ఆదివారం అమావాస్య వస్తే అదృష్టమే.. ఈ చిన్న పరిహారంతో మీ కష్టాలన్నీ దూరం!

పుష్య మాసంలో వచ్చే మౌని అమావాస్య(Mauni Amavasya)కు విశేష ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. ఈ రోజున పితృ తర్పణాలు, దీపారాధన, మౌన వ్రతం చేయడం వల్ల పితృదోషాలు తొలగి, ఇంట్లో శుభం, ఆర్థిక లాభం మరియు మానసిక ప్రశాంతత లభిస్తాయి.

Mauni Amavasya 2026: Significance, Rituals and Powerful Remedies
Mauni Amavasya 2026: Significance, Rituals and Powerful Remedies

Mauni Amavasya

హైదరాబాద్: హిందూ ధర్మశాస్త్రం ప్రకారం పుష్య మాసంలో వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దీనినే మౌని అమావాస్య (Mauni Amavasya)లేదా చొల్లంగి అమావాస్య అని పిలుస్తారు. ఈ ఏడాది 2026, జనవరి 18వ తేదీన ఈ పర్వదినం వచ్చింది. విశేషమేమిటంటే, ఈసారి అమావాస్య ఆదివారం రోజున రావడం ఒక అరుదైన ఆధ్యాత్మిక ఘట్టంగా పండితులు పేర్కొంటున్నారు. ఆదివారం, అమావాస్య కలిసిన రోజున చేసే పూజలు, పరిహారాలు అత్యంత శక్తివంతమైన ఫలితాలను ఇస్తాయని, జాతకంలోని దోషాలను తొలగించి ఏడాది మొత్తం అఖండ రాజయోగాన్ని కలిగిస్తాయని నమ్ముతారు.

పితృ తర్పణాలు : మౌని అమావాస్య (Mauni Amavasya)రోజున నదీ స్నానం ఆచరించడం వల్ల విశేష పుణ్యఫలం దక్కుతుంది. స్నానం అనంతరం నల్ల నువ్వులు కలిపిన నీటితో పితృదేవతలకు తర్పణాలు వదలాలి. ఇలా చేయడం వల్ల 21 తరాల పితృదేవతలకు ఉన్నత లోకాలు ప్రాప్తిస్తాయని, దీనివల్ల పితృదోషాలు తొలగి వంశం వృద్ధి చెందుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

ఇంట్లో ప్రతికూల శక్తి నివారణ: ఇంట్లో గొడవలు తగ్గాలన్నా, పాజిటివ్ ఎనర్జీ పెరగాలన్నా ఈ చిన్న చిట్కా పాటించండి. ఒక గాజు పాత్రలో నీటిని తీసుకుని, అందులో కొద్దిగా పచ్చ కర్పూరం పొడిని కలపాలి. ఆ పాత్రను ఇంటి ప్రధాన గుమ్మం లోపలి వైపు ఒక మూలలో ఉంచాలి. అమావాస్య తిథి ముగిసే వరకు అక్కడే ఉంచి, మరుసటి రోజు ఆ నీటిని మొక్కలకు పోయడం వల్ల ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.

దృష్టి దోషాలు, ఆర్థిక లాభం: ఎదుటివారి ఏడుపు, నరదిష్టి మరియు శత్రు బాధల నుండి విముక్తి పొందడానికి సాయంత్రం 5 నుండి 6 గంటల మధ్య ఇంటి గుమ్మం వద్ద దీపం వెలిగించాలి. తమలపాకులపై రాళ్ల ఉప్పు, నల్ల నువ్వులు ఉంచి, వాటిపై మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో మూడు ఒత్తుల దీపం వెలిగించడం వల్ల దుష్టశక్తులు దరిచేరవు. అలాగే, లక్ష్మీదేవికి మిరియపు గంధాన్ని సమర్పించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ పవిత్ర రోజున మౌనాన్ని పాటిస్తూ దైవ స్మరణ చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు

Q1: మౌని అమావాస్య అంటే ఏమిటి?

A: పుష్య మాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అంటారు. ఈ రోజున మౌనం పాటిస్తూ పూజలు చేయడం విశేష ఫలితాలను ఇస్తుందని నమ్మకం.

Q2: మౌని అమావాస్య రోజున పితృ తర్పణం చేయకపోతే ఏమవుతుంది?

A: తప్పనిసరి కాదు. కానీ చేస్తే పితృదోషాలు తొలగి కుటుంబంలో శుభఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

Q3: ఇంట్లోనే మౌని అమావాస్య పూజ చేయవచ్చా?

A: అవును. నదీ స్నానం సాధ్యం కాకపోతే ఇంట్లో శుభ్రంగా స్నానం చేసి పూజ, దీపారాధన చేయవచ్చు

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »