మధిర పట్టణంలో ఇటీవలి కాలంలో సహజీవనాలు (లైవ్-ఇన్ రిలేషన్‌షిప్స్) మరియు వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. ఈ సంబంధాలు గుట్టు చప్పుడు కాకుండా సాగి నన్నాళ్లు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇరువురు మధ్య ఆర్థికపరమైన సంబంధాలు విషయంలో ఘర్షణలు పెరిగి కేసులు వరకు వెళ్ళటంతో అప్పటివరకు కొనసాగిన సహజీవనాలు అత్యాచారం కేసులుగా నమోదు అవుతున్నారు. దీంతో క్షణికావేశంలో చేసిన తప్పులకి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మేజర్లైన స్త్రీ పురుషులు ఇరువురు ఇష్టంతో సహజీవనం చేస్తే తప్పు కాదని కోర్టులు తీర్పు ఇవ్వటంతో పాటు కేసులు నమోదు చేయొద్దని తీర్పు ఉండటంతో పోలీసులు ఏమి చేయలేకపోతున్నారు.
ఇటీవల మధిరలో జరిగిన మచ్చుకి కొన్ని సంఘటనలు మాత్రమే పరిశీలిద్దాం.
మధిరకు ఉద్యోగ నిమిత్తం వచ్చిన ఒక అధికారితో పట్టణానికి చెందిన ఒక మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొన్ని నెలలు తర్వాత ఇరువురు మధ్య విభేదాలు రావడంతో ఆమె కేసు పెడతామని బెదిరించడంతో ఆ అధికారి పరువు పోతుందని భయంతో నెలకి ఆమెకు 30 వేల రూపాయలు ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకొని గుట్టు చప్పుడు కాకుండా మధిర నుండి బదిలీ చేయించుకొని వెళ్లిపోయారు.
మరో మహిళ మధిర పట్టణంలో చిన్న చిన్న కాంట్రాక్టు పనులు చేస్తున్న వ్యక్తిని వలలో వేసుకుంది. మూడు నెలల తర్వాత డబ్బులు డిమాండ్ చేయడంతో నా దగ్గర లేవు అనడంతో అతనిపై తన కుటుంబ సభ్యులతో అసభ్యంగా ప్రవర్తించాడని తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపారు.
మరో విచిత్రం ఏంటంటే పెళ్లయి భార్యా పిల్లలతో కుటుంబంతో ఉంటున్న ఒక వ్యక్తి ఒక మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ, ఆ మహిళతో వ్యభిచారం చేయిస్తూ డబ్బులు సంపాదిస్తూ విలాసవంతమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు.
ఇద్దరు వ్యక్తులు ప్రాణ స్నేహితులుగా ఉన్నారు. అందులో ఒక స్నేహితుడు స్నేహానికి ఉన్న గుర్తుగా తన చేతిపై పచ్చబొట్టు పొడిపించుకున్నారు. సీన్ కట్ చేస్తే కొన్ని రోజులకి స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో పచ్చబొట్టు పొడిపించుకున్న వ్యక్తి స్నేహితుడని నమ్మకంగా ఇంటికి తీసుకువస్తే ఇంత దుర్మార్గపు పని చేస్తాడా అని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నం చేశాడు.
డబ్బులు కోసం కొంత మంది కిలాడీలు సోషల్ మీడియాను ఉపయోగించి విటువులకు వలవేసి వస్తే డబ్బులు లేకపోతే కేసులు అనే కొత్త రకం అనైతిక వ్యవహారాలను మధిరలో మొదలు పెట్టారు.
కోర్టు తీర్పులు వీరికి అనుకూలంగా ఉండటంతో యదేచ్ఛగా కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. కుటుంబాలు చిందర వందర అయ్యే ఈ క్షణకావేశపు దురాలవాట్లకు దూరంగా ఉండాలని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు.
