హైదరాబాద్: వయస్సు కేవలం 2 సంవత్సరాల 11 నెలలు.. కానీ ఆయన ఆలోచనలు మాత్రం గ్రాండ్ మాస్టర్లను తలపిస్తున్నాయి. జూబ్లీహిల్స్‌లోని ఎమ్మెల్యే & ఎంపీల కాలనీ కల్చరల్ సెంటర్‌లో జరిగిన రాయ్ చెస్ అకాడమీ పోటీల్లో కొండా శ్రేయాన్ష్ మురళీకృష్ణ పటేల్ సృష్టించిన రికార్డులు ఇప్పుడు క్రీడా లోకాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి.
రెండు అసాధారణ ప్రపంచ రికార్డులు:
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (లండన్) ప్రతినిధుల సమక్షంలో శ్రేయాన్ష్ ఈ ఘనతలను సాధించాడు:
- చెక్‌మేట్ మాస్టర్: కేవలం 15 నిమిషాల 52 సెకండ్లలోనే 93 బ్యాక్ ర్యాంక్ చెక్‌మేట్స్ పజిల్స్‌ను పరిష్కరించి తొలి రికార్డు సృష్టించాడు.
- బోర్డ్ సెట్టింగ్: 1 గంట 9 నిమిషాల 9 సెకండ్లలో 21 చెస్ బోర్డులను అత్యంత వేగంగా, ఖచ్చితంగా అమర్చి రెండో ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
రెండు సంవత్సరాల 11 నెలల అత్యంత పిన్న వయస్సులోనే చదరంగంలో ప్రపంచ రికార్డును సాధించిన ఏకైక బాలుడిగా నిలిచిన కొండా శ్రేయాన్ష్ మురళీ కృష్ణ పటేల్..
రాయ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రెండు అసాధారణ రికార్డులను నెలకొల్పి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (లండన్) స్థానం… pic.twitter.com/lKeJoYUExU
— Konda Surekha (@iamkondasurekha) April 7, 2026
ముఖ్య అతిథుల ప్రశంసలు:
ఈ అద్భుత ఘట్టానికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు మరియు క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి గారు హాజరయ్యారు.
“అతి చిన్న వయస్సులోనే ఇలాంటి అసాధారణ ప్రతిభను ప్రదర్శించడం రాష్ట్రానికే గర్వకారణం” అని వారు శ్రేయాన్ష్‌ను అభినందించారు.
రాయ్ చెస్ అకాడమీ నిర్వహించిన 2 అసాధారణ రికార్డులను నెలకొల్పి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (లండన్) స్థానం సాధించిన కొండా శ్రేయాన్ష్ కృష్ణ పటేల్.
మనవడి ప్రతభను చూసి మురిసిపోయిన మంత్రి కొండా సురేఖ.#KondaSurekha #KondaShreyanshKrishnaPatel #chessrecords #UANow pic.twitter.com/1WgcxRkmrj— UttarandhraNow (@UttarandhraNow) April 7, 2026
ఇంతటి ఏకాగ్రత, ఓపిక ఉన్న ఈ చిన్నారి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాడని ఆకాంక్షించారు.
బ్రిటిష్ పార్లమెంట్‌లో సత్కారం:
ఈ రికార్డుల గుర్తింపుగా శ్రేయాన్ష్ త్వరలో బ్రిటిష్ పార్లమెంట్‌లో జరగబోయే కార్యక్రమంలో సత్కారం అందుకోబోతున్నాడు. వరల్డ్ బుక్ ఆఫ్ లండన్ ద్వారా అధికారిక సర్టిఫికెట్ కూడా ఈ చిన్నారికి అందనుంది. ఇంత చిన్న వయస్సులో అంతర్జాతీయ వేదికపై గౌరవం పొందడం తెలంగాణ క్రీడా చరిత్రలో ఒక అరుదైన మైలురాయి.
Also Read :
జలమే జీవం.. సంరక్షణే మన లక్ష్యం: 100 రోజుల ప్రత్యేక డ్రైవ్‌కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకారం!
శ్రీవారి హుండీలో రద్దయిన నోట్లు: భక్తా? అమాయకత్వమా? లేక దేవుడినే మోసం చేస్తున్నారా?


