TG Weather | తెలంగాణలో ఎండల తీవ్రత కొనసాగుతున్నది. రాబోయే రోజుల్లో వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. తెలంగాణలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. వాతావరణశాఖ అంచనాల ప్రకారం.. రాష్ట్రంలో దిగువ స్థాయిలో ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. దాంతో రాబోయే రోజుల్లో పలుచోట్ల వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
Read Also : నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నయ్.. ఎండలు నుంచి బిగ్ రిలీఫ్..!
ముఖ్యంగా గురువారం ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉందని హెచ్చరికలు జారీ చేసింది.
Read Also : అది నటులకు మాత్రమే దక్కిన అరుదైన అవకాశం.. సోనాక్షి సిన్హా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
శుక్రవారం రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. శనివారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆదివారం వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్క వానలు పడే అవకాశాలున్నాయని వివరించింది. అలాగే, సోమవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వివరించింది.
Read Also : ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలి.. మహానాడు వేదికగా డిమాండ్ చేసిన చంద్రబాబు..
ఇదిలా ఉండగా, రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే వర్షాల ప్రభావంతో క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం పేర్కొంది. ఐదు రోజుల గరిష్ఠ ఉష్ణోగ్రతల అంచనాల ప్రకారం ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 36 నుంచి 40 డిగ్రీల మధ్య ఉండనున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ జిల్లాల్లో గురువారం 41 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. జూన్ 7 తర్వాత చాలా జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల కంటే దిగువకు పడిపోవచ్చని అంచనా వేసింది. వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు, ఈదురుగాలులు కొనసాగే సూచనలు ఉండడంతో రైతులు, జనం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
Read Also : ప్రతి పౌరుడికి సమగ్ర సంక్షేమ కార్డు : సీఎం రేవంత్‌రెడ్డి


