నేటి రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారంలో శుభఫలితాలు

నేటి 12 రాశుల దినఫలాల్లో ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ జీవితం, ఆరోగ్యం వంటి అంశాల్లో రాశుల వారీగా ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Today Horoscope Telugu
Today Horoscope Telugu

మేష రాశి

మేష రాశి వాళ్లకి ఈరోజు ఉద్యోగ రంగంలో ఉన్నవాళ్లు ప్రమోషన్ గురించిన శుభవార్త వినే యోగం ఉంది. అలాగే సకల కార్య విజయం మేష రాశి వాళ్లకి చేకూరుతుంది. మేష రాశి వాళ్లు ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో అద్భుతమైన విజయాలు ఈరోజు సాధించగలుగుతారు.

వృషభ రాశి

వృషభ రాశి వాళ్లకి ఈరోజు శారీరకంగా, మానసికంగా సంతోషాన్ని పొందే యోగం కనిపిస్తోంది. అంతేకాకుండా ఈరోజు ప్రధానంగా వృషభ రాశి వారికి ధనహాని ఉంది. డబ్బు ఖర్చు విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి.

ఆనందానికైతే ఎటువంటి లోటు ఉండదు. శారీరక ఆనందం ఉంటుంది, మానసిక ఆనందం ఉంటుంది. కానీ డబ్బు పరమైన వ్యవహారాల్లో ఒక రూపాయి ఖర్చు పెట్టినా సరే వృషభ రాశి వాళ్లు జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేసే ప్రయత్నం చేయాలి.

మిథున రాశి

మిథున రాశి వాళ్లకి ఈరోజు పార్టనర్‌షిప్ వ్యవహారాల్లో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి భాగస్వామ్య వ్యాపారాలు చేసే మిథున రాశి వారు జాగ్రత్తగా ఆలోచించి భాగస్వాములతో వ్యవహరించాలి.

అలాగే ఈరోజు వృత్తిపరంగా ధనలాభం మిథున రాశి వారికి ఉంది. ఉద్యోగం, వ్యాపారం ఏదైనా చేస్తున్న వృత్తిలో ధనపరమైన ప్రయోజనాలు పొందగలుగుతారు.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వాళ్లకి ఈరోజు ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృథా ఖర్చులు తగ్గుతాయి. అలాగే ఉద్యోగపరంగా ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు కూడా కర్కాటక రాశి వాళ్లకి చక్కగా అనుకూలిస్తాయి.

సింహ రాశి

సింహ రాశి వాళ్లకి ఈరోజు గృహ లాభం ఉంది. ఇంట్లో విభేదాలు సమసిపోతాయి. కొత్తగా ఇల్లు కొనుక్కోవడానికి కానీ, కట్టుకోవటానికి గాని చేసే ప్రయత్నాల్లో పురోగతి కనిపిస్తుంది.

అలాగే సకాల భోజనం ఉంటుంది. వేళకు ఆహారాన్ని స్వీకరిస్తారు. ఆనందాన్ని పొందుతారు. అలాగే శుభకార్యక్రమం నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే సింహ రాశి వాళ్లకి ఏదో ఒక విధంగా ఆ ధనం కలిసొచ్చే యోగం ఈరోజు చాలా ఎక్కువగా కనిపిస్తుంది.

కన్య రాశి

కన్య రాశి వాళ్లకి ఈరోజు ప్రధానంగా వ్యాపార సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. వ్యాపారంలో ఉన్నవాళ్లు కొంచెం అప్రమత్తతతో వ్యవహరించే నిర్ణయాలు తీసుకోవాలి.

అలాగే కన్య రాశి వాళ్లకి ఈరోజు కోర్టుకు సంబంధించిన ముఖ్యమైన విషయాలకు చర్చలు అనేవి జరుగుతాయి. ఆ చర్చల్లో కూడా కన్య రాశి వాళ్లు అనుకూల ఫలితాలు పొందే యోగం ఎక్కువగా ఉంది.

తుల రాశి

తుల రాశి వాళ్లకి ఈరోజు కుటుంబంలో వ్యతిరేకతలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులు మీరు చెప్పే విషయాలను వ్యతిరేకిస్తూ ఉంటారు. అటువంటప్పుడు సమయస్ఫూర్తితో వ్యవహరించి వాళ్లని కన్విన్స్ చేసే ప్రయత్నం చేయాలి.

అలాగే ఈరోజు తుల రాశి వాళ్లకి వృత్తిపరంగా ధనలాభం అద్భుతంగా ఉంది. ఉద్యోగమైనా, వ్యాపారమైనా ధనపరంగా మంచి పురోభివృద్ధిని సాధించగలుగుతారు.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వాళ్లకి ఈరోజు అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంతేకాకుండా కుటుంబంలో వ్యతిరేక భావనలు చోటు చేసుకుంటూ ఉంటాయి.

అటువంటి వ్యతిరేక భావనలు వచ్చినప్పుడు కుటుంబ సభ్యులతో సమయస్ఫూర్తితో, తెలివితేటలతో మాట్లాడే ప్రయత్నం చేయాలి. అప్పుడు ఆ వ్యతిరేక భావాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వాళ్లకి ఈరోజు జీవిత భాగస్వామితో గొడవలు అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు ధనుస్సు రాశి వాళ్లు జాగ్రత్తగా ఉండాలి.

అలాగే ఈరోజు ధనలాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు ధనుస్సు రాశి వారికి చక్కగా అనుకూలిస్తాయి.

మకర రాశి

మకర రాశి వాళ్లకి ఈరోజు ధనవ్యయం కనిపిస్తుంది. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట పది రూపాయలు ఖర్చుపెట్టే అవకాశం ఉంది. కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

అలాగే ఈరోజు శారీరకంగా, మానసికంగా మకర రాశి వాళ్లకి కొన్ని బాధలు చోటు చేసుకుంటూ ఉంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వాళ్లకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. విజయలబ్ధి చేకూరుతుంది. వ్యాపార పరంగా కూడా విశేషమైన లాభాలు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి.

మీన రాశి

మీన రాశి వాళ్లకి ఈరోజు గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లే సూచనలు ఉన్నాయి. మీ కీర్తికి ఎవరైతే భంగం వాటిల్లజేస్తారని అనుమానం ఉందో అటువంటి వ్యక్తులకు సాధ్యమైనంత దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »