పెంపుడు జంతువుల సంరక్షణలో పెడిగ్రీ సరికొత్త అడుగు: క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్‌తో భారీ ఒప్పందం

పెడిగ్రీ పెంపుడు జంతువుల యజమానుల్లో అవగాహన కల్పించేందుకు భారత స్టార్ మహిళా క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్‌తో జతకట్టింది. ఇందుకోసం వినూత్నంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

హైదరాబాద్: శునకాల ఆహార రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ‘పెడిగ్రీ’ (PEDIGREE®), పెంపుడు జంతువుల యజమానుల్లో అవగాహన కల్పించేందుకు భారత స్టార్ మహిళా క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్‌తో జతకట్టింది. కుక్కలకు పెట్టే వెట్ (గ్రేవీ) ఫుడ్ అనేది కేవలం ఒక అదనపు ఆహారం మాత్రమే కాదని, అది ప్రతిరోజూ ఇవ్వదగ్గ 100 శాతం సంపూర్ణ సమతుల ఆహారమని వివరించడమే ఈ సరికొత్త డిజిటల్ క్యాంపెయిన్ ప్రధాన ఉద్దేశ్యం.

పోషకాలతో కూడిన రుచికరమైన ఆహారం
మార్స్ ఇన్కార్పొరేటెడ్ సంస్థ రూపొందించిన ఈ ప్రచారం, పెంపుడు జంతువులకు ఇష్టమైన రుచితో పాటు వాటి ఎదుగుదలకు అవసరమైన సరైన పోషకాహారాన్ని అందించడంపై దృష్టి పెట్టింది. పెడిగ్రీ గ్రేవీలోని ఒక్క ప్యాకెట్ ఎనిమిది కోడి కాలేయాల్లో (Chicken Livers) ఉండే ప్రొటీన్‌తో సమానమైన శక్తిని శునకాలకు అందిస్తుంది. దీనిని ప్రతిరోజూ పెట్టదగ్గ సురక్షితమైన ఆహారంగా వాల్తామ్ పెట్‌కేర్ సైన్స్ ఇన్‌స్టిట్యూట్ ధృవీకరించింది. ఇంట్లో వండే సాధారణ ఆహారం ద్వారా కుక్కలకు అన్ని రకాల పోషకాలు అందకపోవచ్చు, కానీ పెడిగ్రీ గ్రేవీ ఆ లోపాన్ని పూడ్చి సమతుల్యతను కాపాడుతుందని సంస్థ స్పష్టం చేస్తోంది.

పెట్ పేరెంట్‌గా జెమిమా సందేశం
భారత యువ క్రికెట్ సంచలనం జెమిమా రోడ్రిగ్స్ స్వయంగా ఒక పెట్ పేరెంట్ కావడంతో, ఈ ప్రచారానికి ఆమె ఎంపిక మరింత బలాన్ని చేకూర్చింది. మైదానంలో ఆమె చూపే క్రమశిక్షణ ఉత్సాహం ఇక్కడ కూడా ప్రతిబింబించాయి. ఈ సందర్భంగా జెమిమా మాట్లాడుతూ.. “క్రికెట్‌లో రాణించడానికి మనకు పోషకాహారం ఎంత ముఖ్యమో, మన పెంపుడు జంతువులకు కూడా అంతే అవసరం. నా పెంపుడు జంతువు ‘జేడ్’ (Jade) పెడిగ్రీ గ్రేవీని ఎంతో ఇష్టంగా తింటుంది. దీని ద్వారా దానికి పూర్తి పోషకాలు అందుతున్నాయనే నమ్మకం నాకుంది” అని తెలిపారు.

మారనున్న ఆహారపు అలవాట్లు
భారతదేశంలో కుక్కల ఆహారపు అలవాట్లను మార్చడంలో ఈ ప్రచారం కీలక పాత్ర పోషించనుంది. మార్స్ పెట్ న్యూట్రిషన్ ఇండియా సీఎంఓ అయేషా హుడా మాట్లాడుతూ.. పెంపుడు జంతువుల యజమానులు కేవలం ఇంట్లో వండే ఆహారంపైనే ఆధారపడకుండా, శాస్త్రీయంగా తయారైన గ్రేవీ ఆహారాన్ని తమ రోజువారీ అలవాటుగా మార్చుకోవాలని కోరారు. జెమిమా నటించిన క్రికెట్ నేపథ్యంతో కూడిన వీడియోలు పెంపుడు జంతువులకు, యజమానులకు మధ్య ఉండే ప్రేమానుబంధాన్ని అందంగా చూపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా వెట్ ఫుడ్ విభాగంలో తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకోవాలని మార్స్ సంస్థ ఈ క్యాంపెయిన్ ద్వారా లక్ష్యంగా పెట్టుకుంది.

About Author:

Vidya Burujukadi

కంటెంట్ రైటర్‌గా మన వార్త వెబ్ సైట్‌కి విద్య.బి పనిచేస్తున్నారు. ప్రధానంగా బిజినెస్ వార్తలతో పాటు పర్సనల్ ఫైనాన్స్, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన తాజా సమాచారం, జనరల్ అంశాలకు సంబంధించిన కథనాలను ఆమె అందిస్తారు. విద్యకు తెలుగు మీడియా…

More About Author »