సోయా ప్రొడక్ట్స్ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా? ప్రోటీన్ నుంచి ఐరన్ వరకు

సోయా మీల్ మేకర్, సోయా గ్రాన్యూల్స్, టోఫు వంటి ప్రొడక్ట్స్‌లో లభించే ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్ వంటి పోషకాల గురించి తెలుసుకోండి.

Soy Products Benefits
Soy Products Benefits

సోయాతో తయారు చేసిన ప్రొడక్ట్స్ మన శరీరానికి తక్కువ ఖర్చులో ఎక్కువ మాంసకృత్తులు, ఎక్కువ ఫైబర్, ఎక్కువ కాల్షియం, ఎక్కువ ఐరన్ అందించడానికి చాలా బెస్ట్‌గా పనికొస్తాయి. అందుకని ప్రతిరోజు ఏదో ఒక వెరైటీ సోయా ప్రొడక్ట్‌ను మనం వంటల్లో వాడుకుంటే మంచిది.

ఇది వంటలు చేసే ఆడవారికి, ఇంట్లో తల్లులకు ఈ నాలెడ్జ్ రావాలి. లేదా మీరు చూసిన పిల్లలు కానీ, పెద్దలు కానీ ఇంట్లో ఆడవారికి ఎడ్యుకేట్ చేసి ఇలాంటి వాటిని కొనిపెట్టి ఎందుకు తినాలో, ఎన్ని రకాల లాభాలు వస్తాయో, సోయా ప్రొడక్ట్స్ వాడుకుంటే ఏ రకమైన ప్రొడక్ట్స్‌లో ఎంత పోషకాలు ఉంటాయో వీటన్నిటి ద్వారా మీకు హై ప్రోటీన్‌తో పాటు ఇతర పోషకాలు వచ్చే విధంగా మంచి అవగాహన సోయా ప్రొడక్ట్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం.

మామూలుగా సోయా ప్రొడక్ట్స్‌లో తీసుకుంటేనండి.. సోయా మీల్ మేకర్, సోయా కీమా, సోయా గ్రాన్యూల్స్ ఇలాంటివన్నీ మార్కెట్‌లో వస్తున్నాయి. సోయా టోఫు మీ అందరికీ తెలుసు.

ఇప్పుడు చెప్పిన మూడు నాలుగు రకాల సోయా ప్రొడక్ట్స్‌లో వంద గ్రాములు తీసుకుంటే 345 కిలో కేలరీల శక్తి ఉంటుంది. మాంసం కంటే త్రీ టు ఫోర్ టైమ్స్ బలం ఎక్కువ. అంత ఎక్కువ లాభం ఉంటుంది ఇందులో.
ఇక ప్రోటీన్ అంటారా.. వంద గ్రాములు సోయా ప్రొడక్ట్స్ ఇప్పుడు చెప్పినవి ఏవి తీసుకున్నా 52 గ్రాములు ప్రోటీన్ ఉంటుంది. మేక మాంసంలో 21 గ్రాములు, వంద గ్రాముల కోడి మాంసంలో 24-25 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కానీ ఇందులో డబుల్ ప్రోటీన్ ఉంటుంది.

మాంసం, చేపల కంటే రేట్ ఎంత తక్కువో ఒక్కసారి ఆలోచించుకోండి.

ఇక ఇందులో ఉండే పోషకాలలో తీసుకుంటేనండి.. కార్బోహైడ్రేట్స్ 33 గ్రాములు, కొవ్వులు 0.5 గ్రామ్స్. అసలు ఫ్యాట్ ఉండదు. ఇక ఫైబర్ విషయానికి వస్తే 13 గ్రాములు. ఈ పీచు చాలా మంచిది.
కాల్షియం 350 మిల్లీగ్రాములు. పాల కంటే ఫోర్ టైమ్స్ కాల్షియం ఎక్కువ. సోయాలో అందుకనే సోయా మిల్క్ వాడొచ్చు, సోయా పెరుగు వాడుకోవచ్చు. ఏ రూపాల్లో వాడినా కాల్షియం రిచ్ సోయా ఎముక పుష్టికి చాలా మంచిది.

మన బాడీకి ఐరన్ 28 మిల్లీగ్రాములు కావాలి. వంద గ్రాముల మీల్ మేకర్‌లో గానీ, సోయా గ్రాన్యూల్స్‌లో గానీ 15 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. మన ఊరికే ఇన్ని మీల్ మేకర్లు తింటే వంద గ్రాములు అయిపోతాయి. 15 మిల్లీగ్రాముల ఐరన్ వెళ్తుంది. రక్తహీనత రాకుండా చాలా చాలా మంచి ప్రొడక్ట్ సోయా.
అందుకని సోయా ప్రొడక్ట్స్‌ను కంపల్సరీగా ఇంట్లో అందరం ఏదో ఒక రూపంలో ప్రతిరోజు రకరకాల వాటిలో కలుపు చేసుకుంటే చాలా బాగుంటుంది.

సోయాలో అంత ప్రోటీన్ ఎందుకు ఉంటుంది?

