ఈ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం.. ఆర్థికంగా దశ తిరగడం ఖాయం!

Horoscope: గ్రహాల సంచారం ప్రభావంతో ఇవాళ అన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కొన్ని రాశులకు ధన లాభం కలిగే అవకాశం ఉండగా, మరికొన్ని రాశులు ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మీ రాశి ఫలితాలను తెలుసుకుని రోజు ఎలా ఉండబోతుందో ముందే తెలుసుకోండి.

Today Horoscope in Telugu | All Zodiac Signs Daily Predictions
Today Horoscope in Telugu | All Zodiac Signs Daily Predictions

Horoscope

  • ఇవాళ గ్రహాల ప్రభావంతో చాలా రాశుల వారికి ధన లాభం, పాత బాకీల వసూళ్లు జరిగే అవకాశం ఉంది.

  • డబ్బుకు సంబంధించిన ఒప్పందాలు, పెట్టుబడుల విషయంలో కొన్ని రాశులు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి.

  • కుటుంబం, ఆరోగ్యం, మానసిక ప్రశాంతతపై దృష్టి పెడితే రోజు మరింత అనుకూలంగా మారుతుంది.

హైదరాబాద్: జ్యోతిష్య (Horoscope)శాస్త్రం ప్రకారం ఇవాళ అన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. గ్రహాల సంచారం అనుకూలంగా ఉన్న వారికి అకస్మాత్తుగా ధన లాభం కలగవచ్చు, అలాగే నిలిచిపోయిన పాత బాకీలు కూడా వసూలయ్యే అవకాశం ఉంది. అయితే, కొన్ని రాశుల వారు తమ దైనందిన పనుల్లో కొన్ని ఆటంకాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన డీల్స్ కుదుర్చుకునేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి, లేకపోతే నష్టపోయే ప్రమాదం ఉంది.

మేష రాశి: కోర్టు వ్యవహారాలు లేదా ఆర్థిక వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. అయితే, కొత్త వారితో మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించండి.

వృషభ రాశి: ఇవాళ మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. విదేశీ వ్యాపారాలు చేసే వారికి ఇది సరైన సమయం. పాత వ్యాపార పద్ధతుల్లో కొన్ని మార్పులు చేయడం వల్ల విజయం సాధిస్తారు. పెళ్లి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది.

మిథున రాశి: మానసిక ఒత్తిడి నుండి బయటపడతారు. ఆర్థిక లావాదేవీల విషయంలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడండి.

కర్కాటక రాశి: మీరు గతంలో వేసిన ప్రణాళికలు ఇప్పుడు లాభాలను ఇస్తాయి. ప్రయాణాలు, కొత్త పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆరోగ్యం కోసం ఉదయం, సాయంత్రం బుధ మంత్రాన్ని జపించడం మంచిది.

సింహ రాశి: ఇవాళ చాలా ఉత్సాహంగా ఉంటారు. బంధువులకు అప్పు ఇచ్చే విషయంలో లేదా ఇంటి మార్పుల విషయంలో తొందరపాటు వద్దు. అందరి సలహాలు తీసుకున్నాకే నిర్ణయాలు తీసుకోండి.

కన్యా రాశి: శక్తివంతమైన నిర్ణయాలతో ఇవాళ ముందురు దూసుకుపోతారు. అనుకోకుండా ధన లాభం కలుగుతుంది. ఇంట్లోని పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఓపికతో వ్యవహరిస్తే విజయం మీదే.

తులా రాశి: ఇతరుల సహకారంతో వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. అతిథుల రాకతో ఇల్లు సందడిగా మారుతుంది.

వృశ్చిక రాశి: రోజు మొదట్లో కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ, తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి. వ్యాపార ప్లాన్లను రీ-చెక్ చేసుకోండి. మానసిక ప్రశాంతత కోసం యోగా లేదా ధ్యానం చేయండి.

ధనుస్సు రాశి: కుటుంబంలో ఉన్న పాత మనస్పర్థలు తొలగిపోయి బంధాలు బలపడతాయి. అయితే, కొత్తగా పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి అడుగు వేయండి.

మకర రాశి: ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది. డబ్బును పొదుపు చేయడంలో సక్సెస్ అవుతారు. పెళ్లి సంబంధాల కోసం చూస్తున్న వారికి శుభవార్త వినే అవకాశం ఉంది.

కుంభ రాశి: సంతానం కోసం లేదా వారి చదువుల కోసం ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మాట్లాడేటప్పుడు ఆవేశాన్ని తగ్గించుకోండి, ఒక నిమిషం ఆలోచించి మాట్లాడటం వల్ల అనవసర గొడవలను నివారించవచ్చు.

మీన రాశి: ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కుతారు. ఎక్కడో ఆగిపోయిన డబ్బు చేతికందుతుంది. కుటుంబ వేడుకల్లో పాల్గొనడం వల్ల కొత్త మిత్రులు పరిచయమవుతారు, పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటారు.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »