LPG shortage India 2026 : LPG కొరతతో ఇండక్షన్ స్టవ్‌లకు క్రేజ్ పెరిగింది.. కానీ అది నిజంగా పరిష్కారమా?

LPG shortage India 2026 : గ్యాస్ సిలిండర్ దొరకట్లేదని ఇండక్షన్ స్టవ్‌లు కొనుక్కుంటున్నారు. Zepto, Blinkit స్టాక్ అయిపోయింది, Amazon లో లో స్టాక్ వార్నింగ్ వస్తోంది.

LPG shortage India 2026
LPG shortage India 2026

LPG shortage India 2026 : LPG కొరత భయంతో ఇండక్షన్ స్టవ్‌లకు క్యూ.. కానీ అది పరిష్కారం కాదు, పానిక్ మాత్రమే.యుద్ధ వాతావరణం వంటగదిలోకి చొచ్చుకొచ్చింది. గ్యాస్ సిలిండర్ దొరుకుతుందో లేదోనని భయపడిన వేలాది మంది ఒక్కసారిగా ఇండక్షన్ స్టవ్‌ల వైపు పరిగెత్తారు. Zepto, Instamart, Blinkit వంటి డెలివరీ యాప్‌లలో ఇండక్షన్ కుక్‌టాప్‌లు అన్నీ అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యాయి. Amazon లో కూడా లో స్టాక్ వార్నింగ్‌లు వస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్ షాపులకు వెళ్తే అక్కడ కూడా క్యూలు కనిపిస్తున్నాయి. కమ్యూనిటీ వాట్సాప్ గ్రూప్‌లు, మహిళల గ్రూప్‌లు అన్నీ ఇండక్షన్ స్టవ్ రికమెండేషన్‌లతో నిండిపోయాయి.

నోట్ల రద్దు – UPI లాగా అవుతుందా?

కొందరు దీన్ని పాజిటివ్‌గా చూస్తున్నారు. నోట్ల రద్దు జరిగినప్పుడు అందరూ UPI వైపు మారారు, అది చివరకు మంచే అయింది అని వాదిస్తున్నారు. LPG కొరత కూడా అలాగే మన వంటగదులను అప్‌గ్రేడ్ చేస్తుందని కొందరు నమ్ముతున్నారు. కానీ ఈ పోలిక అంత సులభంగా పని చేయదు.

ఇండక్షన్ స్టవ్ అందరికీ సాధ్యమా?

మొదటి సమస్య  భారతదేశంలో చాలా మంది కుటుంబాలకు ఇండక్షన్ కుక్‌టాప్ కొనే స్తోమత లేదు. స్టవ్ కొన్నా దానికి తగిన పాత్రలు కూడా కొనాలి. సాధారణ అల్యూమినియం, మట్టి పాత్రలు ఇండక్షన్‌లో పని చేయవు.
రెండో సమస్య — వేసవికాలం మరియు కరెంట్ కోతలు భారతదేశంలో, ముఖ్యంగా తెలంగాణలో పర్యాయ పదాలు. గ్యాస్ లేదని ఇండక్షన్ వాడదామని పెట్టుకుంటే కరెంట్ లేకపోతే అప్పుడు ఏం చేయాలి?

మూడో సమస్య  భారతీయ వంటలు అనేకం ఎక్కువ సేపు వండాల్సినవి. బిర్యానీ, దాల్, సాంబార్ వంటివి ఇండక్షన్‌లో వండితే కరెంట్ బిల్లు భారంగా వస్తుంది. ఒక LPG సిలిండర్‌కు బదులు నెలకు వందల రూపాయలు అదనంగా కరెంట్ బిల్లు కట్టాల్సి వస్తుంది.

అసలు పరిష్కారం ఏమిటి?

కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి LPG సరఫరాపై స్పష్టత ఇవ్వాలి. ప్రజలకు భరోసా ఇస్తే పానిక్ బయింగ్ తగ్గుతుంది. కానీ అంతకంటే పెద్ద సమస్య ఏమిటంటే — భారతదేశం ఏ దేశం మాటకూ కట్టుబడకుండా సొంత జాతీయ ప్రయోజనాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి. యుద్ధ వాతావరణం వల్ల పెట్రోల్, గ్యాస్ ధరలు పెరగడం, సరఫరా తగ్గడం జరిగితే నష్టపోయేది సామాన్య ప్రజలే.

యుద్ధం గురించి ఉత్సాహపడే అంకుల్స్‌కు ఒక్క విషయం  యుద్ధం జరిగితే మొదట దెబ్బ తినేది మన వంటగది బడ్జెట్ అని గుర్తుపెట్టుకోండి.

చివరగా ఒక్క మాట  ఇండక్షన్ స్టవ్‌లు అయిపోవడం అంటే కేవలం కొరత కాదు, ప్రభుత్వంపై పబ్లిక్ ట్రస్ట్ షేర్ మార్కెట్ కంటే వేగంగా పడిపోయిందని కూడా అర్థమవుతోంది.

Also Read : Hyderabad LPG shortage : హైదరాబాద్‌లో ఎల్పీజీ కొరత ప్రభావం – హాస్టళ్లలో కొన్ని ఫుడ్స్ బంద్

About Author: