తెలంగాణ MBBS, BDS అడ్మిషన్లకు నోటిఫికేషన్.. ఆగస్టు 5 నుంచి దరఖాస్తులు, పూర్తి వివరాలు ఇవే

తెలంగాణలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో MBBS, BDS కన్వీనర్ కోటా ప్రవేశాల కోసం కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 5 నుంచి 12 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనుంది.

Telangana MBBS Admissions 2026
Telangana MBBS Admissions 2026

MBBS, BDS ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి MBBS, BDS కోర్సుల కన్వీనర్ (Competent Authority) కోటా సీట్లలో ప్రవేశాల కోసం కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ (KNRUHS) నోటిఫికేషన్ విడుదల చేసింది. NEET UG-2026లో అర్హత సాధించిన విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ సూచించింది.

దరఖాస్తుల షెడ్యూల్

  • దరఖాస్తుల ప్రారంభం: 2026 ఆగస్టు 5 ఉదయం 6 గంటలు
  • చివరి తేదీ: 2026 ఆగస్టు 12 సాయంత్రం 6 గంటలు
  • దరఖాస్తు వెబ్‌సైట్: https://tsmedadm.tsche.in

వెబ్ ఆప్షన్లకు ముందు సీట్ల మ్యాట్రిక్స్‌ను ప్రత్యేకంగా ప్రకటిస్తామని యూనివర్సిటీ వెల్లడించింది.

ఎవరు అర్హులు?

  • NEET UG-2026లో క్వాలిఫై అయి ఉండాలి.
  • తెలంగాణ రాష్ట్ర అర్హత నిబంధనలు పూర్తి చేయాలి.
  • ఇంటర్మీడియట్ (బైపీసీ) లేదా సమాన అర్హతలో అవసరమైన మార్కులు ఉండాలి.
  • 2026 డిసెంబర్ 31 నాటికి కనీసం 17 సంవత్సరాల వయస్సు పూర్తి అయి ఉండాలి.
  • NEET-2026 కట్ ఆఫ్ మార్కులు
  • కేటగిరీ కట్ ఆఫ్ స్కోర్
  • జనరల్ / EWS 213
  • జనరల్ PwD 194
  • SC / ST / BC / PwD 177

దరఖాస్తు ఫీజు

  • OC / BC: రూ.4,000
  • SC / ST: రూ.3,200

(బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఛార్జీలు అదనం. ఒకసారి చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వరు.)

అప్‌లోడ్ చేయాల్సిన ముఖ్యమైన పత్రాలు

  • NEET UG-2026 స్కోర్ కార్డు
  • SSC / జనన ధ్రువీకరణ పత్రం
  • ఇంటర్ మార్క్స్ మెమో
  • 9వ, 10వ తరగతి స్టడీ సర్టిఫికెట్లు
  • ఇంటర్ స్టడీ సర్టిఫికెట్లు
  • ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (TC)
  • కుల ధ్రువీకరణ పత్రం (వర్తిస్తే)
  • EWS సర్టిఫికేట్ (వర్తిస్తే)
  • ఆధార్ కార్డు
  • పాస్‌పోర్ట్ సైజు ఫోటో
  • అభ్యర్థి సంతకం
  • అవసరమైతే NCC, CAP, మైనారిటీ, ఆదాయ, SCCL తదితర ప్రత్యేక కేటగిరీ సర్టిఫికెట్లు కూడా అప్‌లోడ్ చేయాలి.

విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు

  • అన్ని తప్పనిసరి సర్టిఫికెట్లను తప్పకుండా అప్‌లోడ్ చేయాలి.
  • రిజిస్ట్రేషన్ ఒక్కసారి మాత్రమే చేయాలి.
  • ప్రతి కౌన్సెలింగ్ రౌండ్‌కు మళ్లీ సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు.
  • సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం తాత్కాలిక మెరిట్ జాబితా విడుదల చేస్తారు.
  • వెబ్ ఆప్షన్లు, కౌన్సెలింగ్ షెడ్యూల్, సీట్ల మ్యాట్రిక్స్‌ను తర్వాత KNRUHS వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు.
  • కళాశాలల ఎంపికలో ప్రాధాన్యత క్రమాన్ని జాగ్రత్తగా నమోదు చేయాలని యూనివర్సిటీ సూచించింది.

హెల్ప్‌లైన్ నంబర్లు

  • రూల్స్, రెగ్యులేషన్స్: 7901098840, 9490585796
  • టెక్నికల్ సమస్యలు: 9392685856, 9059672216, 7842136688
  • పేమెంట్ సమస్యలు: 9618240276
  • సర్టిఫికేట్ వెరిఫికేషన్: 9866092370

(పని దినాల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే.)

Also read: తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు 85 వేల దాటాయి

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »