Loan Tips | మంచి జీతం ఉన్నా లోన్ రిజెక్ట్ అవుతోందా..? ఇందుకు ఈ ప్ర‌ధాన కార‌ణాలు ఇవే..!

మంచి జీతం ఉన్నా లోన్‌ (Loan Approval) రిజెక్ట్‌ అవుతుండటం చాలా మందికి ఎదురయ్యే సమస్య. దీనికి ప్రధాన కారణాలు తక్కువ సిబిల్‌ స్కోర్‌ (CIBIL Score), అధిక ఈఎంఐ భారం (EMI Burden), పొదుపులు (Savings), ఉద్యోగ స్థిరత్వం లేకపోవడం (Job Stability) బ్యాంకులు పరిగణలోకి తీసుకుంటున్నాయి. ఒకేసారి అనేక బ్యాంకులకు దరఖాస్తు చేయడం (Multiple Loan Applications) కూడా లోన్‌ తిరస్కరణకు కారణం.

Loan Tips | మంచి జీతం ఉన్నా లోన్ రిజెక్ట్ అవుతోందా..? ఇందుకు ఈ ప్ర‌ధాన కార‌ణాలు ఇవే..!

Loan Tips | ఇల్లు, కారు కొనుగోలు, ఉన్నత విద్య వంటి అవసరాల కోసం జీవితంలో ఎన్నో సందర్భాల్లో డబ్బు అవసరం పడుతుంది. అలాంటి వేళల్లో చాలా మంది బ్యాంకు రుణాలను ఆశ్రయిస్తారు. సాధారణంగా మంచి జీతం ఉన్న వారికి లోన్ సులభంగా మంజూరవుతుందని భావిస్తారు. అయితే, కొన్ని సందర్భాల్లో మంచి జీతం ఉన్నప్పటికీ లోన్ దరఖాస్తులు రిజెక్ట్ అవుతుంటాయి. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. ఒక‌సారి అవేంటో ప‌రిశీలిద్దాం..!

పొదుపులు లేకపోవడం ప్ర‌ధాన కార‌ణం

మంచి జీతం ఉన్నా, మీ వద్ద సరైన పొదుపులు లేకపోతే బ్యాంకులు లోన్ ఇవ్వడంలో వెనుకడుగు వేసే అవ‌కాశాలున్నాయి. ఇప్పటికే మీకు ఉన్న ఈఎంఐలు ఎంత? నెలవారీ ఖర్చులు ఎంత? వంటి అంశాలను బ్యాంకులు పరిశీలిస్తాయి. ఈ ఖర్చులు అధికంగా ఉంటే, లోన్‌ను రిజెక్ట్ చేసేఅవకాశం ఉంటుంది.

Read Also : నిరుపేదలకు శుభవార్త.. రెండో విడుతలో నియోజకవర్గానికి 2వేల ఇండ్లు.. ఇక కాలేజీల్లోనూ మధ్యాహ్నం భోజనం..!

ఉద్యోగంలో స్థిరత్వం కీల‌క‌మే..

మీరు పనిచేస్తున్న సంస్థ రిజిస్టర్ కాలేదా? లేదా బ్యాంక్ జాబితాలో లేకపోతే? అలాంటి పరిస్థితుల్లో మంచి జీతం ఉన్నా లోన్ పొందడం కష్టమవుతుంది. అలాగే మీరు పనిచేస్తున్న సెక్టార్ సైతం లోన్ అప్రూవ‌ల్‌పై ప్ర‌భావం చూపుతుంది.

Read Also : భాష ఏదైనా ఫిర్యాదు ఇక సులభం.. ఏఐ కాప్‌రైటర్‌ యాప్‌ని ఆవిష్కరించిన సజ్జనార్‌

ఎక్కువ‌గా లోన్ కోసం ద‌ర‌ఖాస్తు చేసినా..

చాలా చోట్ల వరుసగా లోన్ కోసం దరఖాస్తు చేస్తూ ఉంటారు. అది కూడా లోన్ అప్రూవ‌ల్‌పై ప్రతికూల ప్ర‌భావం చూపుతుంది. తక్కువ సమయంలోనే అనేక బ్యాంకుల్లో ద‌ర‌ఖాస్తు చేస్తే.. అప్లికేష‌న్‌ని తిర‌స్క‌రించే అవ‌కాశాలు పెరుగుతాయి. కాబట్టి ఒకే సమయంలో ఎక్కువ‌గా ద‌ర‌ఖాస్తు చేయ‌డం మానుకోవాలి.

సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నా..

లోన్ మంజూరులో సిబిల్ స్కోర్ పాత్ర కీల‌కం. సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే బ్యాంకులు లోన్ ఇవ్వడానికి నిరాకరిస్తాయి. సాధారణంగా 700, అంతకంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉంటే లోన్ అప్రూవ‌ల్‌కు మార్గం సుగ‌మ‌మ‌వుతుంది. వాస్త‌వానికి మంచి జీతం ఉన్నా ఇతర ఆర్థిక అంశాలను సమతుల్యం చేసుకోవడం ద్వారా మాత్రమే లోన్ అప్రూవ‌ల్‌కు అవ‌కాశాలు మెరుగ‌వుతాయి.

Read Also : తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. రోజ్‌గార్ మేళాలో కేంద్రమంత్రి బండి సంజయ్‌ కామెంట్స్‌..

About Author:

Vidya Burujukadi

కంటెంట్ రైటర్‌గా మన వార్త వెబ్ సైట్‌కి విద్య.బి పనిచేస్తున్నారు. ప్రధానంగా బిజినెస్ వార్తలతో పాటు పర్సనల్ ఫైనాన్స్, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన తాజా సమాచారం, జనరల్ అంశాలకు సంబంధించిన కథనాలను ఆమె అందిస్తారు. విద్యకు తెలుగు మీడియా…

More About Author »