Bank Holidays | ఈ ఆర్థిక సంవత్సరంలో మరో నెల ముగిసిపోయింది. జూన్ నెల ప్రారంభమైంది. బ్యాంకింగ్ సేవలను వినియోగించే ఖాతాదారులు సెలవుల వివరాలను ముందుగానే తెలుసుకోవడం అవసరం. నగదు లావాదేవీలు, చెక్కుల క్లియరెన్స్, రుణాలకు సంబంధించిన ప్రక్రియ, ఇతర బ్యాంకింగ్ పనులు ప్లాన్ చేసుకునేవారు బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు వస్తాయో తెలుసుకోవడం మంచిది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటించిన హాలిడే క్యాలెండర్ ప్రకారం.. జూన్ నెలలో వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పండుగలు, ప్రత్యేక సందర్భాలతో పాటు వారాంతపు సెలవులు కలిపి మొత్తం 11 రోజుల పాటు బ్యాంకులు మూసి ఉండనున్నాయి. అయితే, అన్ని సెలవులు దేశవ్యాప్తంగా వర్తించవు. కొన్ని నిర్దిష్ట రాష్ట్రాలు, నగరాలకే సెలవులు పరిమితం కానున్నాయి. జూన్ 1 నుంచి 6వ తేదీ వరకు దేశవ్యాప్తంగా బ్యాంకులు సాధారణంగా పనిచేయనున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే వారంలో బ్యాంకు పనులు ఉన్నవారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ పనులను పూర్తి చేసుకోవచ్చు. తొలి వారంలో ఒక్క ఆదివారం మినహా మరే ఇతర సెలవులు లేకపోవడం విశేషం.
Read Also : భారతీయ యువతను వెంటాడుతున్న యాంగ్జైటీ.. మూడు దశాబ్దాల్లో భారీగా పెరిగిన సమస్యలు..!
జూన్ బ్యాంకు సెలవుల జాబితా..
జూన్ 7 (ఆదివారం) : వారాంతపు సెలవు కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేత.
జూన్ 13 (శనివారం) : రెండో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవు.
జూన్ 14 (ఆదివారం) : సాధారణ వారాంతపు సెలవు.
జూన్ 15 (సోమవారం) : వైఎంఏ డే-రాజా సంక్రాంతి సందర్భంగా ఐజ్వాల్, భువనేశ్వర్ పరిధిలో బ్యాంకులకు హాలీడే.
జూన్ 21 (ఆదివారం) : వారాంతపు సెలవుకావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి.
జూన్ 25 (గురువారం) : మొహర్రం సందర్భంగా విజయవాడ పరిధిలోని బ్యాంకులకు సెలవు.
జూన్ 26 (శుక్రవారం) : మొహర్రం సందర్భంగా అగర్తల, ఐజ్వాల్, బెంగళూరు, భోపాల్, చెన్నై, హైదరాబాద్, జమ్ము, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబయిన్యూఢిల్లీ, పాట్నాతో పాటు పలుచోట్ల సెలవు.
జూన్ 27 (శనివారం) : నాలుగో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవు.
జూన్ 28 (ఆదివారం) : వారాంతపు సెలవు సందర్భంగా హాలీడే.
జూన్ 29 (సోమవారం) : సంత్ గురు కబీర్ జయంతి సందర్భంగా షిమ్లా పరిధిలోని బ్యాంకులకు సెలవు.
జూన్ 30 (మంగళవారం) : రెమ్నా నీ సందర్భంగా మిజోరంలో బ్యాంకులు మూసి ఉంటాయి.
Read Also : టాలీవుడ్‌కు ఏపీ నుంచే 75శాతం ఆదాయం.. బాలకృష్ట సంచలన వ్యాఖ్యలు..!
24 గంటలు ఆన్‌లైన్ సేవలు..
బ్యాంకు శాఖలు సెలవు కారణంగా మూసి ఉన్నప్పటికీ డిజిటల్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ చెల్లింపులు, ఏటీఎం సేవలు 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయి. గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి యాప్‌ల ద్వారా నగదు రహిత లావాదేవీలు చేసుకోవచ్చు. అయితే, నగదు జమలు, చెక్కుల క్లియరెన్స్, డిమాండ్ డ్రాఫ్ట్‌లు, పాస్‌బుక్ అప్‌డేట్‌లు వంటి బ్రాంచ్ ఆధారిత సేవల కోసం బ్యాంకు సెలవులను దృష్టిలో ఉంచుకుని ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవడం మంచిది.
Read Also : భక్తులకు గుడ్‌న్యూస్.. తిరుమల తరహాలోనే ప్రముఖ ఆలయాల్లోనూ సేవ భాగ్యం..


