తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం చోటు చేసుకుంది. మొదటిసారి ఎన్నికల బరిలో దిగిన నటుడు విజయ్ పార్టీ TVK 105 స్థానాల్లో ముందంజలో నిలిచింది. సింపుల్ మెజారిటీకి 118 స్థానాలు అవసరం కాగా, సాయంత్రం మూడు గంటల నాటికి TVK ఆ లక్ష్యానికి దగ్గరగా కనిపించింది. 234 స్థానాల తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 23న పోలింగ్ జరిగింది.
ఒక సినీ నటుడు నేరుగా ముఖ్యమంత్రి పదవికి దావా వేయడం తమిళనాడు రాజకీయ చరిత్రలో కొత్త కాదు. కానీ విజయ్ తీరు భిన్నంగా ఉంది. MGR, జయలలిత తర్వాత ఇంత వేగంగా రాజకీయ ప్రవేశం చేసి ఇంత స్థానాలు గెలవడం గణనీయమైన విషయం. TVK స్థాపించి రెండేళ్ళు కూడా కాలేదు. అయినా పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉంది. ఇది దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
తమిళనాడు రాజకీయాల్లో సినీ నటుల పాత్ర చారిత్రకమైనది. MGR, జయలలిత, కరుణానిధి – ఒకరు సినీ రంగం నుండి, మరొకరు రచయిత నుండి వచ్చారు. విజయ్ కూడా ఆ సంప్రదాయాన్ని పోలిన మార్గంలో అడుగు వేశారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ – రెండూ సినీ నేపధ్యం నుండే వచ్చాయి. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సినీ నటుడు రాజకీయంగా విజయం సాధించడం తెలుగు ప్రజలకు కొత్త కాదు.
TVK ఇంత వేగంగా ఎదగడానికి ప్రధాన కారణం విజయ్ మేనిఫెస్టో. సాధారణ ప్రజలకు నేరుగా అందే పథకాలను హామీ ఇచ్చారు.
1.మహిళలకు నెలకు రెండు వేల అయిదు వందల రూపాయలు
2.పెళ్లికి ఎనిమిది గ్రాముల బంగారం,
3.సంవత్సరానికి ఆరు ఉచిత గ్యాస్ సిలిండర్లు
4.నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు నెలకు నాలుగు వేల రూపాయలు,
5.అయిదు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు
ఇవి నేరుగా ఓటర్ల మనసును తాకాయి.
ఒక కొత్త పార్టీ కూడా సరైన హామీలు ఇస్తే గెలవగలదు. తెలంగాణలో ఇప్పటికే మహిళలకు రెండు వేల అయిదు వందల రూపాయల, Rythu Bandhu, ఆరు ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలు అమలవుతున్నాయి. TVK ఇదే మోడల్ తమిళనాడులో వాడింది. ఈ రాజకీయ మోడల్ దేశవ్యాప్తంగా వ్యాపిస్తోంది.
తమిళనాడులో మాట్లాడిన ఓటర్లు విజయ్ మేనిఫెస్టోను స్వాగతించారు. “మహిళలకు ఇచ్చే ₹2,500 మరియు బంగారం హామీ చాలా ఆకర్షణీయంగా అనిపించింది” అని చెన్నై ఓటర్లు చెప్పారు. రాజకీయ విశ్లేషకులు మాత్లాడుతూ TVK ఫలితం దేశంలో కొత్త పార్టీల పెరుగుదలకు సానుకూల సంకేతమని చెప్తున్నారు. “విజయ్ MGR మార్గంలో నడుస్తున్నారు – ప్రజా సంక్షేమం పేరుతో రాజకీయం” అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
TVK విజయం తెలుగు రాజకీయాల్లో కూడా ప్రభావం చూపనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొత్త పార్టీలు పుట్టుకొస్తున్న నేపధ్యంలో – పొరుగు రాష్ట్రంలో కొత్త పార్టీ సాధించిన విజయం స్ఫూర్తినిస్తుంది. రాష్ట్ర సంక్షేమ పథకాల పోటీ మరింత తీవ్రమవుతుందని నిపుణులు చెప్తున్నారు. ఒక రాష్ట్రంలో ఒక పార్టీ విజయవంతంగా అమలు చేసిన పథకాలు మరో రాష్ట్రంలో మరో పార్టీ copy చేయడం భారత రాజకీయాల్లో సాధారణమైంది.
Also Read : తమిళనాడు మహిళలకు భారీ కానుక: ఖాతాల్లో ₹5,000 జమ చేసిన సీఎం స్టాలిన్!
TVK మెజారిటీ దాటితే విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు వందరోజుల్లో అమలు చేస్తారని ప్రకటించారు. ముఖ్యంగా 8 గ్రాముల బంగారం, మహిళలకు నెలవారీ సహాయం, ఐదు లక్షల ఉద్యోగాల కోసం మొదటి బడ్జెట్ సెషన్ లో నిధులు కేటాయిస్తారని అంచనా. AI మంత్రిత్వ శాఖ ఏర్పాటు కూడా మొదటి నూరు రోజుల్లోపు జరుగుతుందని అనుచరులు చెప్తున్నారు.
Also read: టీవీకే–బీజేపీ పొత్తుపై జోరుగా ప్రచారం.. విజయ్‌తో మాట్లాడలేదని పవన్ కళ్యాణ్ కామెంట్స్