మరి ఈ సోయాకి ఎందుకు ఇంత ప్రోటీన్ వస్తుంది అనే దాంట్లో ఒక విశేషత ఉంది. మామూలుగా ఏ మొక్కలు మనం పెట్టినా నేలలో ఉండే పోషకాల నుంచి అవన్నిటినీ తయారు చేసుకుంటూ ఉంటాయి.
కానీ సోయాకు ఉన్న ఒక విశేషత ఏంటంటే నేలతో పాటు గాలిలో ఉన్న వాటిని కూడా తీసుకునే గుణం ఇందులో ఉంది. మరి సోయా మొక్కలకు ఉండే వేళ్లలో రైజోబియం అనే ఒక స్పెషల్ గుడ్ బ్యాక్టీరియా ఉంటుందన్నమాట.

ఈ బ్యాక్టీరియా ఉండటం వల్ల సోయా మొక్కకి గాలిలో ఉండే నత్రజనిని తీసుకొని నేరుగా సోయాలో ఎక్కువ ప్రోటీన్, అమైనో యాసిడ్స్ ఇట్లాంటివి బాగా తయారయ్యేటట్టు చేయగలుగుతుందన్నమాట.
నేల నుంచి తీసుకున్నప్పుడు ఎప్పుడూ ఇంత పెరగదు. కానీ గాలి నుంచి డైరెక్ట్‌గానే దాన్ని తీసుకొని ఇట్లా కన్వర్షన్ చేసుకొని మరి ప్రోటీన్ ప్రొడక్షన్ బాగా చేసుకోవడానికి సోయా మొక్కలకి వేళ్లలో ఉండే గుణం, అందులో ఉండే ఈ బ్యాక్టీరియా కారణమని సైంటిస్టులు రుజువు చేశారు.

అందుకని సోయాకంత ప్రోటీన్. ఇందులో తొమ్మిది, పది రకాల అమైనో యాసిడ్స్, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ మనకు చాలా ముఖ్యంగా లభిస్తూ ఉంటాయి. అందుకని సామాన్యులు, పేదలకు సైతం అతి తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రోటీన్ అందించి, ఎక్కువ పోషకాలను అందించి.. ఒకటి కాదు కాదు ఇక్కడ కాల్షియం, ఐరన్, ప్రోటీన్ ఈ మూడు చూడండి ఎంత ఎక్కువ ఉన్నాయి. అసలు ఫైబర్.. నాలుగు ముఖ్యమైన పోషకాలు ఒక ఆహారంలో, పైగా అంత ఖర్చు తక్కువలో మనకి ప్రోటీన్ అందుతుంది.

పిల్లలు, మహిళలకు సోయా ఉపయోగం

ఒక కేజీ బరువుకి ఒక గ్రాము చొప్పున పెద్దలందరికీ ప్రోటీన్ కావాలి. ఎదిగే వయసులో ఉండే పిల్లలకు ఒక కేజీ బరువుకి ఒకటిన్నర నుంచి రెండు గ్రాముల మధ్యలో కావాలి.

అదే వ్యాయామాలు, జిమ్ బాగా చేసేవాళ్లకి, గర్భవతులకు, బాలింతలకు ఒక కేజీ బరువుకు రెండు గ్రాముల నుంచి రెండున్నర గ్రాముల మధ్యలో కావాలి. ఇంత అవసరం ఉంది.

నూటికి తొంబై శాతం మందికి పైగా ప్రోటీన్ డెఫిషియన్సీ వచ్చి హార్మోన్స్ తయారవ్వడం లేదని చెబుతున్నారు.

అందుకని ముఖ్యంగా స్త్రీలకు సోయా ఎంత లాభం అంటే.. ముఖ్యంగా హార్మోన్స్ అన్నీ లోపించడానికి, కండ పుష్టి తగ్గిపోవడానికి, ఇమ్యూనిటీ తగ్గిపోవడానికి ప్రోటీన్ డెఫిషియన్సీ కారణమవుతుంది.
స్త్రీల విషయానికి వస్తేనండి.. మెనోపాజ్ వచ్చిన తర్వాత ఎముకలు గుల్లబారిపోవడం ఇట్లాంటివి ఈస్ట్రోజెన్ తగ్గిపోవడం వల్ల జరుగుతాయి.

సోయాలో ఈస్ట్రోజెన్ ఎలా, ఏ రూపంలో ఉంటుందో తెలుసా? డైరెక్ట్‌గా ఫైటో ఈస్ట్రోజెన్ రూపంలో ఉంటుంది. మొక్కల్లో ఈస్ట్రోజెన్‌ను ఫైటో ఈస్ట్రోజెన్ అంటారు. అందుకని ఈస్ట్రోజెన్ హార్మోన్ పెరిగి, ఎముకలకు కావాల్సిన కాల్షియం బాగా ఉంది ఇందులో. అందుకని ఈస్ట్రోజెన్ హార్మోన్ మరియు కాల్షియం ఈ రెండు ఉండటం వల్ల స్త్రీలకు ఎముక పుష్టికి, పీరియడ్స్ ఆగిపోయే సమయం దగ్గరకి వచ్చినప్పటి నుంచి ఈస్ట్రోజెన్ డౌన్ అవుతుంది కదా.. అలాంటి వారికి ఎముకలు గుల్లబారిన వారికి సోయా ప్రొడక్ట్స్ చాలా చాలా మంచిది అనడానికి ఇది ఒక రీజన్ అన్నమాట.

