- తెలంగాణ టూరిజం 9 రకాల ప్రీమియం బస్ సేవలను అందుబాటులోకి తెచ్చింది
- ఏసీ, నాన్-ఏసీ, వోల్వో, లగ్జరీ మినీ కోచ్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి
- కుటుంబాలు, ఫ్రెండ్స్ ట్రిప్స్, గ్రూప్ టూర్ల కోసం ప్రత్యేక ప్యాకేజీలు
ఫ్యామిలీ ట్రిప్స్‌కు తెలంగాణ టూరిజం స్పెషల్ బస్సులు.. ధరలు కూడా అందుబాటులోనే
Telangana Tourism రాష్ట్రంలో టూరిజాన్ని మరింత ప్రోత్సహించే దిశగా కొత్త రోడ్ ట్రిప్ ప్యాకేజీలను ప్రచారం చేస్తోంది. కుటుంబాలు, ఫ్రెండ్స్ గ్రూప్స్, కార్పొరేట్ టూర్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రీమియం బస్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వోల్వో బస్సుల నుంచి లగ్జరీ మినీ కోచ్‌ల వరకు మొత్తం 9 రకాల వాహనాలను అద్దెకు అందిస్తోంది.
ప్రస్తుతం వేసవి సెలవులు, వీకెండ్ ట్రిప్స్, ఆధ్యాత్మిక యాత్రలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సేవలకు మంచి స్పందన లభిస్తోంది. హైదరాబాద్ నుంచి తెలంగాణలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు.
వోల్వో నుంచి మినీ కోచ్‌ల వరకు ఎంపికలు
టూరిస్టుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఏసీ వోల్వో, నాన్-ఏసీ హైటెక్ బస్సులు, మినీ కోచ్‌లు, లగ్జరీ కోచ్‌లు అందుబాటులో ఉంచారు. 17 సీటర్ల నుంచి 47 సీటర్ల వరకు వివిధ సామర్థ్యాల వాహనాలను ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు.
ప్రత్యేకంగా లాంగ్ డ్రైవ్స్ కోసం కంఫర్టబుల్ సీటింగ్, ఏసీ సదుపాయం, భద్రతా ప్రమాణాలతో ఈ బస్సులను సిద్ధం చేశారు. తెలంగాణ టూరిజం విడుదల చేసిన వివరాల ప్రకారం స్థానిక ప్రయాణాలు, అవుట్ స్టేషన్ టూర్లకు వేర్వేరు చార్జీలు నిర్ణయించారు.
Also Read : పర్యాటక రంగానికి ‘డిజిటల్’ బూస్టర్.. తెలంగాణ పర్యాటక క్రియేటర్ల సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు
ఎంత ఖర్చవుతుంది?
ఏసీ వోల్వో మల్టీ యాక్సిల్ బస్సుకు 80 కిలోమీటర్ల వరకు బేసిక్ ఛార్జీ రూ.14,000గా నిర్ణయించారు. మినీ కోచ్‌లకు రూ.4,500 నుంచి రూ.8,000 వరకు ధరలు ఉన్నాయి. ఇక ఇన్నోవా, కారవాన్ వంటి చిన్న వాహనాల ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి.
ప్రస్తుతం తెలంగాణలో రామప్ప, యాదాద్రి, బొగ్గుగుట్ట, నాగార్జునసాగర్, బద్రాచలం వంటి ప్రాంతాలకు గ్రూప్ ట్రావెల్స్ పెరుగుతున్న వేళ ఈ ప్యాకేజీలు ప్రయాణికులకు ఆకర్షణీయంగా మారుతున్నాయి.
AC Volvo Multi-Axle
- Seating: 47
- Base Fare: ₹14,000
- Extra KM: ₹100
- Extra Hour: ₹1500
- Outstation KM: ₹100
- Minimum KM/Day: 500
AC Volvo
- Seating: 45
- Base Fare: ₹13,000
- Extra KM: ₹77
- Extra Hour: ₹1000
- Outstation KM: ₹77
- Minimum KM/Day: 450
Non-AC Hitech
- Seating: 36
- Base Fare: ₹7,000
- Extra KM: ₹57
- Extra Hour: ₹500
- Outstation KM: ₹57
- Minimum KM/Day: 350
AC Mini Coach
- Seating: 26
- Base Fare: ₹5,000
- Extra KM: ₹37
- Extra Hour: ₹450
- Outstation KM: ₹37
- Minimum KM/Day: 300
Non-AC Mini Coach
- Seating: 26
- Base Fare: ₹4,500
- Extra KM: ₹32
- Extra Hour: ₹400
- Outstation KM: ₹32
- Minimum KM/Day: 300
AC Luxury Mini Coach (Eicher)
- Seating: 21
- Base Fare: ₹8,000
- Extra KM: ₹45
- Extra Hour: ₹500
- Outstation KM: ₹45
- Minimum KM/Day: 300
AC Mini Coach
- Seating: 18
- Base Fare: ₹5,000
- Extra KM: ₹35
- Extra Hour: ₹400
AC Mini Coach (Urbania)
- Seating: 17
- Base Fare: ₹5,000
- Extra KM: ₹42
- Extra Hour: ₹450
- Outstation KM: ₹42
- Minimum KM/Day: 300
AC Mini Coach (Force Motors)
- Seating: 15
- Base Fare: ₹4,500
- Extra KM: ₹40
- Extra Hour: ₹400
- Outstation KM: ₹40
- Minimum KM/Day: 250
Caravan (9 Seats & 4 Berths)
- Seating: 9
- Base Fare: ₹14,000
- Extra KM: ₹70
- Extra Hour: ₹1000
- Outstation KM: ₹70
- Minimum KM/Day: 350
Innova
- Seating: 7
- Base Fare: ₹2,000
- Extra KM: ₹18
- Extra Hour: ₹150
- Outstation KM: ₹18
- Minimum KM/Day: 300
పర్యాటక రంగానికి ఊతం
ప్రైవేట్ ట్రావెల్స్ ఖర్చులు పెరుగుతున్న సమయంలో ప్రభుత్వ టూరిజం శాఖ అందిస్తున్న ఈ సేవలు మధ్యతరగతి కుటుంబాలకు ఊరటనివ్వనున్నాయని పర్యాటక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా భద్రత, విశ్వసనీయత, సరసమైన ధరల కారణంగా తెలంగాణ టూరిజం బస్సులకు డిమాండ్ పెరిగే అవకాశముందని చెబుతున్నారు.
బుకింగ్స్ కోసం తెలంగాణ టూరిజం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు కూడా విడుదల చేసింది.
- +91 98481 25720
- +91 836 728 5285
- +91 98485 40371
Also Read : యాదాద్రి – హైదరాబాద్ నుండి 60 కి.మీ దూరంలో భక్తి, శాంతి, అందమైన ప్రకృతి


