విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ్టి నుంచి పది రోజుల పాటు, అంటే 20వ తేదీ వరకు అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు చేయబోతున్నారు. తొలిరోజు అమ్మవారు శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. ఉదయం 8 గంటల నుంచి భక్తులకు దుర్గాదేవి దర్శనం ప్రారంభం కాబోతోంది.
దసరా ఉత్సవాల్లో రూ.100, రూ.300, రూ.500 దర్శన టికెట్లను పూర్తిగా రద్దు చేశారు. సామాన్య భక్తులకు ఉచిత దర్శనానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా మరికాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. మొదటి రోజు అమ్మవారు బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తారు. అమ్మవారి దర్శనం కోసం ఇప్పటికే భక్తులంతా ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. క్యూ లైన్లన్నీ భక్తులతో కిక్కిరిసిన పరిస్థితి కనిపిస్తోంది.
ప్రస్తుతం ఘాట్ రోడ్ దగ్గర పరిస్థితిని చూస్తే, ఘాట్ రోడ్ ప్రారంభ స్థానంలో దీక్షలు తీసుకున్న భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో ఆలయ ప్రాంగణం అంతా కిక్కిరిసిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా భవానీ దీక్షలు తీసుకున్న వారు ఆలయ ప్రాంగణానికి చేరుకోవడంతో, దసరాకు సంబంధించిన ఏర్పాట్లలో భాగంగా అన్ని క్యూ లైన్లను ఈసారి ఉచిత క్యూ లైన్లుగానే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.
ఈ ఉచిత క్యూ లైన్లతో పాటు రూ.100, రూ.200, అలాగే రూ.500 దర్శన టికెట్లను కూడా రద్దు చేశారు. మొత్తం ఐదు క్యూ లైన్లలో సాధారణ భక్తులు అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్లే విధంగా అన్ని రకాల ఏర్పాట్లను ఆలయ అధికారులు చేపట్టారు.
ఇక వీఐపీ దర్శనాలకు సంబంధించి కూడా కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, అలాగే రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అంతరాల దర్శనం, వీఐపీ దర్శనానికి అనుమతి ఇవ్వడం జరిగింది.
ఒకేసారి 1,800 మంది నుండి వేల మంది భక్తులు వేచి ఉండేలా ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాల్లో భారీగా హోల్డింగ్ పాయింట్ల ఏర్పాట్లు చేయడం జరిగింది. హోల్డింగ్ పాయింట్లలో భక్తులు అమ్మవారి దర్శనానికి వెళ్లేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.
ముఖ్యంగా క్యూ లైన్లన్నీ ఉదయమే కిక్కిరిసిపోయిన పరిస్థితి ఉంది. మొదటి రోజు క్యూ లైన్లు ఇంత భారీగా భక్తజన సందోహంగా మారడం ప్రతి సంవత్సరం ఉండదు. ఈ ఏడాది మాత్రం మొదటి రోజే అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం అంతా కిటకిటలాడుతోంది.
భవానీ దీక్షలు తీసుకున్న భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు
భవానీ మాల వేసుకున్న వారికి ప్రత్యేకంగా వేరుగా క్యూ లైన్లు ఏర్పాటు చేస్తారా అనే విషయంపై అధికారులు స్పందించారు.
దసరా సందర్భంగా ఈ దీక్షలు తీసుకోవడం ఇంద్రకీలాద్రిపై ఉండదు. కేవలం కార్తీక మాసంలో మాత్రమే భవానీ దీక్షల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయి. ఇప్పుడు మాత్రం దసరాకు సంబంధించిన ఏర్పాట్లే ఉన్నాయి.
మొత్తం ఈ పది రోజుల పాటు భవానీ దీక్షలు తీసుకున్న వారు కూడా పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తూ ఉంటారు. కానీ ఈ పది రోజులు మాల వేసుకోకూడదని ఆలయ అధికారులు, అలాగే గురు భవానీలు చెబుతున్నారు.
అయితే ప్రస్తుతం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం వల్ల క్యూ లైన్‌లో భక్తులు ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా ఈ క్యూ లైన్లు ఏవైతే ఉన్నాయో, అవి నిండిపోయినా హోల్డింగ్ పాయింట్లను ఏర్పాటు చేసి, ఆ హోల్డింగ్ పాయింట్ల ద్వారా భక్తులను దర్శనానికి అనుమతించే అవకాశం ఉంది.
భవానీ దీక్షలు తీసుకున్న భక్తులను కూడా క్రమబద్ధీకరించి ముందుకు పంపించేందుకు ఏర్పాట్లు చేపడుతున్నారు. ముఖ్యంగా భవానీ దీక్షలు తీసుకున్న వారు ఘాట్ రోడ్ వద్దకు ఒక్కసారిగా చేరిపోవడంతో పరిసర ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయే పరిస్థితి ఉంది.
భవానీ దీక్షపై భక్తుల స్పందన
ఘాట్ రోడ్ వద్ద మాలధారణ చేసిన కొంతమంది భక్తులను పలకరించగా.. వారు ప్రతి ఏడాది భవానీ దీక్షలు తీసుకుంటున్నామని తెలిపారు. అమ్మవారిపై నమ్మకంతో దీక్ష తీసుకుంటున్నామని చెప్పారు.
దసరా సమయంలో ప్రతి ఏడాది తొమ్మిది, పది రోజులు అమ్మవారి ఆలయానికి వస్తామని భక్తులు తెలిపారు.
భవానీ దీక్షలు తీసుకున్న భక్తులు భారీగా అమ్మవారి ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. ముఖ్యంగా దసరా సందర్భంగా ఇంద్రకీలాద్రికి వచ్చే ఈ పది రోజుల పాటు పది అలంకారాలలో అమ్మవారు దర్శనం ఇస్తారు కాబట్టి ఆలయానికి వచ్చే భక్తుల తాకిడి ఇలాగే ఉంటుంది.
ప్రత్యేకంగా రెవెన్యూ, పోలీస్, దేవస్థానం అధికారులు, ఎండోమెంట్ మూడు శాఖలు కలిసి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడంతో, ఇవాళ మరికాసేపట్లో ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మొదటి రోజు ప్రారంభం కాబోతున్నాయి.
