వాలెంటైన్స్ డే సేల్ సందర్భంగా ఒప్పో రెనో 14 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులోకి వచ్చింది. స్టైలిష్ డిజైన్‌తో పాటు అద్భుతమైన ఫీచర్స్ కావాలని అనుకునే వారు ఈ ఫోన్ ఎంపిక చేసుకోవడం ఉత్తమం. వాలెంటైన్స్ డే సేల్ సందర్భంగా ఒప్పో రెనో 15 5జీ లేటెస్ట్ వెర్షన్ భారీ డిస్కౌంట్‌తో లభ్యమవుతుంది. ఈ సిరీస్‌లో పాత స్మార్ట్‌ఫోన్‌లపై బిగ్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు.
వాలెంటైన్స్ డే సేల్ సందర్భంగా స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్న వారికి ఒప్పో నుంచి ఆకర్షణీయమైన ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఈ-కామర్స్ మరియు రిటైల్ స్టోర్లలో ఒప్పో రెనో 14 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ ధర తగ్గింపు ప్రకటించారు. హైఎండ్ ఫీచర్లు, స్టైలిష్ డిజైన్‌తో పాటు బ్యాంక్ ఆఫర్లు కూడా ఉండటంతో ఈ ఫోన్ కొనుగోలుదారులకు మంచి డీల్‌గా మారింది.
Also Read: ఏప్రిల్ 1 నుంచి టోల్ ప్లాజాల్లో క్యాష్ బంద్… ఫాస్టాగ్, యూపీఐ తప్పనిసరి!
ఫోన్ అసలు ధర రూ.54,999 ఉండగా ప్రస్తుతం రూ.48,879కే లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో కలిపి రూ.10 వేల వరకు సేవ్ చేసుకునే అవకాశం ఉంది. 12GB RAM, 256GB స్టోరేజ్, 6.59 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 8450 ప్రాసెసర్ ఈ ఫోన్ ప్రత్యేకతలు. 6200mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ దీని హైలైట్. 50MP ట్రిపుల్ రేర్ కెమెరా, 50MP ఫ్రంట్ కెమెరాతో ఫోటోగ్రఫీకి బాగా సరిపోతుంది. IP68, IP69 రేటింగ్‌లతో వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంది. స్టైలిష్ డిజైన్, ప్రీమియం ఫీచర్లతో ఈ డీల్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది.
ధర & డిస్కౌంట్ వివరాలు
12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర: రూ. 54,999
ప్రస్తుత ఆఫర్ ధర: రూ. 48,879
డిస్కౌంట్ ధర: రూ. 6,000 పైగా
కొన్ని రిటైల్ స్టోర్లలో అదనపు కూపన్లు కూడా అందుబాటులో ఉన్నాయి
బ్యాంక్ ఆఫర్లు & EMI బెనిఫిట్స్
SBI, Kotak, YES Bank, IDFC క్రెడిట్ కార్డులతో EMI ఆప్షన్
6 లేదా 12 నెలల ఈఎంఐపై కొనుగోలు చేస్తే
అదనంగా రూ. 4,500 వరకు క్యాష్‌బ్యాక్
మొత్తం సేవింగ్: రూ. 10,000 – 10,500 వరకు
ఒప్పో రెనో 14 ప్రో 5G ముఖ్య ఫీచర్లు
6.59 అంగుళాల ఫ్లెక్సిబుల్ AMOLED డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్
Android 15 ఆధారిత ColorOS 15
MediaTek Dimensity 8450 ప్రాసెసర్
6200mAh బ్యాటరీ
80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్
IP68 & IP69 వాటర్/డస్ట్ రెసిస్టెన్స్
కెమెరా స్పెసిఫికేషన్స్
ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్
50MP ప్రైమరీ సెన్సార్
50MP పెరిస్కోప్ టెలిఫోటో
50MP అల్ట్రా వైడ్
50MP ఫ్రంట్ సెల్ఫీ కెమెరా
హై క్వాలిటీ వీడియో కాల్స్ & నైట్ ఫోటోగ్రఫీకి అనుకూలం
కలర్ ఆప్షన్స్
రీఫ్ బ్లాక్
మెర్మైడ్ బ్లూ
కల్లా లిల్లీ పర్పుల్
ఫోన్ కొనాలనే ఆలోచన ఎవరికైన ఉంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఫోన్‌ని కొనుగోలు చేయడం ఉత్తమం. తక్కువ ధరకి ఇన్ని ఫీచర్స్‌తో ఫోన్ మనకి లభ్యం అవుతుంది అంటే ఇంకెందుకు ఆలస్యం చేయడం