లోకేష్ జన్మదిన వేడుకలకు సినీ గ్లామర్ టచ్‌.. ఎన్టీఆర్ విషెస్‌తో సోషల్ మీడియాలో హీట్

Jr NTR Wishes Nara Lokesh:నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. బావ–బావమరుదుల అనుబంధాన్ని ప్రతిబింబించే ఈ విషెస్ నారా, నందమూరి అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచాయి. రాజకీయంగా కీలక దశలో ఉన్న లోకేష్‌కు దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Junior NTR birthday wishes to Nara Lokesh goes viral on social media
Junior NTR birthday wishes to Nara Lokesh goes viral on social media

Jr NTR Wishes Nara Lokesh

  • నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

  • నారా–నందమూరి కుటుంబాల మధ్య ఉన్న బావ–బావమరుదుల అనుబంధాన్ని ఈ విషెస్ మరోసారి హైలైట్ చేశాయి.

  • రాజకీయంగా కీలక బాధ్యతల్లో ఉన్న లోకేష్‌కు దేశవ్యాప్తంగా నేతలు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. రాజకీయ నేతలతో పాటు సినీ ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా లోకేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందడి మధ్య టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

లోకేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఎన్టీఆర్ చేసిన పోస్ట్ నెట్టింట వేగంగా వైరల్ అయింది. “జన్మదిన శుభాకాంక్షలు లోకేష్. ఇది మీ జీవితంలో మరో అద్భుతమైన సంవత్సరం కావాలని కోరుకుంటున్నాను” అంటూ ఎన్టీఆర్ పేర్కొన్నారు. ఈ ట్వీట్‌తో నారా–నందమూరి అభిమానుల్లో ఉత్సాహం ఒక్కసారిగా పెరిగింది. నారా లోకేష్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ వరుసకు బావా–బావమరుదులు కావడం తెలిసిందే. ఒకరు రాజకీయాల్లో, మరొకరు సినీ రంగంలో బిజీగా ఉన్నప్పటికీ, ప్రత్యేక సందర్భాల్లో పరస్పరం సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెప్పుకోవడం సంప్రదాయంగా మారింది. ఇద్దరూ ఒకే ఏడాది జన్మించడం కూడా నెటిజన్లలో ఆసక్తికర చర్చకు కారణమవుతోంది.

ఎన్టీఆర్ విషెస్ ఎందుకు స్పెషల్..?

  • టాలీవుడ్ స్టార్ హీరో నుంచి వచ్చిన పబ్లిక్ విషెస్ కావడం
  • నారా–నందమూరి కుటుంబాల అభిమానుల్లో ఉత్సాహం
  • సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్, రీట్వీట్లు
  • బావ–బావమరుదుల బాండింగ్‌ను మరోసారి చూపించిన‌ట్టు అయింది.

నెటిజన్ల స్పందన :

  • ఎన్టీఆర్ ట్వీట్‌పై సోషల్ మీడియాలో సరదా, అభిమాన కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
  • “ఇదే బావ–బావమరుదుల అనుబంధం” అంటూ కొందరు
  • “ఇలా పరస్పరం గౌరవంతో విషెస్ చెప్పుకోవడం బాగుంది” అంటూ మరికొందరు
  • నారా, నందమూరి అభిమానులు ట్వీట్‌ను ట్రెండ్ చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు

మరో నాలుగు నెలల్లో ఎన్టీఆర్ పుట్టినరోజు ఉండటంతో, ఆ రోజు లోకేష్ కూడా ఎన్టీఆర్‌కు విషెస్ చెబుతారని అభిమానులు ఇప్పటి నుంచే అంచనా వేస్తున్నారు. గత ఏడాది కూడా ఇలాగే పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్న విషయం గుర్తుకు తెచ్చుకుంటున్నారు.

రాజకీయంగా లోకేష్ ప్ర‌స్థానం:

  • రాజకీయ పరంగా చూస్తే, నారా లోకేష్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో
  • మానవ వనరుల అభివృద్ధి
  • ఐటీ, ఎలక్ట్రానిక్స్
  • కమ్యూనికేషన్ శాఖల

మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘యువగళం’ పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లిన లోకేష్, 2024 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిచి ప్రత్యేక గుర్తింపు సాధించారు. పార్టీ అధికారంలోకి రావడంలో ఆయన పాత్ర కీలకమని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.

యువ నాయకుడిగా, భవిష్యత్‌పై దృష్టి పెట్టి పనిచేస్తున్న నేతగా లోకేష్‌పై అంచనాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో దావోస్ పర్యటనలో ఉన్నప్పటికీ, ఆయనకు దేశవ్యాప్తంగా నుంచి శుభాకాంక్షలు అందుతూనే ఉన్నాయి.

తరచుగా అడిగే ప్రశ్నలు

Q1: జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు లోకేష్‌కు విషెస్ చేయడం ప్రత్యేకం?

A: టాలీవుడ్ స్టార్ హీరో నుంచి వచ్చిన పబ్లిక్ విషెస్ కావడం, అలాగే బావ–బావమరుదుల బంధాన్ని మరోసారి చూపించడమే కారణం.

Q2: నారా లోకేష్ ప్రస్తుతం ఏ శాఖల మంత్రిగా ఉన్నారు?

A: మానవ వనరుల అభివృద్ధి, ఐటీ & ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Q3: లోకేష్ రాజకీయంగా ఎందుకు ప్రాధాన్యం పొందుతున్నారు?

A: యువగళం పాదయాత్ర, మంగళగిరి నుంచి భారీ మెజారిటీ విజయం, పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి పెట్టడం వల్ల ఆయనపై అంచనాలు పెరిగాయి.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »