వరుణుడు కరుణ చూపలేదు. భానుడు చెలరేగిపోతున్నాడు. భయంకరమైన ఎల్నినో ప్రభావం రోజురోజుకీ అధికమవుతోంది. ముందు ముందు వర్షాలు పడతాయన్న ఆశ లేదు. ఖమ్మం జిల్లాలో మొత్తం 17 మండలాలు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటుండటంతో, వాటిని కరువు మండలాలుగా గుర్తించి జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
ఇక జిల్లాలో భూగర్భ జలాలు గత ఏడాదితో పోలిస్తే మరింత తక్కువకు పడిపోయాయి. అక్టోబర్ మూడో వారం వచ్చేసింది. వర్షాకాలం ముగిసింది. ఇక ముందు వానలు కురుస్తాయన్న నమ్మకం లేదు. చేతికందాల్సిన పంటలు ఎడుతున్నాయి. నిండుకుండలా ఉండాల్సిన చెరువులు, కుంటలు వట్టిపోతున్నాయి. ఎప్పుడూ లేనట్లుగా నేలతల్లి నెర్రలు బారుతోంది.
ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉందని ముందు నుంచే చెబుతున్నా.. వాస్తవ పరిస్థితి చూశాక కానీ ఎవరికీ అర్థం కాలేదు. దీంతో ఖమ్మం జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొంటున్నాయి.
ఖమ్మం జిల్లాలోని మొత్తం 21 మండలాల్లో 17 మండలాల్లో సాధారణం కన్నా 20 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. వీటిని కరువు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి ప్రభుత్వానికి జిల్లా అధికారులు ప్రతిపాదనలు సమర్పించారు.
17 మండలాల్లో కరువు పరిస్థితులు
ఖమ్మం జిల్లా ప్రస్తుత కలెక్టర్ శ్రీ దివాకర్ టీఎస్, ఐఏఎస్ మాట్లాడుతూ..
“నవంబర్ అనేది మనకు మాన్సూన్ ముగిసే సమయం కాబట్టి, ఇప్పుడు మేము ప్రాథమిక విశ్లేషణ (preliminary analysis) చేసి ప్రభుత్వానికి నివేదిక పంపడం జరిగింది. దాని ప్రకారం దాదాపు 17 మండలాల్లో కరువు ఉండవచ్చు అనే ప్రాథమిక అంచనాలు వేయడం జరిగింది. అందులో పది మండలాలు తీవ్రంగా (severely) కరువు ప్రభావితం అవుతాయని, మరో ఏడు మండలాలు మోడరేట్గా కరువు ప్రభావితం అవుతాయని అంచనా వేసి ప్రభుత్వానికి పంపడం జరిగింది” అని తెలిపారు.
పడిపోతున్న భూగర్భ జలాలు
వర్షాలు లేకపోవడం, ఉష్ణోగ్రతలు పెరగడంతో భూగర్భ జలాలు అంతకంతకూ తగ్గుతున్నాయి. జిల్లాలో గత వర్షాకాలంలో భూగర్భ జలమట్టం సుమారు 2.5 మీటర్ల లోతులో ఉండగా, ప్రస్తుతం 3.5 నుంచి 6 మీటర్ల లోతుకు పడిపోయింది.
గత వానాకాలంతో పోలిస్తే, అధికారుల అవగాహన కార్యక్రమాల ఫలితంగా జిల్లాలో వరి సాగు విస్తీర్ణం సుమారు 90 వేల ఎకరాలు తగ్గిందని, ఇతర పంటలు వేసినట్లు కలెక్టర్ దివాకర్ వెల్లడించారు.
నాలుగు మండలాల్లో తీవ్రంగా భూగర్భ జలమట్టం పతనం
రైతుల పంటలు ఎండిపోకుండా ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకుంటున్నట్లు నగర పోలీస్ కమిషనర్ తెలిపారు.
“కామేపల్లి, ఎర్రుపాలెం, సత్తుపల్లి, ఏన్కూరు మండలాల్లో భూగర్భ జలమట్టం (water table) తీవ్రంగా పడిపోయింది. రబీ సీజన్లో దయచేసి మాకు బోర్ ఉంది లేదా చెరువు దగ్గర నీరు కనిపిస్తుంది అని నమ్మి వరి పంటను వేయవద్దు. వేస్తే చాలా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. మేము రైతులను కోరుతున్నాము” అని తెలిపారు.
వంద రోజుల పనుల్లో ఉపాధి కల్పన
“వీఎన్జీ రాంజీ ద్వారా వంద రోజుల పనుల్లో ఎంత పని అడిగితే అంత పని ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. పోలీస్ శాఖ తరఫున అడ్మినిస్ట్రేషన్కు పూర్తి స్థాయిలో మద్దతుగా మేము వ్యవహరిస్తున్నాం. ఎక్కడైనా రైతుకు సమస్య ఎదురైతే, మన అడ్మినిస్ట్రేషన్లో ఎక్కడైనా మీకు సమస్య ఉంటే అక్కడ పోలీస్ అందుబాటులో ఉంటారు. మేము కూడా వాళ్లకు ఇబ్బంది కలిగించడానికి లేము. మనం మీకు సహకరించడానికి అందుబాటులో ఉన్నాం” అని పేర్కొన్నారు.
రాత్రివేళల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని, కొన్ని ప్రాంతాల్లో పికెట్లు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులకు రాత్రివేళల్లో ఏవైనా సమస్యలు ఉంటే, నీటి లభ్యతకు సంబంధించిన సమయాల్లో కూడా అధికారులు అందుబాటులో ఉంటారని చెప్పారు.
అందుబాటులో ఉన్న నీటిని అవసరమైన ప్రాంతాలకు
ప్రస్తుత పంటలను కాపాడేందుకు జిల్లా యంత్రాంగం అన్ని విధాలా ప్రయత్నిస్తోందని అధికారులు తెలిపారు. పోలీస్, నీటిపారుదల, వ్యవసాయ శాఖల సమన్వయంతో అందుబాటులో ఉన్న నీటిని అవసరమైన ప్రాంతాలకు చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.


