ఎన్నికుట్ర‌లు చేసినా స్థానిక సంస్థ‌ల్లో వైసీపీ జెండా ఎగ‌రాలి.. నేత‌ల‌కు జ‌గ‌న్ పిలుపు..!

స్థానిక సంస్థల ఎన్నికలు (AP Local Body Elections) దృష్ట్యా వైసీపీ (YSRCP) ఇన్‌చార్జీల‌కు జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే దాన్ని ఇన్‌చార్జిల వైఫల్యంగా పరిగణిస్తానని స్పష్టం చేశారు. పార్టీ వ్యూహం, అభ్యర్థుల ఎంపిక, ప్రచార కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు.

YS Jagan | ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలను వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. పార్టీని ఎన్నికలకు సిద్ధం చేసే క్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జిల‌తో నిర్వహించిన సమావేశంలో ఆయన స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ఏ ప్రాంతంలోనైనా ఎన్నిక ఏకగ్రీవంగా జరిగితే దాన్ని అక్కడి ఇన్‌చార్జి వైఫల్యంగా తీసుకుంటాన‌ని స్ప‌ష్టం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య నేతలు, సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

Read Also : సీబీఎన్ అంటే బ్రాండ్‌.. మ‌హానాడులో లోకేశ్ వ్యాఖ్య‌లు..

వెన‌క్కి త‌గ్గొద్దు..

ఎన్నికల వ్యూహంపై మాట్లాడిన జగన్.. అధికార పార్టీ నుంచి ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గొద్దని పార్టీ నేతలకు సూచించారు. “ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిచోటా వైసీపీ జెండా ఎగరేయాలి. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగిందంటే మాత్రం నేను చాలా సీరియస్‌గా తీసుకుంటా. ఇది మళ్లీ మళ్లీ చెబుతున్నా. అలా జరిగితే అది నియోజకవర్గ ఇంఛార్జి ఫెయిల్యూర్‌గానే భావిస్తా” అని జగన్ తేల్చి చెప్పారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా జగన్ పలు సూచనలు చేశారు. ముఖ్యంగా ఎస్సీ వర్గాల ప్రభావం ఎక్కువగా ఉన్న గ్రామాల్లో ఆ వర్గాలకు చెందిన వారికే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందనే నమ్మకం కల్పించాలని, అలా చేస్తే భవిష్యత్ ఎన్నికల్లో కూడా వారు పార్టీకి బలంగా నిలుస్తారని చెప్పారు. గ్రామస్థాయిలో పార్టీ కోసం పనిచేసే నాయకులను గుర్తించి అవకాశాలు కల్పించాలని ఆదేశించారు.

Read Also : బండి భగీరథ్‌ లొంగిపోలేదు.. మేమే అరెస్టు చేశాం : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

దూకుడుగా కార్య‌క్ర‌మాలు..

ఇక రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపైనా జగన్ దృష్టి పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వ హామీలు, అమలులో ఉన్న లోపాలను ప్రజలకు వివరించేలా ‘వెన్నుపోటు రెండేళ్లు’ పేరుతో సిద్ధం చేసిన బుక్‌లెట్‌ను ఇంటింటికీ పంపిణీ చేయాలని నేతలకు సూచించారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో చర్చ జరిగేలా చేయాలని, అదే స్థానిక ఎన్నికల్లో పార్టీకి బలం అవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రచార కార్యక్రమాలను గ్రామస్థాయిలో మరింత దూకుడుగా నిర్వహించాలని, ప్రతి కార్యకర్త ప్రజల్లో ఉండాలని జగన్ నేతలకు దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎన్నికలను సాధారణంగా తీసుకోకుండా, పార్టీ భవిష్యత్తుకు కీలకంగా భావించి పనిచేయాలని సూచించారు.

Read Also : భగీరథ్‌ను అరెస్ట్‌ చేయలేదు.. లొంగిపోయాడు.. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ కౌంటర్‌

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »