పిల్లుల కోసం భారతీయ రుచుల విస్కాస్: రోహు, కట్ల చేపల ఫ్లేవర్లతో కొత్త ఉత్పత్తులు!

ప్రముఖ క్యాట్ ఫుడ్ బ్రాండ్ విస్కాస్ (WHISKAS®), భారతదేశంలోని పిల్లుల అభిరుచులకు అనుగుణంగా 'ఇండియన్ ఫిష్ రేంజ్'ను మార్కెట్లోకి విడుదల చేసింది

ప్రముఖ క్యాట్ ఫుడ్ బ్రాండ్ విస్కాస్ (WHISKAS®), భారతదేశంలోని పిల్లుల అభిరుచులకు అనుగుణంగా ‘ఇండియన్ ఫిష్ రేంజ్’ను మార్కెట్లోకి విడుదల చేసింది. భారతీయ ఇళ్లలో అత్యంత ప్రజాదరణ పొందిన రోహు , కట్ల చేపల రుచులను, అంతర్జాతీయ స్థాయి పోషకాహార విలువలతో జత చేస్తూ ఈ కొత్త శ్రేణిని రూపొందించారు. ఈ వినూత్న ప్రచారానికి బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు.

పెంపుడు జంతువుల ఆరోగ్యంపై దృష్టి:
సాధారణంగా యజమానులు తమ పిల్లులకు ఇంట్లో వండిన చేపలను తినిపిస్తుంటారు. అయితే, అది పిల్లులకు అవసరమైన అన్ని రకాల ప్రోటీన్లు, విటమిన్లు , ఖనిజాలను సంపూర్ణంగా అందించలేకపోవచ్చు. ఈ లోటును భర్తీ చేయడానికి విస్కాస్ తన నైపుణ్యాన్ని ఉపయోగించింది. విస్కాస్ యొక్క ప్రత్యేకమైన ‘క్రంచీ క్రీమీ యమ్మీ పాకెట్స్™’ సాంకేతికతతో, పిల్లులకు ఇష్టమైన రుచితో పాటు ఆరోగ్యకరమైన సంపూర్ణ పోషణను అందించడం ఈ ఉత్పత్తుల ప్రధాన లక్ష్యం.

ప్రచార విశేషాలు:

కళాత్మక ఆవిష్కరణ: ముంబై, కోల్‌కతా వంటి నగరాల్లో ‘క్య్యాచ్ ఆఫ్ ది ఇయర్’ (Catch of the Year) పేరిట చేపల వినియోగంపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. ఇది పెట్ పేరెంట్స్‌లో ఎంతో ఆసక్తిని కలిగించింది.

నిపుణుల పర్యవేక్షణ: ప్రపంచవ్యాప్తంగా వెటర్నరీ వైద్యులు , పోషకాహార నిపుణుల సలహాల మేరకు, పిల్లుల ఆరోగ్యానికి అత్యంత సురక్షితమైన రీతిలో ఈ ఆహారాన్ని తయారు చేశారు.

ఈ కొత్త ప్రయోగంపై మార్స్ పెట్ న్యూట్రిషన్ మార్కెటింగ్ ఆఫీసర్ అయేషా హుడా మాట్లాడుతూ, భారతీయ పెట్ పేరెంట్స్ తమ పిల్లులకు అందించే ఆహారంలో ఒక ఆరోగ్యకరమైన మార్పును తీసుకురావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. సహజమైన రుచిని, శాస్త్రీయ పోషణతో కలపడం ద్వారా పెట్ పేరెంట్స్‌కు నమ్మకమైన ఎంపికను అందిస్తున్నామని ఆమె వివరించారు. ప్రస్తుతం ఈ ‘ఇండియన్ ఫిష్ రేంజ్’ దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ స్టోర్లు , ప్రముఖ ఈ-కామర్స్ సైట్లలో అందుబాటులో ఉంది.

About Author:

Vidya Burujukadi

కంటెంట్ రైటర్‌గా మన వార్త వెబ్ సైట్‌కి విద్య.బి పనిచేస్తున్నారు. ప్రధానంగా బిజినెస్ వార్తలతో పాటు పర్సనల్ ఫైనాన్స్, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన తాజా సమాచారం, జనరల్ అంశాలకు సంబంధించిన కథనాలను ఆమె అందిస్తారు. విద్యకు తెలుగు మీడియా…

More About Author »