సోయా ప్రొడక్ట్స్‌ను ఎలా వాడుకోవాలి?

ఇలాంటి సోయా ప్రొడక్ట్స్‌ను మీల్ మేకర్ అనుకోండి. ఎంత సింపుల్‌గా ఉడికితే.. వేడి నీళ్లలో, బాగా మరిగిన నీళ్లలో వేసేసి తీసేస్తే అయిపోయాయి. మీరు అట్లా చేసుకుని ఎందులో వేసుకున్నా గ్రేవీ కర్రీలు చక్కగా వెళ్లిపోతాయి. ప్రతిరోజు అన్నిట్లో అన్నీ పడేసేసేయండి. ఫ్యామిలీ మొత్తానికి వెళ్లిపోతాయి.
సోయా కీమాగా, సోయా గ్రాన్యూల్స్‌గా మార్కెట్‌లో ఉన్న వాటిని తెచ్చి మనం వేడి నీళ్లలో తీసేసి ఫ్రైస్ అన్నిటిలో అట్లా చల్లయండి.

అంటే పిల్లలకి ఇట్లాంటివి వేసినప్పుడు ఇంట్లో వాళ్లకి తెలీదు. కానీ ఇండైరెక్ట్‌గా కుటుంబ ఆరోగ్యానికి అందరికీ కాస్త శరీరం దృఢంగా, మంచి ప్రోటీన్ అందటం కోసం ఆడవారికి ఇలాంటి టెక్నిక్స్ తెలిసి రోజు వాడగలిగితే అంత మంచిదన్నమాట.

సోయా ప్రొడక్ట్స్‌ను నూనెలో వేసి వేయించినప్పుడు మాత్రం మనకి కొంచెం ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. అలాంటివి చేయకండి. కాస్త సాధ్యమైనంత వరకు నూనె ఎక్కువగా వాడకుండా తక్కువ నూనెతో ఇలాంటి ప్రొడక్ట్స్‌ను గనుక చేసుకుని తిన్నప్పుడు ఆ బెనిఫిట్స్ ఎక్కువగా వస్తాయి.

నూనె ఎక్కువగా వేసి వేయించామనుకోండి. ఇప్పుడు సోయా మీల్ మేకర్‌ను నూనెలో వేయించి దానిపైన పిండి పెట్టేసేసి మంచూరియన్‌లాగా చేస్తున్నారు. ఆ నూనె బాగా వేడైనప్పుడు కొవ్వులే చెడిపోతున్నాయి. ప్రోటీన్ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా మారిపోతాయి. కాబట్టి అనేక రకాలుగా నష్టాలు వచ్చే విధంగా తయారవుతాయి.

ఇలా మనం ఆలోచించి ఇలాంటి సోయా ప్రొడక్ట్స్ కనుక రెగ్యులర్‌గా వాడుకోగలిగితే మీరు ప్రతిరోజూ పిల్లలకి గనుక ఇట్లా పెడితే ఎదగడానికి, కండ పుష్టికి వాళ్లకి చాలా మంచిది.

అసలు గర్భవతి, బాలింత గనక వేరే ప్రోటీన్ పౌడర్స్, ప్రోటీన్ షేక్స్ అస్సలు ముట్టుకోవాల్సిన పని లేదు. జిమ్‌కి వెళ్లేవారు, ఎక్సర్సైజ్ చేసేవారు కూడా ఇంకొక సోర్స్ అనేది ఇంత తక్కువ ఖర్చులో, ఇంత బెస్ట్‌గా ఇంకోటి ఉండదన్నమాట.

కాబట్టి అందరి ఇళ్లలో సోయా ప్రొడక్ట్స్‌ను ఎక్కువగా పెట్టుకుని ఇట్లా వాడుకుంటే మంచిది.
సోయా స్నాక్స్ విషయంలో జాగ్రత్త. స్నాక్స్ కూడా సోయా ప్రొడక్ట్స్ చాలా మంచి టేస్ట్‌గా ఉంటాయి. ఇప్పుడు మార్కెట్‌లో సోయా ప్రొడక్ట్స్‌తోనే ఎక్కువ స్నాక్స్ తయారు చేసి అమ్ముతున్నారు.

కానీ కృత్రిమంగా చేసే సోయా ప్రొడక్ట్స్‌లో ఫ్లేవర్స్, కలర్స్, ప్రిజర్వేటివ్స్, బైండింగ్ ఏజెంట్స్ ఇట్లాంటివన్నీ కలుపుతారు కాబట్టి నష్టం ఎక్కువ ఉంటుంది. అలా లేకుండా ఇలా గనక చేయగలిగితే చాలా బాగుంటుంది. అమ్మలందరూ సోయా ప్రొడక్ట్స్‌ను కాస్త ఇంట్లో అన్ని రూపాల్లో ఇట్లా వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »