సంజూ శాంసన్ మ‌ళ్లీ ఫెయిల్‌.. ఫామ్‌పై పెరుగుతున్న ఒత్తిడి,సెలెక్షన్‌పై చర్చ

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో సంజూ శాంసన్ మళ్లీ విఫలం కావడంతో ఫామ్, సెలెక్షన్‌పై ఒత్తిడి పెరుగుతోంది. గవాస్కర్ విమర్శలు చర్చనీయాంశం అయ్యాయి.

Sanju Samson struggling with form during India vs New Zealand T20 match
  •  న్యూజిలాండ్ సిరీస్‌లో సంజూ శాంసన్ ఫామ్‌పై ఒత్తిడి పెరుగుతోంది

  •  స్పిన్ బౌలింగ్‌లో ఫుట్‌వర్క్ బలహీనతపై గవాస్కర్ కీలక వ్యాఖ్యలు

  •  టీ20 వరల్డ్‌కప్‌కు ముందు సెలెక్షన్‌పై పెద్ద చర్చ మొదలైంది

న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో సంజూ శాంసన్‌కు ఫామ్ సమస్యలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. మంచి స్టార్ట్‌లు వస్తున్నప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోవడం అతని స్థానం చుట్టూ ప్రశ్నలను మరింత పెంచుతోంది. విశాఖపట్నంలో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో 15 బంతుల్లో 24 పరుగులు చేసి ఔటవ్వడంతో మళ్లీ విమర్శలపాల‌య్యాడు. భారీ లక్ష్య ఛేదనలో భాగంగా భారత్ ఆరంభంలోనే అభిషేక్ శర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వికెట్లు కోల్పోయింది. అప్పుడు క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే బాధ్యత తీసుకున్నాడు. ఆరంభంలో మూడు ఫోర్లు, ఒక సిక్స్‌తో ఆత్మవిశ్వాసంగా ఆడుతూ సెటిల్ అవుతున్నట్టే కనిపించాడు.

అయితే న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ వేసిన బంతికి సంజూ క్లీన్ బౌల్డ్ కావడం మ్యాచ్‌లో కీలక మలుపుగా మారింది. క్రీజులో నిలబడి షాట్ ఆడే ప్రయత్నంలో బంతిని మిస్ చేయడంతో నేరుగా స్టంప్స్‌ను తాకింది. ఈ వికెట్‌తో భారత్ పతనం వేగవంతమైంది. ఈ ఔట్‌పై కామెంటరీ బాక్స్‌లో ఉన్న భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తీవ్రంగా స్పందించారు. సంజూ బ్యాటింగ్‌లో ఉన్న ప్రధాన లోపాన్ని ఆయన స్పష్టంగా చెప్పారు. రీప్లే చూసిన తర్వాత కూడా గవాస్కర్ తన అభిప్రాయాన్ని మరింత బలంగా వ్యక్తం చేశారు.

ప్ర‌ముఖుల ప్రాణాలు తీసిన విమాన ప్రమాదాలు..ఇప్ప‌టి వ‌ర‌కు ఎంత మంది ఆ ప్ర‌మాదాల‌లో మ‌ర‌ణించారు?

గవాస్కర్ చేసిన కీలక వ్యాఖ్యలు :

  • స్పిన్ బౌలింగ్‌లో సంజూ ఫుట్‌వర్క్ చాలా బలహీనంగా ఉందని వ్యాఖ్య
  • కాళ్లు కదలకుండా ఒకే చోట నిలబడి ఆడటంతో స్టంప్స్ పూర్తిగా ఎక్స్‌పోజ్ అవుతున్నాయని అభిప్రాయం
  • లెగ్ స్టంప్ బయటికి వెళ్లి షాట్ ఆడే ప్రయత్నంలో మూడు స్టంప్స్ తెరిచి పెట్టేశాడని విమర్శ
  • ఇలాంటి పరిస్థితుల్లో బంతిని మిస్ చేస్తే బౌలర్‌కు వికెట్ దక్కడం సహజమని వ్యాఖ్య

ఇషాన్ కిషన్ నంబర్ 3 స్థానంలో మంచి ఇంపాక్ట్ చూపిస్తుండటంతో, సంజూ శాంసన్‌కు దక్కే అవకాశాలపై ఇప్పుడు పెద్ద చర్చ మొదలైంది. టీ20 వరల్డ్‌కప్ సమీపిస్తుండటంతో టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకునే నిర్ణయాలు మరింత కీలకంగా మారాయి. సెలెక్షన్ విషయంలో ఫామ్‌కు ప్రాధాన్యం ఇస్తారా, లేక సంజూకు ఇంకా సమయం ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

భిన్న అభిప్రాయాలు :

  • కొందరు మాజీలు సంజూని ఎక్కువ ఒత్తిడిలోకి నెట్టొద్దని సూచిస్తున్నారు
  • కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాదిరిగానే సంజూ కూడా ఒక్క పెద్ద ఇన్నింగ్స్‌తో ఫామ్‌లోకి వస్తాడని కైఫ్ అభిప్రాయం
  • నిరంతర అవకాశాలు ఇస్తేనే అతని అసలు ప్రతిభ బయటపడుతుందని వాదన

ఫిబ్రవరి 7 నుంచి టీ20 వరల్డ్‌కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో, సంజూ శాంసన్ భవితవ్యంపై టీమ్ మేనేజ్‌మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఈ కీలక సమయంలో సంజూ తన లోపాలను సరిదిద్దుకుని పెద్ద ఇన్నింగ్స్ ఆడితేనే విమర్శలకు సమాధానం చెప్పగలడు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »