రసవత్తరంగా ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌.. నాలుగో బెర్త్‌ కోసం బరిలో నాలుగు జట్లు..!

ఐపీఎల్‌ 2026 (IPL 2026) ప్లేఆఫ్స్‌ రేసు (Playoffs Race) మరింత ఉత్కంఠగా మారింది. ముంబయి ఇండియన్స్‌ (MI)పై కేకేఆర్‌ (KKR) విజయం సాధించడంతో చివరి ప్లేఆఫ్‌ బెర్త్‌ కోసం రాజస్థాన్‌ రాయల్స్‌ (RR), పంజాబ్‌ కింగ్స్‌ (PBKS), ఢిల్లీ క్యాపిటల్స్‌ (DC), చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) మధ్య గట్టి పోటీ నెలకొంది.

IPL Playoff Scenarios | ఐపీఎల్‌ 2026 సీజన్‌లో ప్లేఆఫ్స్ పోరు రోజురోజుకూ మరింత రసవత్తరంగా మారుతోంది. ముంబయి ఇండియన్స్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నాలుగు వికెట్ల తేడాతో కీలక విజయం సాధించడంతో చివరి ప్లేఆఫ్ బెర్త్ కోసం పోటీ హోరాహోరీగా మారింది. ఈ గెలుపుతో కేకేఆర్‌ ఆశలు సజీవంగా ఉండగా, ప్రస్తుతం నాలుగో స్థానానికి ఐదు జట్లు పోటీపడుతున్నాయి. ఇప్పటికే రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, గుజరాత్‌ టైటాన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ప్లేఆఫ్‌కు చేరుకున్నాయి. ప్రస్తుతం నాలుగో బెర్త్‌ కోసం మరో నాలుగు జట్లు పోటీపడుతున్నాయి. ప్రస్తుతం అంచనాల మేరకు.. రాజస్థాన్ రాయల్స్‌కు ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు ఇతర జట్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఆ జట్టుకు 50 శాతం అవకాశాలు ఉన్నాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్‌, పంజాబ్ కింగ్స్‌కు చెరో 19 శాతం అవకాశాలు ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు 9 శాతం మాత్రమే అవకాశాలు కనిపిస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారి, కేవలం 3 శాతం అవకాశాలకే పరిమితమైంది.

Read Also : మనీష్‌ వాట్‌ ఏ క్యాచ్‌..! స్టన్‌ అయిన విరాట్‌ కోహ్లీ

ఆర్‌ఆర్‌ : రాజస్థాన్ రాయల్స్‌ తమ చివరి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌పై విజయ సాధిస్తే 16 పాయింట్లతో నేరుగా ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెడుతుంది. ఒకవేళ ఓడిపోతే మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. పంజాబ్ కింగ్స్‌కు కూడా పరిస్థితి దాదాపు ఇలాగే ఉంది. ఆ జట్టు గెలవడంతో పాటు రాజస్థాన్‌, కేకేఆర్‌ ఓడిపోవాలి. లేదంటే పంజాబ్‌కు అవకాశాలు క్లిష్టమవుతాయి.

కేకేఆర్‌ : కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కూడా తమ చివరి మ్యాచ్‌లో తప్పనిసరిగా విజయం సాధించాల్సిందే. అదే సమయంలో రాజస్థాన్‌, పంజాబ్ జట్లు పరాజయం పాలవ్వాలి. లేకపోతే కేకేఆర్‌కు ప్లేఆఫ్స్ దారి మూసుకుపోతుంది. ఒకవేళ పాయింట్లు సమానంగా ఉంటే నెట్ రన్‌రేట్‌ కీలకంగా మారనుంది.

Read Also : ఏపీలో విస్తరణపై ఉబెర్ దృష్టి.. సీఎం చంద్రబాబుతో గ్లోబల్ సీఈఓ భేటీ..!

డీసీ : ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్లేఆఫ్‌ అవకాశాలు దాదాపుగా తక్కువగానే ఉన్నాయి. సమీకరణాలు మరింత క్లిష్టంగా ఉన్నాయి. కేకేఆర్‌తో మ్యాచ్‌లో డీసీ మ్యాచ్ గెలవడమే కాకుండా మిగతా నాలుగు జట్లు ఓడిపోవాలని ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది. ఏ ఒక్క ప్రత్యర్థి జట్టు గెలిచినా ఢిల్లీ ఆశలు దాదాపు ముగిసినట్లేనని క్రికెట్‌ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

సీఎస్‌కే : చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి ఇంకా క్లిష్టంగా మారింది. భారీ విజయం సాధించడంతో పాటు మిగతా జట్లన్నీ ఓడిపోతేనే ఆ జట్టుకు అవకాశాలు ఉంటాయి. చివరికి కొన్ని సమీకరణాల్లో నెట్ రన్‌రేట్‌ కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది. దీంతో చివరి లీగ్ మ్యాచ్‌లపై అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది.

Read Also : వైరస్‌లను అడ్డుకునే జిగురు తరహా ప్రోటీన్లు.. సీసీఎంబీ కీలక అధ్యయనం..

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »