- GHMC ఈ-వేస్ట్ హోమ్ పిక్‌అప్ సేవలను ప్రారంభించింది
- QR కోడ్ స్కాన్ చేసి ఇంటి నుంచే పిక్‌అప్ బుక్ చేసుకునే అవకాశం
- పాత గ్యాడ్జెట్లు, ఛార్జర్లు, కేబుల్స్‌ను బాధ్యతాయుతంగా రీసైకిల్ చేయనున్నారు
పాత ఫోన్లు ఇక ఇంట్లో కాదు.. GHMC కొత్త ఈ-వేస్ట్ సేవ ప్రారంభం
Greater Hyderabad Municipal Corporation నగరవాసులకు పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కల్పించే మరో వినూత్న సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంట్లో పేరుకుపోయిన పాత మొబైల్స్, ఛార్జర్లు, కేబుల్స్, చిన్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను సురక్షితంగా తొలగించేందుకు ‘ఈ-వేస్ట్ హోమ్ పిక్‌అప్’ సేవలను ప్రారంభించింది.
సాధారణంగా చాలామంది పాత ఫోన్లు, చెడిపోయిన ఛార్జర్లు లేదా ఉపయోగం లేని ఎలక్ట్రానిక్ వస్తువులను “ఎప్పుడో ఉపయోగపడతాయి” అనే భావనతో ఇంట్లోనే నిల్వ ఉంచుతుంటారు. అయితే వీటిలో ఉండే హానికర రసాయనాలు పర్యావరణానికి, ఆరోగ్యానికి ముప్పుగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో GHMC ప్రారంభించిన ఈ సేవ నగర పరిశుభ్రతకు తోడ్పడటంతో పాటు ఈ-వేస్ట్ నిర్వహణను సులభతరం చేయనుంది.
Also Read : డబుల్ బెడ్‌రూం ఇళ్లలో నివసించకపోతే రద్దు – 19,000 మందికి చివరి నోటీసు
QR కోడ్ స్కాన్ చేస్తే చాలు
ఈ సేవను వినియోగించుకోవాలంటే GHMC విడుదల చేసిన QR కోడ్‌ను స్కాన్ చేసి, ఇంటి వద్ద పిక్‌అప్ కోసం వివరాలు నమోదు చేయాలి. అనంతరం సిబ్బంది నేరుగా ఇంటికే వచ్చి ఈ-వేస్ట్ సేకరిస్తారు.
ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఈ-వేస్ట్ నిర్వహణపై అవగాహన పెంచడంతో పాటు, ప్రమాదకర ఎలక్ట్రానిక్ వ్యర్థాలు సాధారణ చెత్తలో కలవకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు.
📱♻️ Still storing old phones, chargers, cables, and gadgets “just in case”?
ఇవి కూడా చదవండిGHMC now brings E-Waste Home Pick-Up services right to your doorstep — making responsible disposal easier than ever.
Simply:
📲 Scan the QR Code
🏠 Schedule a Pickup
♻️ Dispose E-Waste Responsibly… pic.twitter.com/MkVPN42a7u— GHMC (@GHMCOnline) May 23, 2026
పరిశుభ్రమైన హైదరాబాద్ లక్ష్యం
ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు నగర కాలుష్యానికి ప్రధాన కారణాలుగా మారుతున్న వేళ GHMC తీసుకొచ్చిన ఈ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణలో కీలక అడుగుగా భావిస్తున్నారు. ముఖ్యంగా యువత, ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉపయోగించే గ్యాడ్జెట్లు తరచూ మారుతుండటంతో ఈ-వేస్ట్ పరిమాణం కూడా భారీగా పెరుగుతోంది.
ఈ సేవ ద్వారా “తక్కువ చెత్త.. పరిశుభ్రమైన హైదరాబాద్” లక్ష్యాన్ని సాధించాలని GHMC భావిస్తోంది. నగరవాసులు కూడా బాధ్యతాయుతంగా ఈ-వేస్ట్‌ను రీసైక్లింగ్‌కు అప్పగించాలని అధికారులు పిలుపునిచ్చారు.
Also Read : Hyderabadలో కొత్త E-Waste సిస్టమ్.. QR స్కాన్ చేస్తే ఇంటికే పికప్!


