CSK vs DC Gloves Controversy: గ్లోవ్స్ వివాదం హాట్ టాపిక్.. అంపైర్ నిర్ణయంపై ఢిల్లీ ఆగ్రహం, వాళ్ల‌కో రూల్‌, మాకో రూలా?

ఐపీఎల్ 2026లో సీఎస్కే–ఢిల్లీ మ్యాచ్ చివర్లో గ్లోవ్స్ మార్చే విషయంలో అంపైర్ తీసుకున్న నిర్ణయం పెద్ద వివాదానికి దారి తీసింది. ట్రిస్టన్ స్టబ్స్ అవుట్‌తో మ్యాచ్ మలుపుతిప్పగా, ఢిల్లీ డగౌట్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Umpire denying new gloves to Tristan Stubbs during CSK vs DC IPL 2026 match at Chepauk Stadium.
Umpire denying new gloves to Tristan Stubbs during CSK vs DC IPL 2026 match at Chepauk Stadium.

CSK vs DC Gloves Controversy: ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్–ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ చివర్లో హై డ్రామా చోటుచేసుకుంది. చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ పోరులో చెన్నై విజయం సాధించినప్పటికీ, మ్యాచ్ ఫలితంపై అంపైర్ నిర్ణయం పెద్ద చర్చకు దారి తీసింది.

213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ, ఆఖరి రెండు ఓవర్లకు 32 పరుగులు అవసరమైన దశలో పోరాటం కొనసాగించింది. క్రీజులో ట్రిస్టన్ స్టబ్స్ ఫామ్‌లో ఉండటంతో మ్యాచ్ చివరి బంతి వరకూ వెళ్లే అవకాశాలు కనిపించాయి.

గ్లోవ్స్ వివాదం ఎలా మొదలైంది?

19వ ఓవర్‌లో జేమీ ఓవర్టన్ బౌలింగ్ చేస్తున్న సమయంలో స్టబ్స్ స్ట్రైక్‌లో ఉన్నాడు. చెమట వల్ల గ్లోవ్స్ తడవడంతో బ్యాట్ పట్టుకోవడంలో ఇబ్బంది కలిగింది. దాంతో అతను గ్లోవ్స్ మార్చుకోవాలని ప్రయత్నించాడు. డగౌట్‌లో ఉన్న కరుణ్ నాయర్, నితీష్ రాణా కొత్త గ్లోవ్స్‌తో సిద్ధంగా ఉన్నప్పటికీ, లైన్ అంపైర్ అనుమతి నిరాకరించాడు.

అంపైర్ “ముందుగా తెలియజేయలేదు” అనే కారణంతో అనుమతించకపోవడంతో స్టబ్స్ అదే సమయంలో షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బ్యాట్ స్లిప్ అవడంతో అతను క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ ఒక్కసారిగా చెన్నై వైపు మలుపుతిప్పింది.

ఢిల్లీ డగౌట్ ఆగ్రహం

ఈ నిర్ణయంపై ఢిల్లీ డగౌట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నితీష్ రాణా అంపైర్‌తో వాగ్వాదానికి దిగుతూ, “మాకు ఒక రూలు, సీఎస్కేకు మరో రూలా?” అంటూ ప్రశ్నించాడు. వెంటనే కరుణ్ నాయర్, కోచ్ హేమంగ్ బదానీ కూడా చర్చలో పాల్గొన్నారు. ఈ సంఘటనతో మ్యాచ్ కాసేపు ఉద్రిక్తంగా మారింది. అయితే పరిస్థితిని అంపైర్లు నియంత్రించడంతో ఆట మళ్లీ కొనసాగింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 2 వికెట్లకు 212 పరుగులు చేసింది. సంజు శాంసన్ అద్భుత సెంచరీతో జట్టును భారీ స్కోరుకు చేర్చాడు. లక్ష్య ఛేదనలో ఢిల్లీ 189 పరుగులకే పరిమితమై 23 పరుగుల తేడాతో ఓడిపోయింది. జేమీ ఓవర్టన్ కీలక సమయంలో వికెట్లు తీసి మ్యాచ్‌ను చెన్నై వైపు తిప్పాడు.

వివాదంపై చర్చ

గ్లోవ్స్ మార్పుకు అనుమతి నిరాకరించడం నిబంధనల ప్రకారం సరైనదేనా? లేక మ్యాచ్ పరిస్థితుల్లో సడలింపు ఇవ్వాల్సిందా? అన్నదానిపై క్రికెట్ వర్గాల్లో చర్చ మొదలైంది. ఢిల్లీ అభిమానులు ఈ నిర్ణయమే ఓటమికి కారణమని ఆరోపిస్తుండగా, మరికొందరు అంపైర్లు నిబంధనల ప్రకారమే వ్యవహరించారని అంటున్నారు. మొత్తంగా చూస్తే, చెన్నై విజయం కంటే ఈ గ్లోవ్స్ వివాదమే మ్యాచ్‌కు మరింత హైలైట్‌గా నిలిచింది. ఐపీఎల్ 2026లో అంపైరింగ్‌పై మరోసారి చర్చకు ఇది తెరలేపింది.

Also Read:

 

About Author:

Ch Roja Rani

గత 5 సంవత్సరాలుగా తెలుగు మీడియా రంగంలో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న జర్నలిస్ట్‌. డిజిటల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అయిన Idreampost మరియు Wire Teluguలో పని చేసి విశేష అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం Mana Varta లో క్రీడలు (Sports…

More About Author »