US Iran Peace Talks Failure: అమెరికా–ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. పాకిస్థాన్ వేదికగా 21 గంటల చర్చలు జరిపిన నో రిజ‌ల్ట్..!

పాకిస్థాన్‌లో జరిగిన అమెరికా–ఇరాన్ కీలక శాంతి చర్చలు ఎటువంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రకటనతో ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

US Vice President JD Vance addressing the media regarding the failure of peace talks with Iran in Pakistan.
US Vice President JD Vance addressing the media regarding the failure of peace talks with Iran in Pakistan.

US Iran Peace Talks Failure: అమెరికా–ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు పాకిస్థాన్ వేదికగా నిర్వహించిన కీలక శాంతి చర్చలు ఎటువంటి ఫలితం లేకుండానే ముగిశాయి. ఈ విషయాన్ని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అధికారికంగా వెల్లడిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.గత రెండు రోజులుగా సాగిన ఈ చర్చలు సుమారు 21 గంటల పాటు కొనసాగినప్పటికీ, ఇరు దేశాల మధ్య ఎలాంటి ఒప్పందం కుదరలేదు. చర్చల అనంతరం వాన్స్ మాట్లాడుతూ, అమెరికా ముందుంచిన కఠినమైన షరతులను ఇరాన్ అంగీకరించలేదని స్పష్టం చేశారు.

ఇరాన్‌కు భారీ నష్టం?

మేము కొన్ని స్పష్టమైన రెడ్ లైన్లు, షరతులను ఇరాన్ ముందు ఉంచాం. కానీ వారు వాటిని అంగీకరించలేదు. అందుకే ఎటువంటి డీల్ లేకుండానే మేము అమెరికాకు తిరిగి వెళ్తున్నాం అని ఆయన పేర్కొన్నారు. ఈ చర్చలు విఫలమవడం వల్ల అమెరికా కంటే ఇరాన్‌కే ఎక్కువ నష్టం జరుగుతుందని వాన్స్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఆర్థికంగా, సైనికంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఇరాన్, అమెరికా షరతులకు అంగీకరించకపోవడం ఆ దేశ భవిష్యత్తుకు ప్రమాదకరమని హెచ్చరించారు. డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని అమెరికా ప్రభుత్వం తన విధానాల్లో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని వాన్స్ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది.

ఈ చర్చలను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన పాకిస్థాన్ ప్రభుత్వానికి జేడీ వాన్స్ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా పాక్ ప్రధానమంత్రి, ఆ దేశ సైన్యాధిపతి చూపిన చొరవను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ చర్చలు విఫలం కావడంతో అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మధ్యప్రాచ్యంలో అస్థిర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, ఈ పరిణామం గ్లోబల్ మార్కెట్లు, భద్రతా పరిస్థితులపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. శాంతి చర్చలు విఫలమవడం ప్రాంతీయ స్థిరత్వానికి సవాలుగా మారగా, భవిష్యత్తులో ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు ఎలా మారుతాయన్నది ఆసక్తికరంగా మారింది.

Also Read:

About Author:

Gujja Raju

గత 3 సంవత్సరాలుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్ట్ Gujja Raju. ప్రముఖ తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ Times Telugu మరియు లోకల్ న్యూస్ మీడియా సంస్థల్లో పనిచేసి వార్తా రచనలో అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం ప్రముఖ…

More About Author »