వాషింగ్టన్/న్యూఢిల్లీ: ప్రపంచం మరో భారీ యుద్ధాన్ని చూడబోతోందా అని ఆందోళన చెందుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ సంస్కృతిని తుడిచిపెట్టేస్తానని హెచ్చరించిన ట్రంప్, ఆఖరి నిమిషంలో 2 వారాల పాటు కాల్పుల విరమణ (Ceasefire) ప్రకటిస్తూ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ నిర్ణయం వెనుక పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ చేసిన రాయబారం కీలకంగా నిలిచింది.
ట్రంప్ పోస్ట్‌లోని ముఖ్యాంశాలు:
ట్రంప్ తన తాజా పోస్ట్‌లో ఇలా పేర్కొన్నారు:
పాక్ విన్నపం: పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ కోరిక మేరకు ఇరాన్ మీద జరపాలనుకున్న వినాశకరమైన దాడులను నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
కండిషన్: ఇరాన్ వెంటనే మరియు సురక్షితంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ (Strait of Hormuz) ను తెరిస్తేనే ఈ యుద్ధ విరామం వర్తిస్తుంది.
10 పాయింట్ల ప్రతిపాదన: ఇరాన్ నుండి 10 పాయింట్ల ప్రతిపాదన అందిందని, ఇది చర్చలకు అనువుగా ఉందని ట్రంప్ వెల్లడించారు. అమెరికా ఇప్పటికే తన సైనిక లక్ష్యాలను చేరుకుందని ఆయన స్పష్టం చేశారు.
US President Donald Trump posts, “Based on conversations with Prime Minister Shehbaz Sharif and Field Marshal Asim Munir, of Pakistan, and wherein they requested that I hold off the destructive force being sent tonight to Iran, and subject to the Islamic Republic of Iran agreeing… pic.twitter.com/Vmhlcm8CzR
ఇవి కూడా చదవండి— ANI (@ANI) April 7, 2026
సోషల్ మీడియాలో పేలుతున్న మీమ్స్ – భారత్ విదేశాంగ విధానంపై చర్చ!
ట్రంప్ నిర్ణయం వెలువడిన వెంటనే సోషల్ మీడియాలో భారీ ఎత్తున స్పందనలు వస్తున్నాయి.
హేరా ఫేరి మీమ్స్: కొందరు నెటిజన్లు ‘హేరా ఫేరి’ సినిమాలోని బాబు భయ్యా, రాజు క్యారెక్టర్లతో ట్రంప్, పాకిస్థాన్‌లను పోలుస్తూ సెటైర్లు వేస్తున్నారు.
విదేశాంగ విధానంపై ప్రశ్నలు: పాకిస్థాన్ మధ్యవర్తిత్వం చేయడం చూసి, “భారత విదేశాంగ విధానం బలహీనపడిందా? పాకిస్థాన్ ముందంజలో ఉందా?” అని కొందరు ప్రశ్నిస్తుండగా, మరికొందరు ఇది ట్రంప్ ఆడుతున్న డ్రామా అని, యుద్ధం నుంచి తప్పించుకోవడానికి పాక్‌ను ఒక సాకుగా వాడుకుంటున్నారని అభిప్రాయపడుతున్నారు.
చెక్ మేట్: మరికొందరు నెటిజన్లు ఇది ఇజ్రాయెల్ ఆయుధాలను రీలోడ్ చేసుకోవడానికి ట్రంప్ ఇచ్చిన విరామం మాత్రమేనని, అసలు ఆట ముందుందని విశ్లేషిస్తున్నారు.
రాబోయే రెండు వారాల సమయం ఇరాన్-అమెరికా సంబంధాలకే కాకుండా, మొత్తం మధ్యప్రాచ్య శాంతికి అత్యంత కీలకం. ట్రంప్ చెప్పినట్లుగా “శాంతి ఒప్పందం” జరుగుతుందా లేదా అనేది వేచి చూడాలి.
Also Read :
మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావం క్రీడారంగంపై కూడా.. మెస్సీ, రొనాల్డో, హామిల్టన్ షెడ్యూల్స్ గందరగోళం
ఖమేనీ కుటుంబం మొత్తం చనిపోయిందా.. ఇరానియన్ల సంబురాలు ఓ రేంజ్‌లో… వీడియోలు వైరల్
హర్మూజ్ జలసంధి సమీపంలో విషాదం.. భారత కెప్టెన్ ఆకస్మిక మరణం, విదేశాల్లో చిక్కుకున్న పార్థివ దేహం


