మేష రాశి
మేషరాశి వాళ్లకి ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో ద్రవ్య లాభము కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ధనపరంగా మేషరాశి వాళ్లు విశేషమైన ప్రయోజనాలను పొందగలుగుతారు. అలాగే ఏ రంగంలో ఉన్న మేషరాశి వాళ్లైనా సరే వాళ్ల పరాక్రమాన్ని ప్రదర్శించే అవకాశం వస్తుంది.
వాళ్లలో ఉన్నటువంటి తెలివితేటలు వ్యక్తం చేయటానికి అవకాశాలు వస్తాయి. వాళ్ల సత్తా ఏంటో నిరూపించుకోవటానికి మేషరాశి వాళ్లకి ఈరోజు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ విధంగా మేషరాశి వాళ్లు పరాక్రమాన్ని, తెలివితేటలను ప్రదర్శించి అద్భుతమైన విజయాలు పొందగలుగుతారు.
వృషభ రాశి
వృషభ రాశి వాళ్లకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు బాగా ఎక్కువగా వస్తాయి. నలుగురు చూసి నమస్కరించే విధంగా మంచి పేరు పొందటం వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు.
అదే విధంగా వృషభ రాశి వాళ్లకి ఈరోజు ధన లాభం కలిసొచ్చే సూచనలు కూడా ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా వృషభ రాశి వాళ్లకి చాలా చక్కగా అనుకూలిస్తాయి.
మిథున రాశి
మిథున రాశి వాళ్లకి ఈరోజు నూతన వస్తువు లాభం చేకూరుతుంది. కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేయటం వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. చేస్తున్న ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందగలుగుతారు.
అఖండ ధన లాభం కలిగే సూచనలు కూడా మిథున రాశి వాళ్లకి ఎక్కువగా ఉన్నాయి. ఏదో ఒక విధంగా ఈరోజు ధనం కలిసొస్తుంది. ఆరోగ్యపరంగా ఉన్న ఇబ్బందులు అధిగమించగలుగుతారు. చక్కటి ఆరోగ్య ప్రాప్తిని పొందుతారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వాళ్లకి ఈరోజు సామాన్యమైన ధన లాభం ఉంది. అద్భుతమైన ధన లాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు.
కుటుంబ సమస్యలు కొద్దిగా వెంటాడుతూ ఉంటాయి. కుటుంబ సమస్యలు, చిక్కులు, చికాకులు.. వీటికి పరిష్కార మార్గాల కోసం కర్కాటక రాశి వాళ్లు అన్వేషిస్తూ ఉంటారు.
సింహ రాశి
సింహరాశి వాళ్లకి ఈరోజు సమాజంలో వ్యక్తులతో అకారణంగా గొడవలయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి.
అలాగే ఎదుటి వాళ్ల సమస్యలు మీ సమస్యలుగా భావించి పరిష్కరింపజేసుకోవటానికి చేసే ప్రయత్నాల్లో కూడా అనుకూల ఫలితాలు సింహరాశి వాళ్లకి కనిపిస్తాయి.
కన్యా రాశి
కన్యారాశి వాళ్లకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగ రంగంలో ఉన్నవాళ్లు ప్రమోషన్ గురించిన శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంది. సకల కార్య విజయము చేకూరుతుంది.
కన్యారాశి వాళ్లు ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు.
తులా రాశి
తులా రాశి వాళ్లకి ఈరోజు శారీరకంగా, మానసికంగా చక్కటి సంతోషము చేకూరుతుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా తులా రాశి వాళ్లు కాలం గడుపుతూ ఉంటారు.
అయితే ధన హాని కనిపిస్తుంది. డబ్బు ఖర్చుపెట్టేటప్పుడు మాత్రం తులా రాశి వాళ్లు ఒకటికి పది సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయాలి. లేకపోతే ధనపరమైన ఇబ్బంది ఎదుర్కొనే సూచన కూడా ఉంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వాళ్లు ఈరోజు వ్యాపార రంగంలో ఉన్నవాళ్లు ఉన్నతమైనటువంటి లాభాలు పొందే అవకాశం ఉంది. ఉన్నత పదవి అలంకరించడానికి చేసే ప్రయత్నాలు కూడా వృశ్చిక రాశి వాళ్లకి బాగా అనుకూలిస్తాయి.
ధర్మ రక్షణ కోసం పాటుపడి అఖండ విజయాలను పొందగలుగుతారు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వాళ్లకి ఈరోజు వాహన యోగం ఉంది. బండి గాని, కారు గాని కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి.
అదే విధంగా ధనుస్సు రాశి వాళ్లు ఈరోజు వాళ్ల పరాక్రమాన్ని ప్రదర్శించగలుగుతారు. వాళ్లలో ఉన్నటువంటి తెలివితేటలు నిరూపించుకునే అవకాశం లభిస్తుంది. ఆ అవకాశం ద్వారా ధనుస్సు రాశి వాళ్లు అద్భుతమైన స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి.
మకర రాశి
మకర రాశి వాళ్లకి ఈరోజు చేస్తున్న ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము లభిస్తాయి. విశేషమైన ధన లాభం చేకూరే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి.
ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు కూడా మకర రాశి వాళ్లకి చాలా చక్కగా అనుకూలిస్తాయి.
కుంభ రాశి
కుంభరాశి వాళ్లకి ఈరోజు శుభకార్యక్రమ నిర్వహణ భవిష్యత్తులో చేసే నిమిత్తమై ధనం కోసం ప్రయత్నించి ధనపరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు.
అంతే కాకుండా సత్సంతాన ప్రాప్తి యోగం కూడా ఉంది కాబట్టి సంతానం గురించిన శుభవార్త వినే యోగము ఈరోజు చాలా ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే ధనప్రాప్తిని కూడా చాలా అద్భుతంగా పొందుతారు. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా కుంభరాశి వాళ్లకి అనుకూలిస్తాయి.
మీన రాశి
మీనరాశి వాళ్లకి ఈరోజు ధన వ్యయం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి రూపాయి ఖర్చుపెట్టేటప్పుడు మీనరాశి వాళ్లు ఈరోజు ఒకటికి పది సార్లు ఆలోచించుకొని జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయాలి.
వృత్తిపరంగా కూడా ధనవృద్ధి బాగుంటుంది. డబ్బు ఖర్చైపోయినప్పటికీ ఉద్యోగ రంగంలో గాని, వ్యాపార రంగంలో గాని ఊహించిన దానికంటే ఎక్కువ ధనాన్ని మీనరాశి వాళ్లు సంపాదించగలుగుతారు.
మాస శివరాత్రి ప్రత్యేకత
పన్నెండు రాశుల వాళ్లు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది. అది కూడా అద్భుతమైన ప్రత్యేకత. మాస శివరాత్రి గురువారంతో కలిసొచ్చింది.
ఈ సందర్భంగా “ఓం నమో భగవతే రుద్రాయ” అనే మంత్రాన్ని 21 సార్లు పఠించి పని మీద బయటికి వెళితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు లభిస్తాయి.


