రాశుల వారికి ఎలా ఉంది? ఈ రోజు ఏ రాశికి ఏ దేవుడిని పూజించాలి?

ఈ రోజు 12 రాశుల వారి దినఫలాలు ఎలా ఉన్నాయి? ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆర్థిక విషయాల్లో రాశుల వారీగా ఫలితాలు, పూజించాల్సిన దేవతలు, చేయాల్సిన పూజా విధానాలు తెలుసుకోండి.

నేటి రాశిఫలాలు
నేటి రాశిఫలాలు

నేటి రాశిఫలాల్లో మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి.. ఏ రాశి వారికి ఏ దైవాన్ని పూజించాలి.. ఎలాంటి స్తోత్రాలను పారాయణం చేయాలి అనే వివరాలు తెలుసుకుందాం.

మేష రాశి

మేష రాశి వారు నిర్ణయాత్మకమైన శక్తిగా ఎదగగలుగుతూ ఉంటారు. కష్టపడి పని చేస్తారు. ఉద్యోగాల్లో లక్ష్యాలను చేరుకోగలుగుతారు. వివిధ రూపాల్లో కష్టమైన అంశాల్లో పెద్దవారి సలహాలు తీసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు.

ఈరోజు మీకు అనుకూలించే దైవం: శ్రీ రామచంద్ర స్వామి వారు.
చేయవలసిన పూజ: రామాష్టకాన్ని పారాయణం చేయడం మంచిది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు కుటుంబ ఆదాయ మార్గాలు పెంచుకోగలుగుతారు. పాత బాకీలను వసూలు చేసుకోగలుగుతారు. అలాగే సౌకర్యవంతమైన విలాసాలు ఎదురవుతూ ఉంటాయి. అన్యోన్య కుటుంబ జీవనాలు ఏర్పడుతూ ఉంటాయి.

ఈరోజు మీకు అనుకూలించే దైవం: శ్రీ ధనలక్ష్మి అమ్మవారు.
చేయవలసిన పూజ: లక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి.

మిథున రాశి

మిథున రాశి వారికి నూతన వ్యాపార సమాచారం అందుతూ ఉంటుంది. అలాగే మీ వ్యక్తిత్వ జీవనాలను మరింత మెరుగుపరుచుకుంటూ ఉంటారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. కష్టపడి చదవగలుగుతారు. పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతను సాధించుకుంటారు.

ఈరోజు మీకు అనుకూలించే దైవం: శ్రీ దత్తాత్రేయ స్వామి వారు.
చేయవలసిన పూజ: గురుపాదుకా స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారు కుటుంబపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. గతంలో మీ అవసరం కోసం చేసిన అప్పుల విషయంలో వాటిని తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. మానసికమైన ఒత్తిడి నుంచి బయటపడుతూ ఉంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఈరోజు మీకు అనుకూలించే దైవం: శ్రీ దుర్గ అమ్మవారు.
చేయవలసిన పూజ: దుర్గ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించాలి. పరమాన్నాన్ని నివేదన చేయడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారు వివిధ రూపాల్లో ప్రాంతాల ప్రయాణాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. వృత్తిపరమైన గౌరవాలు కలిసి వస్తుంటాయి. కుటుంబపరమైన పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. రాజకీయపరమైన విలువలను కాపాడుకునే ప్రయత్నం చేయాలి.

ఈరోజు మీకు అనుకూలించే దైవం: వెంకటేశ్వర స్వామి వారు.
చేయవలసిన పూజ: స్వామివారి ప్రపత్తి స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది.

కన్య రాశి

కన్య రాశి వారికి ఉద్యోగ వ్యవహారాలు కలిసి వస్తుంటాయి. పరీక్షల విషయంలో అనుకూలతలు పెంచుకుంటారు. అనారోగ్య భావనలు తగ్గిపోతుంటాయి. అప్పుల భారాల విషయంలో కొంత ఉపశమనం లభిస్తుంది.

ఈరోజు మీకు అనుకూలించే దైవం: అష్టలక్ష్మి అమ్మవారు.
చేయవలసిన పూజ: మహాలక్ష్మి స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈరోజు కుటుంబపరమైన అనుమతుల కోసం ఎదురు చూడవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. వ్యాపార ప్రయత్నాలు కలిసి వస్తుంటాయి. మంచి తెలివితో వ్యవహరిస్తూ అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉంటారు. నూతన స్నేహ పరిచయాలు కలిసి వస్తాయి.

ఈరోజు మీకు అనుకూలించే దైవం: మహా త్రిపుర సుందరి అమ్మవారు.
చేయవలసిన పూజ: లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారు రుణ సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనగలుగుతారు. అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. పరిశోధన అంశంలో మంచి పురోభివృద్ధిని సాధించుకుంటారు. రహస్యంతో కూడిన కార్యక్రమాలను జాగ్రత్తగా చేపడుతుండాలి.

ఈరోజు మీకు అనుకూలించే దైవం: ఆంజనేయ స్వామి వారు.
చేయవలసిన పూజ: హనుమత్ కవచాన్ని పారాయణం చేయడం మంచిది.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి విద్యా సంబంధమైన అంశాల్లో గౌరవాలు లభిస్తూ ఉంటాయి. అలాగే తీర్థయాత్రలు చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటారు. రాజకీయపరమైన విందు వినోదాలు ఉంటాయి.

ఈరోజు మీకు అనుకూలించే దైవం: శ్రీ దత్తాత్రేయ స్వామి వారు.
చేయవలసిన పూజ: దత్త స్తోత్రాన్ని పారాయణం చేయడం, గోసేవ చేసుకోవడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారు స్థిర, చరాస్తుల క్రయ విక్రయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ విషయంలో పెద్దవారు లేదా అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారాలు లభిస్తుంటాయి. అలాగే వేరు వేరు రూపాల్లో ఒప్పంద పత్రాలను సమీక్ష చేస్తుంటారు.

ఈరోజు మీకు అనుకూలించే దైవం: శ్రీమన్నారాయణుడు.
చేయవలసిన పూజ: హరి స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక, దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహితులతో కలిసి పలు రకాల సమాచారాల గురించి చర్చిస్తూ ఉంటారు. అలాగే డిజిటల్ రంగంలో అనుభవాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఊహించని సహకారాలు అందివస్తుంటాయి.

ఈరోజు మీకు అనుకూలించే దైవం: శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారు.
చేయవలసిన పూజ: కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది.

మీన రాశి

మీన రాశి వారు రచన, ధార్మికపరమైన కార్యక్రమాల్లో ఆసక్తిని పెంచుకుంటూ ఉంటారు. కుటుంబ పెద్దల సలహాలు మేలు చేస్తూ ఉంటాయి. వ్యాపార విషయంలో విస్తరణతో కూడిన ఆలోచనలు చేస్తూ ఉంటారు. అలాగే రాజకీయపరమైన వైరుధ్యాలు పెంచుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించండి.

ఈరోజు మీకు అనుకూలించే దైవం: మహాగణపతి స్వామి వారు.
చేయవలసిన పూజ: సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »