హార్మోన్ల సమస్యలకు చెక్ పెట్టాలంటే.. ఉదయాన్నే ఈ ఐదు పనులు తప్పనిసరి!

హార్మోన్ల (Hormones)అసమతుల్యత అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. ఉదయపు అలవాట్లలో చిన్న మార్పులు చేయడం ద్వారా హార్మోన్ల పనితీరును సహజంగా మెరుగుపరచుకోవచ్చు. ఆయిల్ పుల్లింగ్, ఎండలో నడక, వ్యాయామం, సరైన అల్పాహారం హార్మోన్ల ఆరోగ్యానికి కీలకం.

Morning Habits to Balance Hormones Naturally
Morning Habits to Balance Hormones Naturally

Hormones

హైదరాబాద్: నేటి వేగవంతమైన జీవనశైలిలో చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య హార్మోన్ల అసమతుల్యత. సంతానలేమి, అధిక బరువు, చర్మ సమస్యలు, మానసిక ఆందోళన వంటి ఎన్నో ఇబ్బందులకు ఈ హార్మోన్ల హెచ్చుతగ్గులే ప్రధాన కారణం. హార్మోన్లను దారిలోకి తెచ్చుకోవాలంటే కేవలం మందులు వాడితే సరిపోదు, మన జీవనశైలిలో చిన్నపాటి మార్పులు చేసుకోవడం ఎంతో అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మనం రోజును ప్రారంభించే విధానం మన శరీరంలోని హార్మోన్ల పనితీరుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.

చేయాల్సిన ముఖ్యమైన పనులు:

ఆయిల్ పుల్లింగ్: ఉదయాన్నే పళ్లు తోముకోకముందే కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెతో ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల నోటి ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా శరీరంలోని వ్యర్థాలు (టాక్సిన్లు) బయటకు వెళ్లిపోతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి, పరోక్షంగా హార్మోన్ల సమతుల్యతకు దోహదపడుతుంది.

సూర్యరశ్మి: నిద్రలేవగానే మొబైల్ చూడటం వల్ల ఒత్తిడిని పెంచే ‘కార్టిసాల్’ హార్మోన్ విడుదలవుతుంది. దీనికి బదులుగా కనీసం అరగంట పాటు లేలేత ఎండలో గడపడం వల్ల శరీరానికి విటమిన్-డి అందడమే కాకుండా, మెదడులోని హార్మోన్లు క్రమబద్ధీకరిస్తాయి. ఇది మన నిద్ర సమయాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

ఖాళీ కడుపుతో కాఫీ : చాలామందికి బెడ్ కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కానీ పరగడుపున కెఫీన్ తీసుకోవడం వల్ల హార్మోన్లపై ప్రతికూల ప్రభావం పడుతుంది. దీనికి బదులుగా ప్రోటీన్లు అధికంగా ఉండే అల్పాహారం తీసుకోవడం వల్ల ఆకలిని నియంత్రించే గ్రెలిన్, లెప్టిన్ వంటి హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి.

పాదరక్షలు లేకుండా నడక: ఉదయాన్నే పచ్చని గడ్డిపై లేదా నేలపైన కాసేపు చెప్పులు లేకుండా నడవడం వల్ల భూమిలోని శక్తి శరీరానికి అందుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించి హార్మోన్ల పనితీరును మెరుగుపరుస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.

శారీరక శ్రమ: ఉదయం పూట చేసే వ్యాయామాలు రోజంతా మనల్ని ఉత్సాహంగా ఉంచుతాయి. బరువులెత్తడం , కార్డియో వ్యాయామాలు లేదా సూర్య నమస్కారాలు చేయడం వల్ల హార్మోన్లు క్రమబద్ధీకరించి, ఫిట్‌నెస్ పెరుగుతుంది.

ఆరోగ్యకరమైన ఆహారం, క్రమబద్ధమైన జీవనశైలి , వైద్యుల సూచనలు పాటించడం ద్వారా హార్మోన్ల సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు.

తరచుగా అడిగే ప్రశ్నలు

Q1: హార్మోన్ల అసమతుల్యతకు ప్రధాన కారణం ఏమిటి?

A: ఒత్తిడి, అనియమిత నిద్ర, తప్పు ఆహార అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం ప్రధాన కారణాలు.

Q2: ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగితే ఏమవుతుంది?

A: ఇది కార్టిసాల్ హార్మోన్‌ను పెంచి హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది.

Q3: వ్యాయామం హార్మోన్లపై ఎలా ప్రభావం చూపుతుంది?

A: వ్యాయామం వల్ల ఇన్సులిన్, కార్టిసాల్, ఎండార్ఫిన్స్ వంటి హార్మోన్లు సమతుల్యంగా పనిచేస్తాయి.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »