గడువు ముగిసిన ఆహారం, పాడైన కూరగాయలు.. ప్రముఖ రెస్టారెంట్లలో ఉల్లంఘనలు

సైబరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ప్రముఖ రెస్టారెంట్లలో పలు లోపాలు వెలుగులోకి వచ్చాయి. లా పినోజ్ పిజ్జాలో బొద్దింకల బెడద, పాడైన ఆహార పదార్థాలు గుర్తించగా, అన్టెరాలో పాడైన కూరగాయలు, వాడరాని నూనె బయటపడ్డాయి.

Cyberabad Food Safety Drive: ప్రముఖ రెస్టారెంట్లలో షాకింగ్ నిజాలు
Cyberabad Food Safety Drive: ప్రముఖ రెస్టారెంట్లలో షాకింగ్ నిజాలు
  • సైబరాబాద్ కమిషనరేట్ ఫుడ్ సేఫ్టీ బృందాలు
  • మూడు ప్రముఖ రెస్టారెంట్లలో ఆహార భద్రత తనిఖీలు
  • జూబ్లీ ఎన్‌క్లేవ్, మదీనాగూడ, ఎస్ఎంఆర్ వినయ్ టెక్నోపోలిస్ సమీపం

సైబరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. పలు లోపాలు వెలుగులోకి

హైదరాబాద్‌లో ఆహార భద్రతపై సైబరాబాద్ కమిషనరేట్ ప్రత్యేక దృష్టి సారించింది. ఫుడ్ సేఫ్టీ బృందాలు జూన్ 17న నగరంలోని మూడు ప్రముఖ రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా, పలు ఆందోళనకర అంశాలు వెలుగులోకి వచ్చాయి.

లా పినోజ్ పిజ్జాలో బొద్దింకల బెడద

జూబ్లీ ఎన్‌క్లేవ్‌లోని La Pino’z Pizzaలో నిర్వహించిన తనిఖీల్లో తీవ్ర లోపాలు బయటపడ్డాయి.

అధికారులు గుర్తించిన ఉల్లంఘనలు:

  • భారీ స్థాయిలో బొద్దింకల ఉనికి
  • గడువు ముగిసిన మసాలా పొడులు, ఫ్లేవర్డ్ సిరప్స్, బ్రెడ్ పదార్థాలు
  • సరైన లేబులింగ్ లేకుండా నిల్వ చేసిన ఆహార పదార్థాలు
  • ఫ్రీజర్‌లో సూక్ష్మజీవుల పెరుగుదల
  • చికెన్‌ను సరైన రీతిలో నిల్వ చేయకపోవడం
  • ఆహార నిల్వ ప్రాంతం సమీపంలో బల్లి విసర్జనలు
  • నీటి పరీక్ష నివేదికలు, సిబ్బంది మెడికల్ ఫిట్‌నెస్ రికార్డులు లేకపోవడం
  • వెజ్, నాన్‌వెజ్ పదార్థాలను ఒకే ఫ్రీజర్‌లో నిల్వ చేయడం
  • దీంతో గడువు ముగిసిన, సరైన విధంగా నిల్వ చేయని ఆహార పదార్థాలను అధికారులు అక్కడికక్కడే పారవేశారు.
  • రెస్టారెంట్‌కు ఇంప్రూవ్‌మెంట్ నోటీసు జారీ చేయనున్నారు.

హైజీన్ స్కోర్: 67/100 (67%)

అన్టెరాలో పాడైన కూరగాయలు, వాడరాని నూనె

మదీనాగూడలోని AnTeRa రెస్టారెంట్‌లో కొన్ని మంచి పద్ధతులు పాటిస్తున్నప్పటికీ, పలు లోపాలు గుర్తించారు.

అధికారులు గుర్తించిన అంశాలు:

  • కాలీఫ్లవర్, బంగాళాదుంపలపై ఫంగస్ (మౌల్డ్) పెరగడం
  • ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీలో వాడిన నూనె తిరిగి ఉపయోగించడానికి అనర్హంగా ఉండటం
  • డెజర్ట్స్, మష్రూమ్స్, నాన్‌వెజ్ పదార్థాలు లేబుల్స్ లేకుండా నిల్వ చేయడం
  • ఐరన్ కత్తులను ఉపయోగించడం
  • ఆహార తయారీ ప్రాంతం వద్ద మూతలేని డస్ట్‌బిన్లు
  • నీటి పరీక్ష నివేదికలు, సిబ్బంది మెడికల్ రికార్డులు లేకపోవడం
  • ఫంగస్ పట్టిన కూరగాయలు, వాడరాని నూనెను అధికారులు అక్కడికక్కడే తొలగించారు.

హైజీన్ స్కోర్: 87/106 (83%)

దీంతో ఈ రెస్టారెంట్‌కు కూడా ఇంప్రూవ్‌మెంట్ నోటీసు జారీ చేయనున్నారు.

Cyberabad Food Inspection
Cyberabad Food Inspection

10 Pounder Pizzeteriaకి ప్రశంసలు

SMR వినయ్ టెక్నోపోలిస్ సమీపంలోని 10 Pounder Pizzeteriaలో మాత్రం ఎక్కువ భాగం ప్రమాణాలు పాటిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

అక్కడ:

  • సిబ్బంది హెయిర్‌నెట్స్, అప్రాన్లు ధరించడం
  • వెజ్, నాన్‌వెజ్ పదార్థాలను వేరుగా నిల్వ చేయడం
  • మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్లు అందుబాటులో ఉండటం
  • పురుగుల బెడద లేకపోవడం
  • ఆహార పదార్థాలకు సరైన లేబులింగ్ ఉండటం

వంటి అంశాలు సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొన్నారు.

అయితే కొన్ని ప్రాంతాల్లో దుమ్ము, సాలీడు గూళ్లు ఉండటం, ఫ్రీజర్ దిగువ భాగాన్ని మరింత శుభ్రంగా ఉంచాలని సూచించారు.

హైజీన్ స్కోర్: 99/106 (94%)

  • ఈ రెస్టారెంట్‌కు అధికారులు ప్రశంసలు తెలిపారు.
  • ఫుడ్ సేఫ్టీ తనిఖీలు కొనసాగుతాయి

సైబరాబాద్ కమిషనరేట్ అధికారులు నగరంలోని రెస్టారెంట్లు, హోటళ్లు, క్లౌడ్ కిచెన్లు, ఇతర ఆహార సంస్థల్లో ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.

“సురక్షిత ఆహారం, మెరుగైన పరిశుభ్రత, ఆరోగ్యకరమైన సైబరాబాద్” లక్ష్యంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.

Also Read: హైదరాబాద్ వీధుల్లో ఫిఫా వరల్డ్ కప్ జోష్.. మెస్సీ, రొనాల్డో పోస్టర్లతో సందడి చేస్తున్న సైనిక్‌పురి!

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »