జెనెంటెక్‌తో పేటెంట్ వివాదాల పరిష్కారం.. ‘పెబ్రిల్జో’ బయోసిమిలర్ గ్లోబల్ లాంచ్ డేట్స్ ప్రకటించిన బయోకాన్!

ప్రముఖ బయోటెక్నాలజీ సంస్థ బయోకాన్ లిమిటెడ్, జెనెంటెక్‌తో జరిగిన ప్రపంచవ్యాప్త పేటెంట్ సెటిల్‌మెంట్ , లైసెన్స్ ఒప్పందంతో కీలక మైలురాయిని సాధించింది.

జెనెంటెక్‌తో పేటెంట్ వివాదాల పరిష్కారం.. ‘పెబ్రిల్జో’ బయోసిమిలర్ గ్లోబల్ లాంచ్ డేట్స్ ప్రకటించిన బయోకాన్!

ప్రముఖ బయోటెక్నాలజీ సంస్థ బయోకాన్ లిమిటెడ్, జెనెంటెక్‌తో జరిగిన ప్రపంచవ్యాప్త పేటెంట్ సెటిల్‌మెంట్ , లైసెన్స్ ఒప్పందంతో కీలక మైలురాయిని సాధించింది. రొమ్ము క్యాన్సర్ (Breast Cancer) చికిత్సలో వాడే ప్రముఖ ఔషధం ‘పెర్జెటా’కు బయోసిమిలర్‌గా అభివృద్ధి చేసిన ‘పెబ్రిల్జో'(Pebrilzo) మార్కెట్లోకి వచ్చే తేదీలను సంస్థ ఖరారు చేసింది. అమెరికా, కెనడా సహా పలు ప్రధాన దేశాల్లో రెండు కంపెనీల మధ్య కొనసాగుతున్న అన్ని పేటెంట్ వివాదాలు ఈ సమగ్ర ఒప్పందంతో ముగిశాయి.

ఈ ఒప్పంద నిబంధనల ప్రకారం, 2027 మొదటి త్రైమాసికంలో యూరోపియన్ యూనియన్ (EU), యునైటెడ్ కింగ్‌డమ్ (UK) మార్కెట్లలో పెబ్రిల్జో విడుదల కానుంది. అలాగే 2028 మూడవ త్రైమాసికంలో అమెరికాలో ఈ ఔషధాన్ని లాంచ్ చేయడానికి మార్గం సుగమమైంది. వీటితో పాటు 2026 నుంచి 2028 మధ్య కాలంలో ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కూడా దశలవారీగా ఈ ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకురానున్నారు. హెచ్‌ఈఆర్‌2 (HER2) పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ కణాల వృద్ధిని సమర్థవంతంగా అడ్డుకునే పెబ్రిల్జో రాకతో క్యాన్సర్ రోగులకు మరింత అందుబాటు ధరలో నాణ్యమైన వైద్యం అందే అవకాశం ఉంది. అయితే అన్ని ప్రాంతాల్లోని తుది విడుదల ఆయా దేశాల రెగ్యులేటరీ సంస్థల ఆమోదాలపై ఆధారపడి ఉంటుందని బయోకాన్ స్పష్టం చేసింది.

About Author:

Vidya Burujukadi

కంటెంట్ రైటర్‌గా మన వార్త వెబ్ సైట్‌కి విద్య.బి పనిచేస్తున్నారు. ప్రధానంగా బిజినెస్ వార్తలతో పాటు పర్సనల్ ఫైనాన్స్, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన తాజా సమాచారం, జనరల్ అంశాలకు సంబంధించిన కథనాలను ఆమె అందిస్తారు. విద్యకు తెలుగు మీడియా…

More About Author »