Realme 16 5G వచ్చేసింది.. 7000mAh బ్యాటరీ, డ్యూయల్ 50MP కెమెరాలతో మార్కెట్‌లో హల్‌చల్

భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 50MP ఫ్రంట్ & రియర్ కెమెరాలతో Realme 16 5G ఆకట్టుకుంటోంది. మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో కొత్త పోటీని తీసుకొస్తున్న స్మార్ట్‌ఫోన్.

Realme 16 5G Air White Color with 50MP Camera
Realme 16 5G Air White Color with 50MP Camera

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ భారత మార్కెట్లోకి తన సరికొత్త ’16 సిరీస్’ను పరిచయం చేసింది. అత్యాధునిక ఫీచర్లు, స్టైలిష్ డిజైన్‌తో కూడిన Realme 16 5G మొబైల్‌ను కంపెనీ అధికారికంగా అనౌన్స్ చేసింది. ముఖ్యంగా సోషల్ మీడియా జనరేషన్‌ను దృష్టిలో ఉంచుకుని ముందు, వెనుక 50MP సోనీ కెమెరాలను అందించడం ఈ ఫోన్ ప్రత్యేక్షత.

డిస్‌ప్లే మరియు డిజైన్:

ఈ ఫోన్ 16.69 సెం.మీ (6.57 అంగుళాల) FHD+ AMOLED కర్వ్డ్ డిస్‌ప్లేతో వస్తుంది.

బ్రైట్‌నెస్: ఏకంగా 4200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది.

రిఫ్రెష్ రేట్: 120Hz రిఫ్రెష్ రేట్ వల్ల గేమింగ్ మరియు స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది.

కలర్స్: ఎయిర్ వైట్, ఎయిర్ బ్లాక్ రంగుల్లో ఇది లభిస్తుంది.

కెమెరా అద్భుతం:

ఫోటోగ్రఫీ ప్రియుల కోసం రియల్‌మీ ఇందులో Dual 50MP Portrait Systemను ప్రవేశపెట్టింది.

రియర్ కెమెరా: 50MP ప్రధాన కెమెరా (f/1.8) + 2MP మోనోక్రోమ్ లెన్స్. ఇది 1080P వీడియో షూటింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

సెల్ఫీ కెమెరా: ముందు భాగంలో కూడా 50MP (f/2.4) హై-రెజల్యూషన్ కెమెరా ఉంది. వ్లాగర్లు మరియు సెల్ఫీ ప్రియులకు ఇది బెస్ట్ ఛాయిస్.

Also Read : శాంసంగ్ మొబైల్స్ ఇష్ట‌ప‌డే వారికి గుడ్ న్యూస్.. గెలాక్సీ F70e 5G త్వరలో లాంచ్,ధ‌ర ఎంత అంటే..!

పెర్ఫార్మెన్స్ మరియు స్టోరేజ్:

ఇందులో శక్తివంతమైన MediaTek Dimensity 6400 Turbo 8-కోర్ ప్రాసెసర్‌ను వాడారు.

ర్యామ్/రోమ్: 8GB+128GB, 8GB+256GB, మరియు 12GB+256GB వేరియంట్లలో లభిస్తుంది.

OS: లేటెస్ట్ realme UI 7.0 పై ఇది పనిచేస్తుంది.

బ్యాటరీ అండ్ ఛార్జింగ్:

ఈ ఫోన్ యొక్క అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని బ్యాటరీ. ఏకంగా 7000mAh భారీ బ్యాటరీని ఇందులో అమర్చారు. దీనికి తోడు 60W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సాధారణ వాడకంలో రెండు రోజుల పాటు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని కంపెనీ పేర్కొంది.

తక్కువ ధరలో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, అద్భుతమైన సెల్ఫీ కెమెరా కావాలనుకునే వారికి Realme 16 5G ఒక సరైన ఎంపిక.

Realme 16 5g Features Specifications

Feature Details
Size 16.69 cm (6.57”)
Type
AMOLED (Flexible)
Resolution
FHD+ (2372 × 1080)
Refresh Rate 120Hz
Brightness
1000 nits (typ), 1400 nits (HBM), 4200 nits peak
Color
10-bit, 1.07B colors
Screen Ratio 93%
Colors
Air White, Air Black
Weight ~183g
Thickness 0.81 cm
Rear Camera
50MP (Sony) + 2MP
Front Camera 50MP
Video
1080p 60fps, Slow-mo 120fps
Features
AI Portrait, Night Mode, Cinematic, Dual-view
Processor
MediaTek Dimensity 6400 Turbo
CPU Octa-core
GPU Mali G57 MC2
OS realme UI 7.0
RAM
8GB / 12GB (LPDDR4X)
Storage
128GB / 256GB (UFS 2.2)
Expandable Yes
OTG Supported
Network 5G Supported
Wi-Fi Wi-Fi 5
Bluetooth 5.1 / 5.2 / 5.3
USB Type-C
NFC No
Fingerprint In-display
Face Unlock Supported
Sensors
Gyroscope, Compass, Light, Proximity, IR
About Author:

Gujja Raju

గత 3 సంవత్సరాలుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్ట్ Gujja Raju. ప్రముఖ తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ Times Telugu మరియు లోకల్ న్యూస్ మీడియా సంస్థల్లో పనిచేసి వార్తా రచనలో అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం ప్రముఖ…

More About Author »