బరువు తగ్గాలంటే అన్నం మానేయాలా? అసలైన ‘డైట్’ రహస్యం ఇదే!

బరువు తగ్గాలంటే అన్నం (Rice and weight loss)మానేయాలనే భావన తప్పు. సరైన పరిమాణంలో అన్నం తినడం, బ్రౌన్ రైస్ లేదా పుల్కాలు వంటి ఆరోగ్యకరమైన ఎంపికలు చేసుకోవడం ద్వారా బరువు తగ్గడం సాధ్యమే. ఆహారంపై అవగాహన ఉంటే అన్నం తింటూనే ఫిట్‌గా ఉండవచ్చు.

Rice and weight loss
Rice and weight loss

Rice and weight loss

హైదరాబాద్: ప్రస్తుత కాలంలో అధిక బరువు అనేది ఒక పెద్ద సవాలుగా మారింది. ఉరుకుల పరుగుల జీవితం, అర్థరాత్రి భోజనాలు, జంక్ ఫుడ్, నిద్రలేమి , శారీరక శ్రమ లేకపోవడం వల్ల చాలామంది ఊబకాయం బారిన పడుతున్నారు. బరువు తగ్గాలని నిర్ణయించుకున్న వెంటనే అందరికీ గుర్తొచ్చే మొదటి విషయం అన్నం మానేయడం. అన్నం తింటే అస్సలు బరువు తగ్గలేమని, అది కేవలం కొవ్వును పెంచుతుందని ఒక బలమైన నమ్మకం మనలో ఉంది. కానీ, పోషకాహార నిపుణులు చెబుతున్న మాట వేరేలా ఉంది. బరువు తగ్గడానికి అన్నం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని వారు స్పష్టం చేస్తున్నారు.

పిండి పదార్థాలు:
మన శరీరానికి శక్తినిచ్చే ప్రధాన వనరు కార్బోహైడ్రేట్లు (పిండి పదార్థాలు). మనం పాలిష్ చేసిన బియ్యాన్ని అధికంగా తిన్నప్పుడు అందులోని పిండి పదార్థాలు కొవ్వుగా మారి శరీరంలో పేరుకుపోతాయి. అయితే, మన శరీరానికి రోజువారీ కార్యకలాపాల కోసం కనీసం 70 నుండి 100 గ్రాముల పిండి పదార్థాలు అవసరం. అన్నం పూర్తిగా మానేస్తే శరీరానికి అందాల్సిన కనీస శక్తి తగ్గి, నీరసం వచ్చే ప్రమాదం ఉంది. అందుకే తినడం మానేయడం కంటే ఎంత తినాలో తెలుసుకోవడం ముఖ్యం.

ఎంత (Rice and weight loss)తినాలి:
బరువు తగ్గాలనుకునే వారు భోజన సమయంలో అన్నం పరిమాణాన్ని ఒక కప్పుకే పరిమితం చేయాలి. ఒక కప్పు అన్నం తింటే సుమారు 40 గ్రాముల పిండి పదార్థాలు అందుతాయి. ఇలా మధ్యాహ్నం ఒక కప్పు, రాత్రి ఒక కప్పు తీసుకుంటే శరీరానికి కావాల్సిన 80 గ్రాముల కార్బోహైడ్రేట్లు సరిగ్గా అందుతాయి. ఇలా నియంత్రిత పద్ధతిలో అన్నం తింటే బరువు తగ్గడం సులభం అవుతుంది.

నియంత్రణ :
అన్నం మీద మక్కువ ఎక్కువ ఉండి, ఒక కప్పుతో సరిపెట్టుకోలేము అనుకునే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అటువంటి వారు అన్నానికి బదులుగా పుల్కాలు తినడం మేలు. ఒక పుల్కాలో కేవలం 15 గ్రాముల పిండి పదార్థాలు మాత్రమే ఉంటాయి. దీనివల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది , క్యాలరీలు తక్కువగా అందుతాయి. లేదా పాలిష్ చేసిన తెల్ల బియ్యానికి బదులుగా ‘బ్రౌన్ రైస్’ను ఎంచుకోవచ్చు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కొద్దిగా తినగానే ఆకలి తీరుతుంది, జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.

బరువు తగ్గడం (Rice and weight loss)అనేది ఆహారంపై మనకున్న అవగాహన మీద ఆధారపడి ఉంటుంది. క్రమబద్ధమైన ఆహారపు అలవాట్లు, సరైన పరిమాణంలో భోజనం చేస్తే అన్నం తింటూ కూడా నాజూకుగా మారవచ్చు. కాబట్టి, అన్నం పూర్తిగా తగ్గించకుండా దాని పరిమాణం మీద నియంత్రణ సాధిస్తే ఆరోగ్యం, అందం మీ సొంతమవుతాయి.

తరచుగా అడిగే ప్రశ్నలు

Q1: బరువు తగ్గాలంటే అన్నం పూర్తిగా మానేయాలా?

A: అవసరం లేదు. సరైన పరిమాణంలో అన్నం తింటే బరువు తగ్గడం సాధ్యమే

Q2: రోజుకు ఎంత అన్నం తినాలి?

A: మధ్యాహ్నం ఒక కప్పు, రాత్రి ఒక కప్పు అన్నం సరిపోతుంది. ఇది శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది.

Q3: తెల్ల అన్నం కంటే బ్రౌన్ రైస్ ఎందుకు మంచిది?

A: బ్రౌన్ రైస్‌లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా ఆకలి తీరుతుంది, జీర్ణక్రియ మెరుగవుతుంది.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »