మళ్లీ పరుగుల వరదేనా.. మూడో టీ20లో భారత్‌కు బౌలింగ్ టెన్షన్!

భారత్, వెస్టిండీస్ మధ్య మూడో టీ20కి ఇండోర్ హోల్కర్ స్టేడియం సిద్ధమైంది. రెండో మ్యాచ్‌లో భారీ స్కోర్ల నేపథ్యంలో ఈ పోరులోనూ బ్యాటర్లదే ఆధిపత్యం ఉంటుందా?

India vs West Indies 3rd T20
India vs West Indies 3rd T20

భారత్–వెస్టిండీస్ టీ20 సిరీస్ ఆసక్తికర మలుపు తిరిగింది. తొలి మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించగా.. రెండో పోరులో భారీ లక్ష్యాన్ని ఛేదించిన వెస్టిండీస్ సిరీస్‌ను 1–1తో సమం చేసింది. దీంతో ఇండోర్‌లో జరగనున్న మూడో టీ20పై ఉత్కంఠ పెరిగింది. హోల్కర్ స్టేడియం చిన్న బౌండరీలు, బ్యాటింగ్‌కు అనుకూలించే పరిస్థితులతో మరోసారి పరుగుల పండుగకు వేదికయ్యే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా రెండో మ్యాచ్‌లో భారత బౌలింగ్ విఫలమైన నేపథ్యంలో.. ఈసారి గంభీర్ బృందం ఎలాంటి వ్యూహంతో బరిలోకి దిగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

భారత్, వెస్టిండీస్‌ టీ20 సిరీస్ ఇంట్రెస్టింగ్‌గా సాగుతోంది. తొలి మ్యాచ్‌లో టీమ్ ఇండియా విజయం సాధించగా, రెండో పోరులో నెగ్గి సిరీస్‌ను 1-1తో సమం చేసింది కరీబియన్ టీమ్‌. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇవాళ ఇండోర్‌లోని హోల్కర్‌ స్టేడియం వేదికగా మూడో మ్యాచ్‌ జరగబోతోంది. ఇందులో నెగ్గి సిరీస్‌లో ఆధిక్యంలోకి రావాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.

రాంచీ మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని చేధించిన వెస్టిండీస్ ఫుల్ జోష్‌లో ఉంది. మరోవైపు బ్యాటర్లు రాణిస్తున్నా బౌలింగ్‌లో పస తగ్గడంతో భారత్ ఇబ్బందులు పడుతోంది. 250 పరుగుల టార్గెట్‌ సెట్ చేసినా ఓడటంతో బౌలర్లను మళ్లీ గాడిన పెట్టడంపై టీమ్ ఇండియా కోచింగ్ స్టాఫ్ ఫోకస్ చేస్తోంది. ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించడంపై దృష్టి పెడుతోంది.

రాంచీలో జరిగిన రెండో టీ20లో ఇరు జట్లు కలిపి ఏకంగా 501 పరుగులు చేశాయి. తొలుత భారీ స్కోరు చేసిన భారత్‌ను వెస్టిండీస్ ధీటుగా ఎదుర్కొంది. 250 పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించి విజయం సాధించింది. దీంతో భారత బౌలింగ్ వైఫల్యాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. కోచ్ గౌతమ్ గంభీర్ కూడా బౌలర్ల ప్రదర్శనపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇండోర్ పిచ్‌ కూడా బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుందని అంచనా. చిన్న బౌండరీలకు తోడు మంచు ప్రభావం కూడా మ్యాచ్‌పై కీలక పాత్ర పోషించబోతోంది. దీంతో బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్ తప్పకుండా బంతులు వేయాల్సి ఉంటుంది. ఫీల్డింగ్‌లోనూ చిన్న తప్పిదాలకు అవకాశం ఇవ్వకూడదు.

మరోవైపు భారత కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్ తిరిగి ఫామ్‌లోకి రావడం టీమ్‌కు ప్లస్ పాయింట్. ఇండోర్‌లో అజేయంగా 102 పరుగులు చేసిన అతడు రాంచీలో 18 బంతుల్లోనే 40 పరుగులు సాధించాడు. వికెట్‌కీపర్ బ్యాటర్ సంజు సంజు శాంసన్  కూడా 41 బంతుల్లో 82 పరుగులతో ఫామ్‌లోకి వచ్చాడు. దీంతో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం రావడం కష్టంగా కనిపిస్తోంది.

ఆల్‌రౌండర్ శివం దూబేకు విశ్రాంతి ఇచ్చి తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డిని ఆడించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వెస్టిండీస్ మాత్రం రూథర్‌ఫోర్డ్, హోప్ ఫామ్‌తో కాన్ఫిడెన్స్‌తో బరిలోకి దిగబోతోంది. రోస్టన్ చేజ్ కూడా రెండో టీ20లో మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు.

ఈ క్రమంలో మూడో టీ20లో బ్యాటర్ల జోరు కొనసాగుతుందా? భారత బౌలర్లు పుంజుకుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి గెలిచి లీడ్‌లోకి రావాలని అయ్యర్ సేన చూస్తోంది.

About Author:

Ch Roja Rani

గత 5 సంవత్సరాలుగా తెలుగు మీడియా రంగంలో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న జర్నలిస్ట్‌. డిజిటల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అయిన Idreampost మరియు Wire Teluguలో పని చేసి విశేష అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం Mana Varta లో క్రీడలు (Sports…

More About Author »