నాటు కోడిగుడ్ల పేరుతో మోసం.. అసలైనవి ఏవో కనిపెట్టేయండిలా!

నాటు కోడిగుడ్ల(eggs) పేరుతో మార్కెట్లో నకిలీ గుడ్లు విక్రయించే మోసాలు పెరుగుతున్నాయి. నీటి పరీక్ష, ఉప్పు నీటి టెస్ట్, పచ్చసొన రంగు వంటి సులభమైన ఇంటి చిట్కాలతో అసలైన నాటు కోడిగుడ్లను గుర్తించవచ్చు. మోసపోకుండా నమ్మకమైన చోట్ల నుంచే గుడ్లు కొనడం చాలా ముఖ్యం.

EGGS
EGGS

Eggs

  • నాటు కోడిగుడ్ల (eggs)పేరుతో మామూలు తెల్ల గుడ్లకు రంగు పూసి ఎక్కువ ధరకు అమ్మే మోసాలు పెరుగుతున్నాయి.

  • నీటితో కడగడం, ఉప్పు నీటి పరీక్ష వంటి సులభమైన ఇంటి చిట్కాలతో నకిలీ గుడ్లను గుర్తించవచ్చు.

  • ఫారం గుడ్లు, నాటు గుడ్లు రెండింటిలోనూ పోషకాలు ఉన్నప్పటికీ మోసపోవకుండా జాగ్రత్తపడటం ముఖ్యం.

హైదరాబాద్: కోడిగుడ్డు(egg)ను ఒక ‘సూపర్‌ఫుడ్’ అని పిలుస్తారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ గుడ్లలో నాటు కోడిగుడ్లంటే కాస్త క్రేజ్ ఎక్కువ. బలం వస్తుందన్న ఆశతో సామాన్య ప్రజలు ఎంత ధరైనా పెట్టి నాటు కోడిగుడ్లను కొంటుంటారు. అయితే, ఈ నమ్మకాన్నే పెట్టుబడిగా మార్చుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. మామూలు తెల్ల గుడ్లకు టీ డికాక్షన్, రంగులు పూసి అవి నాటు కోడిగుడ్లలా కనిపించేలా మాయ చేసి మార్కెట్లోకి వదులుతున్నారు. మరి మీరు కొనేవి అసలైనవేనా? లేక రంగు పూసిన నకిలీవా? ఇంట్లోనే ఈ చిన్న చిట్కాలతో తేలికగా కనిపెట్టేయండి.

గుర్తించే సులభమైన మార్గాలు:

నీటితో కడిగడం : మీరు తెచ్చిన గుడ్డు రంగులో ఏమైనా తేడా అనిపిస్తే, వెంటనే దానిని నీటితో కడగండి. ఒకవేళ అది రంగు పూసిన గుడ్డు అయితే, ఆ పెయింట్ లేదా టీ డికాక్షన్ రంగు నీటిలో కరిగిపోతుంది. అసలైన నాటు కోడిగుడ్డు రంగు నీళ్లకు అస్సలు పోదు.

ఉప్పు నీటి పరీక్ష : ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొంచెం ఉప్పు వేసి, అందులో గుడ్డును కాసేపు ఉంచండి. కొద్దిసేపటికి నీరు పసుపు లేదా బ్రౌన్ కలర్‌లోకి మారితే అది కచ్చితంగా నకిలీ గుడ్డేనని గుర్తించాలి. నిజమైన గుడ్డు నుంచి రంగు బయటకు రాదు.

EGGS
EGGS

పచ్చసొన, బరువు :

బరువు: సాధారణంగా నాటు కోడిగుడ్లు ఫారం గుడ్ల కంటే పరిమాణంలో చిన్నవిగా, బరువు తక్కువగా ఉంటాయి.

పచ్చసొన: గుడ్డును పగలగొట్టినప్పుడు లోపల ఉండే పచ్చసొన ముదురు ఆరెంజ్ రంగులో ఉంటే అది నాటు కోడిగుడ్డు. అదే లేత పసుపు రంగులో ఉంటే అది ఫారం గుడ్డు అని అర్థం.

జాగ్రత్త : ఫారం గుడ్లు అయినా, నాటు గుడ్లు అయినా రెండింటిలోనూ ప్రోటీన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కానీ, తక్కువ ధర గుడ్డుకు రంగు పూసి, ఎక్కువ ధరకు అమ్ముతూ మిమ్మల్ని మోసం చేయడమే ఇక్కడ సమస్య. అందుకే గుడ్లు కొనేటప్పుడు నమ్మకమైన వారి దగ్గరే తీసుకోవడం మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తరచుగా అడిగే ప్రశ్నలు

Q1: నాటు కోడిగుడ్డు నిజమైనదో కాదో ఇంట్లోనే ఎలా గుర్తించాలి?

A: నీటితో కడిగినప్పుడు రంగు ఊడిపోతే లేదా ఉప్పు నీటిలో నీటి రంగు మారితే అది నకిలీ గుడ్డు అని గుర్తించవచ్చు.

Q2: నాటు కోడిగుడ్డు పచ్చసొన రంగు ఎలా ఉంటుంది?

A: అసలైన నాటు కోడిగుడ్డు పచ్చసొన సాధారణంగా ముదురు ఆరెంజ్ రంగులో ఉంటుంది.

Q3: ఫారం గుడ్లు ఆరోగ్యానికి హానికరమా?

A: కాదు. ఫారం గుడ్లలో కూడా ప్రోటీన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. మోసం చేయడమే అసలు సమస్య.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »