టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ మధ్య గత ఆరేళ్లుగా కొనసాగిన ప్రేమాయణం గతేడాది చివర్లో పెళ్లిగా మారుతుందనే అంచనాలు నెలకొన్నాయి. నవంబర్ 23న వివాహం జరగాల్సి ఉండగా, ఆఖరి నిమిషంలో పెళ్లి రద్దు కావడం అప్పట్లోనే అభిమానులు, క్రీడా వర్గాలను షాక్‌కు గురిచేసింది. ఈ ఘటనపై అప్పట్లో స్పష్టమైన కారణాలు బయటకు రాకపోవడంతో అనేక ఊహాగానాలు చెలరేగాయి.
ఇప్పుడా వ్యవహారానికి కొత్త మలుపు తిరిగింది. స్మృతి చిన్ననాటి స్నేహితుడిగా చెప్పబడుతున్న విజ్ఞాన్ మానే ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు చేశాడు. పెళ్లి వేడుకలు జరుగుతున్న సమయంలోనే పలాష్ ముచ్చల్ మరో మహిళతో బెడ్రూంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడని ఆయన ఆరోపించాడు. ఆ దృశ్యాన్ని చూసిన స్మృతి సహచర మహిళా క్రికెటర్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారని, పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని మానే పేర్కొన్నాడు.
ఈ ఆరోపణలతో పాటు ఆర్థిక లావాదేవీలపై కూడా విజ్ఞాన్ మానే తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. పలాష్ కుటుంబం తనను మోసం చేసిందని, సినిమా పెట్టుబడుల పేరుతో భారీ మొత్తాన్ని వసూలు చేశారని ఆరోపించాడు. పెళ్లి రద్దైన తర్వాత తనను అన్ని విధాలా దూరం పెట్టారని, చివరకు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని ఆయన తెలిపాడు.
స్పందించిన పలాష్ ముచ్చల్..
ఈ ఆరోపణలపై పలాష్ ముచ్చల్ వెంటనే స్పందించాడు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా విజ్ఞాన్ మానే చేస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా అబద్ధాలని, తన ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆయన ఖండించాడు. ఈ వ్యవహారాన్ని చట్టపరంగా ఎదుర్కొంటానని, తన లాయర్ ద్వారా న్యాయ చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశాడు. మరోవైపు విజ్ఞాన్ మానే మాత్రం తన దగ్గర కాల్ రికార్డింగ్స్, చాట్ ఆధారాలు ఉన్నాయని, అవన్నీ మీడియాకు, పోలీసులకు సమర్పిస్తానని సవాల్ విసిరాడు.
Also, Read: న్యూజిలాండ్‌పై భారీ విజయం నడుమ టీమిండియాకు ఎదురుదెబ్బ.. గాయంతో మరో ప్లేయర్ ఔట్?
స్మృతి రియాక్షన్ ఏంటి?
- ఈ మొత్తం వివాదంపై స్మృతి మంధాన ఇప్పటివరకు స్పందించని స్మృతి
- స్మృతి మౌనం పాటిస్తుండగా, స్నేహితుడి ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్
- మహిళా క్రికెటర్లు పలాష్‌పై చేయి చేసుకున్నారన్న అంశం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
కీలక అంశాలు:
- స్మృతి మంధాన–పలాష్ ముచ్చల్ పెళ్లి 2024 నవంబర్ 23న జరగాల్సి ఉండగా చివరి నిమిషంలో రద్దు
- స్మృతి స్నేహితుడు విజ్ఞాన్ మానే సంచలన ఆరోపణలు
- పెళ్లి వేడుకల సమయంలో పలాష్ మరో మహిళతో పట్టుబడ్డాడన్న ఆరోపణ
- మహిళా క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారన్న వ్యాఖ్య
- ‘నజరియా’ సినిమా పెట్టుబడుల పేరుతో రూ.40 లక్షలు వసూలు చేశారన్న ఆరోపణ
- మరో రూ.10 లక్షలు ఇవ్వకపోతే డబ్బులు తిరిగి ఇవ్వమన్న బ్లాక్‌మెయిల్ ఆరోపణ
- పలాష్ ముచ్చల్ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తూ చట్టపరమైన చర్యల హెచ్చరిక
- విజ్ఞాన్ మానే వద్ద కాల్ రికార్డులు, చాట్ ఆధారాలు ఉన్నాయన్న వాదన
స్మృతి మంధాన మౌనం:
ఈ ఆరోపణలు, కౌంటర్ ఆరోపణల మధ్య అసలు నిజం ఏంటన్నది పోలీసుల దర్యాప్తులోనే తేలాల్సి ఉంది. ఒకవేళ విజ్ఞాన్ మానే చెబుతున్న విషయాలు నిజమైతే, పలాష్ ముచ్చల్ కెరీర్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.