భారతదేశ ప్రముఖ ఎర్లీ చైల్డ్‌హుడ్ , కే-12 విద్యా సంస్థ అయిన లైట్‌హౌస్ లెర్నింగ్, హైదరాబాద్‌లోని కెన్నెడీ హై ది గ్లోబల్ స్కూల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఇరు సంస్థల కలయికతో సీబీఎస్ఈ , కేంబ్రిడ్జ్ విద్యా విధానంలో కెన్నెడీ హైకు ఉన్న రెండు దశాబ్దాల అనుభవానికి లైట్‌హౌస్ లెర్నింగ్ విద్యా నైపుణ్యం, సమగ్ర వనరులు , జాతీయ నెట్‌వర్క్ తోడవుతున్నాయి. దీని ద్వారా విద్యార్థులు , ఉపాధ్యాయులకు మెరుగైన అవకాశాలు లభించడంతో పాటు పాఠశాల తదుపరి దశ అభివృద్ధికి బాటలు పడతాయి.
పాఠశాల నేపథ్యం, లభించే సదుపాయాలు..
హైదరాబాద్‌లోని బాచుపల్లిలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో 2005లో డాక్టర్ ఎం. శివ కుమార్ రెడ్డి స్థాపించిన కెన్నెడీ హై ది గ్లోబల్ స్కూల్, ప్రీ-ప్రైమరీ నుండి 12వ తరగతి వరకు సీబీఎస్ఈ , కేంబ్రిడ్జ్ విద్యా విధానాలను అందిస్తోంది. ఈ భాగస్వామ్యం ద్వారా పాఠశాలకు సెంట్రల్ ఎడ్యుకేషన్ టీమ్, ఆరోగ్య , భద్రతా విధానం, విద్యార్థుల మానసిక శ్రేయస్సుకు తోడ్పడే సెంటర్ ఆఫ్ వెల్-బీయింగ్ , లైట్‌హౌస్ డిజిటల్ ల్యాబ్స్ వంటి సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. అలాగే పాఠశాల నాయకత్వ అభివృద్ధి, ఉమ్మడి బోధనా పద్ధతులు , నైపుణ్యాల మార్పిడి ద్వారా అభ్యాస అనుభవాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు.
సంస్థల ప్రతినిధుల స్పందన..
రెండు దశాబ్దాలుగా విద్యా ప్రమాణాలు , సమగ్ర విద్యతో కెన్నెడీ హై హైదరాబాద్‌లో మంచి పేరు సంపాదించిందని, తమ వనరులతో దాని బలాలను మరింత పెంపొందిస్తామని లైట్‌హౌస్ లెర్నింగ్ గ్రూప్ వ్యవస్థాపకుడు , సీఈఓ ప్రజోధ్ రాజన్ తెలిపారు. కెన్నెడీ హై విలువలను కాపాడుతూనే విద్యార్థులు , ఉపాధ్యాయులకు మరిన్ని అవకాశాలను కల్పించే భాగస్వామిగా లైట్‌హౌస్ లెర్నింగ్ నిలుస్తుందని కెన్నెడీ హై డైరెక్టర్ డాక్టర్ ఎం. శివ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ భాగస్వామ్యానికి వ్యూహాత్మక సలహాదారుగా లోఎస్ట్రో అడ్వైజర్స్, న్యాయ సలహాదారుగా క్విల్లాన్ పార్ట్‌నర్స్, ఆర్థిక సలహాదారులుగా ఈవై , ట్రాన్సాక్షన్ స్క్వేర్ వ్యవహరించాయి.