Causes, Prevention & Facts
Kidney stones

అసలు కారణాలు :
టమాటాల కంటే కిడ్నీ ఆరోగ్యానికి హాని కలిగించే ఇతర అంశాలు చాలా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.

కిడ్నీ రాళ్లకు ప్రధాన కారణం శరీరానికి సరిపడా నీరు అందకపోవడం. రోజుకు కనీసం 2.5 నుండి 3 లీటర్ల నీరు తాగడం తప్పనిసరి. శరీరంలోని కొన్ని ఎంజైమ్ లోపాలు లేదా జీవక్రియ సంబంధిత వ్యాధుల వల్ల రాళ్లు ఏర్పడవచ్చు.

ఆక్సలోసిస్: ఇది ఒక అరుదైన వ్యాధి . దీనివల్ల మూత్రపిండాలు ఆక్సలేట్ స్ఫటికాలను విసర్జించలేక పోతాయి, ఇది కిడ్నీ ఫెయిల్యూర్ కి కూడా దారితీయవచ్చు.

ఆహారపు అలవాట్లు: యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు ప్యూరిన్లు ఎక్కువగా ఉండే మాంసాహారం, చేపలు తగ్గించాల్సి ఉంటుంది.

రాళ్లలో రకాలు :
కిడ్నీలో ఏర్పడే అన్ని రాళ్లు ఒకే రకమైనవి కావు. కాల్షియం ఆక్సలేట్ కాకుండా యూరిక్ యాసిడ్, స్ట్రువైట్, సిస్టీన్ రాళ్లు వంటి వివిధ రకాలు ఉంటాయి. శరీర తత్వాన్ని బట్టి, కిడ్నీ సమస్యలు లేదా మధుమేహం ఉన్నవారు వైద్యుల సలహాతో ఆహార నియమాలు పాటించాలి.

టమాటా తినడం వల్ల కిడ్నీ రాళ్లు వస్తాయనేది పక్కాగా ఒక అపోహే. టమాటా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే, ఇప్పటికే కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారు లేదా తీవ్రమైన స్టోన్ సమస్యలు ఉన్నవారు మాత్రం డాక్టర్ సలహా తీసుకోవడం ఉత్తమం. ఆరోగ్యం విషయంలో సొంత నిర్ణయాల కంటే నిపుణుల సూచనలే శ్రేయస్కరం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తరచుగా అడిగే ప్రశ్నలు

Q1: టమాటాలు తింటే కిడ్నీ స్టోన్స్ వస్తాయా?

A: కాదు. టమాటాల్లో ఆక్సలేట్ పరిమాణం చాలా తక్కువగా ఉండటంతో కిడ్నీ రాళ్లు వచ్చే అవకాశం లేదు.

Q2: కిడ్నీ రాళ్లను నివారించాలంటే ఏం చేయాలి?

A: రోజుకు 2.5–3 లీటర్ల నీరు తాగడం, ఉప్పు మరియు ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించడం చాలా ముఖ్యం.

Q3: కిడ్నీ రాళ్లకు టమాటాల కంటే ఎక్కువ హాని చేసే ఆహారాలు ఏవి?

A: అధిక ఉప్పు, రెడ్ మీట్, ప్యూరిన్లు ఎక్కువగా ఉండే ఆహారాలు కిడ్నీ రాళ్ల ప్రమాదాన్ని పెంచుతాయి.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »