First Look of Bullet Train | భారతదేశ తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌గా భావిస్తున్న ముంబయి- అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రైల్వేశాఖ రివీల్ చేసింది. న్యూఢిల్లీ రైల్‌భవన్‌లోని గేట్ నంబర్–4 వద్ద బుల్లెట్ ట్రైన్ చిత్రాన్ని ఏర్పాటు చేసింది. దీన్ని భారత హైస్పీడ్ రైలు ప్రాజెక్టులో కీలక ముందడుగుగా భావిస్తున్నారు. మొత్తం 508 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్న ఈ బుల్లెట్ ట్రైన్ కారిడార్‌కు జపాన్ సాంకేతికతతో పాటు ఆర్థిక సహకారం అందిస్తోంది. మహారాష్ట్ర, గుజరాత్, దాద్రా నగర్ హవేలీ ప్రాంతాల గుండా ఈ మార్గం సాగనుంది. ముంబయి థానే, విరార్, బోయిసర్, వాపి, బిలిమోరా, సూరత్, భరూచ్, వడోదరా, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతి తదితర ప్రాంతాల్లో మొత్తం 12 స్టేషన్లు నిర్మిస్తున్నారు.
Read Also : రైలు ప్రయాణికులకు అలర్ట్: పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు!
Indian Railways Rules 2026: జూలై 2026 నుండి ఇండియన్ రైల్వేస్ కొత్త రూల్స్.. టికెట్ లేని ప్రయాణం, మహిళల కోచ్ లపై భారీ జరిమానాలు!
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2పై కేంద్రానికి రేవంత్ లేఖ.. ‘రుణం ఆలస్యం చేయొద్దు, కిషన్‌రెడ్డి జోక్యం చేసుకోండి’
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కొనాలనుకుంటున్నారా? బంపర్ డిస్కౌంట్ ఆఫర్‌ని ప్రకటించిన రిలయన్స్..!
ఈ ఏడాదిలోనే సేవలు అందుబాటులోకి..
ఈ ఏడాదిలోనే సూరత్–బిలిమోరా మధ్య తొలి బుల్లెట్ ట్రైన్ సేవలు ప్రారంభించాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సైతం ప్రతిపాదిత 12 స్టేషన్లలో ఎనిమిది స్టేన్లకు సంబంధించి పునాది పనులు పూర్తయ్యాయన్నారు. వాపి, బిలిమోరా, సూరత్, భరూచ్, ఆనంద్, వడోదరా, అహ్మదాబాద్, సబర్మతి స్టేషన్ల పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ప్రాజెక్టులో భాగంగా ఇప్పటివరకు 17 నదీ వంతెనల నిర్మాణం పూర్తయింది. నర్మదా, మహి, తాప్తి, సబర్మతి వంటి ప్రధాన నదులపై వంతెనల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని రైల్వే శాఖ తెలిపింది. మహారాష్ట్రలో కూడా పలు నదీ వంతెనల నిర్మాణం కొనసాగుతోంది. థానే, సూరత్, సబర్మతి ప్రాంతాల్లో డిపోల నిర్మాణం కూడా వేగంగా జరుగుతోంది. ముంబయిలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) స్టేషన్ నిర్మాణ పనులు కీలక దశకు చేరుకున్నాయి. మొత్తం తవ్వకాల పనుల్లో సుమారు 91 శాతం పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు.
Read Also : భారతీయ రైల్వేల 173 ఏళ్ల ప్రస్థానం: 99.6% విద్యుదీకరణ పూర్తి!
సముద్ర అడుగుభాగంలో సొరంగం..
ఈ ప్రాజెక్టులో భాగంగా సముద్ర అడుగు భాగంలో నిర్మిస్తున్న సొరంగ మార్గం పనులు కూడా ప్రారంభమయ్యాయి. సుమారు 21 కిలోమీటర్ల పొడవు గల ఈ టన్నెల్‌లో మహారాష్ట్రలోని ఘన్‌సోలి–శిల్ఫాటా మధ్య దాదాపు 4.8 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్ రైలు విజయవంతమైన విషయంతెలిసిందే. ప్రస్తుతం భారతీయ రైల్వే గంటకు 280 కిలోమీటర్ల వేగంతో నడిపే హైస్పడ్ రైలును తయారు చేసేందుకు ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్), భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఈఎంఎల్) సంయుక్తంగా పనిచేస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా హైస్పీడ్ రైలు సాంకేతికతలో భారత్‌కు విశేష అనుభవం లభిస్తుందని రైల్వే శాఖ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది.
Read Also :రైలులో చెత్త వేస్తే జరిమానా తప్పదు – భారత రైల్వే శుభ్రత డ్రైవ్‌లో వేల మంది దొరికారు
రవాణారంగంలో మార్పులు..
ట్రాక్ నిర్మాణం, ఆధునిక సిగ్నలింగ్, రైళ్ల తయారీ, నిర్వహణ వంటి రంగాల్లో దేశం మరింత నైపుణ్యం సాధించనుందని అధికారులు చెబుతున్నారు. “మేక్ ఇన్ ఇండియా”, “ఆత్మనిర్భర్ భారత్” కార్యక్రమాల కింద దేశీయంగానే హైస్పీడ్ రైళ్ల తయారీపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ప్రాజెక్టు కోసం భూసేకరణ చట్టబద్ధంగా నిర్వహించామని, బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించినట్లుగా రైల్వేశాఖ స్పష్టం చేసింది. బుల్లెట్ ట్రైన్ సేవలు అందుబాటులోకి వస్తే దేశ రవాణా రంగంలో పెనుమార్పులు వచ్చే అవకాశం ఉందని, భవిష్యత్తులో మరిన్ని హైస్పీడ్ రైలు కారిడార్లకు ఇది మార్గం సుగమం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
Read Also : రాయదుర్గం భూములు వేలం వేయనున్న కాంగ్రెస్ సర్కారు..! ఒక్కో ఎకరానికి రూ.139 కోట్లు..!