కృషిని గుర్తించనున్న పై అధికారులు.. కెరీర్‌లో ఈ రాశుల వారికి కీలక మలుపు!

Horoscope: ఫిబ్రవరి 3, 2026 మంగళవారం రాశిఫలాలు: ఈ రోజు చాలా రాశుల వారికి ఆర్థిక లాభాలు, కెరీర్‌లో గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ జీవితం, ఉద్యోగం, ఆరోగ్యం విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలను తెలుసుకోండి.

Daily Horoscope February 3, 2026 Telugu | Today Rasi Phalalu Tuesday
Daily Horoscope February 3, 2026 Telugu | Today Rasi Phalalu Tuesday

Horoscope

హైదరాబాద్: ఇవాళ గ్రహ గతుల(Horoscope)ను పరిశీలిస్తే, చాలా రాశుల వారికి , పొదుపు, కుటుంబ బంధాలను బలోపేతం చేసుకోవడం ప్రధానాంశాలుగా కనిపిస్తున్నాయి. కొన్ని రాశుల వారు తమ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆర్థికపరంగా చాలా రాశుల వారికి ఇవాళ అదృష్టం కలిసి వస్తుంది. గతంలో చేసిన పెట్టుబడుల నుండి లాభాలు అందడమే కాకుండా, కొత్త ఆదాయ మార్గాలు అవకాశాలు లభిస్తాయి. వృత్తిపరంగా కొన్ని రాశుల వారు కార్యాలయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా సహోద్యోగుల తీరును గమనిస్తూ, తమ విలువైన వస్తువులను జాగ్రత్త పరుచుకోవడం మంచిది. చాలా రాశులు తమ జీవిత భాగస్వామితో పాత మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు.

మేష రాశి: ఇవాళ మీకు ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టడం మంచిది. కుటుంబ విషయాల్లో లేదా ఏదైనా కష్టసమయంలో మీ జీవిత భాగస్వామి నుండి మీరు ఆశించినంత మద్దతు లభించకపోవచ్చు, కాబట్టి స్వశక్తిపై నమ్మకం ఉంచండి.

వృషభ రాశి: అనవసరమైన గొడవలకు, వాదనలకు దూరంగా ఉండండి. కొత్త వ్యాపార ఒప్పందాలు లేదా పెట్టుబడుల విషయంలో నిపుణుల సలహా తీసుకోవడం తప్పనిసరి. ఆఫీసులో అధికారుల అకస్మిక తనిఖీలు ఉండే అవకాశం ఉంది. సాయంత్రం వేళ ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది.

మిథున రాశి: ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ధన సంబంధిత విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు ఆర్థికంగా మేలు చేస్తాయి. ఆఫీసులో మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. అందరి మెప్పు పొందేలా చాలా చురుగ్గా పనులు పూర్తి చేస్తారు.

కర్కాటక రాశి: ఇంటి అలంకరణ లేదా అవసరాల కోసం ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పని ఒత్తిడి వల్ల శారీరక అలసట ఉంటుంది. జీవిత భాగస్వామితో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి.

సింహ రాశి: కార్యాలయంలో గత కొంతకాలంగా వేధిస్తున్న సమస్యలు ఈరోజుతో తొలగిపోతాయి. వృత్తిపరంగా చాలా అనుకూలమైన రోజు. అయితే, మీ భాగస్వామి ప్రవర్తన వల్ల సామాజికంగా మీ గౌరవానికి చిన్నపాటి భంగం కలిగే అవకాశం ఉంది.

కన్యా రాశి: తోటి ఉద్యోగులతో గొడవలు పడకుండా, ఒకరికొకరు సహకరించుకుంటూ కలిసి ఉండటం ముఖ్యం. మీ కోపం వల్ల ఉద్యోగానికి ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది. మీరు చేసే పనులు అనుకున్నంత వేగంగా ఫలితాలను ఇవ్వకపోవచ్చు, కానీ నిరాశ చెందకండి. ప్రయాణాల వల్ల కొత్త, ముఖ్యమైన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.

తులా రాశి: కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత అసహనాన్ని కలిగించినా ఓపికగా ఉండండి. ఇవాళ ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆ డబ్బును స్వచ్ఛంద కార్యక్రమాలకు ఖర్చు చేయడం వల్ల మీకు తృప్తి లభిస్తుంది. ఆఫీసులో మీ ప్రతిభకు తగిన ప్రశంసలు అందుతాయి.

వృశ్చిక రాశి: మీ ఆకర్షణీయమైన మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆఫీసులో సహోద్యోగుల పట్ల అప్రమత్తంగా ఉండండి, మీ వస్తువులు పోయే అవకాశం ఉంది. గతంలో మీరు చేసిన చిన్న చిన్న పొరపాట్లను అంగీకరించడం వల్ల మీ పరువు పెరుగుతుంది మరియు మానసిక ప్రశాంతత లభిస్తుంది.

ధనుస్సు రాశి: ఈరోజు మీరు చేసే దానధర్మాలు మీకు ఎంతో పుణ్యాన్ని, హాయిని ఇస్తాయి. మీ సొంత తెలివితేటలే మీకు ఈరోజు ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. మీ పని పట్ల మీకున్న అంకితభావమే సమాజంలో గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిపెడుతుంది.

మకర రాశి: కెరీర్ పరంగా విదేశీ అవకాశాలు లేదా అంతర్జాతీయ సంబంధాలు బలపడే అద్భుతమైన సమయం ఇది. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వద్దు. అనవసర ఖర్చులను నియంత్రించుకుంటేనే ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కగలరని ఇవాళ మీకు స్పష్టంగా అర్థమవుతుంది.

కుంభ రాశి: ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ, మీ ఉత్సాహం తగ్గదు. నిర్దేశించిన సమయం కంటే ముందే పనులన్నీ పూర్తి చేస్తారు. ఇవాళ మీరు చేసే ప్రయాణాలు భవిష్యత్తులో గొప్ప ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తాయి.

మీన రాశి: కొత్త ఆదాయ మార్గాలు మీ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తాయి. ఆఫీసులో పై అధికారుల సహకారం మీకు కొండంత అండగా ఉంటుంది. అయితే, మీ మాట తీరు పట్ల జాగ్రత్త వహించండి. కటువుగా మాట్లాడితే మీ తల్లిదండ్రులు లేదా ప్రియమైన వారు బాధపడే అవకాశం ఉంది.

Also Read: మీ ఇంట్లో నిమ్మ మొక్క ఉందా? వాస్తు ప్రకారం ఈ దిశలో ఉంచితే మీ ఇంట్లో కనక వర్షమే!

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »