ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలా? ఈ వస్తువులు ఉంటే చాలు.. ఐశ్వర్యం మీ సొంతం

వాస్తు శాస్త్రం(Vastu Tips) ప్రకారం ఇంట్లో కొన్ని శుభప్రదమైన వస్తువులు ఉండటం వల్ల ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు తొలగి లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. గణపతి, లక్ష్మీ–కుబేరుడు, శంఖం వంటి వస్తువులు ఇంట్లో సానుకూల శక్తిని పెంచి ఐశ్వర్యాన్ని తీసుకొస్తాయి.

Vastu Tips to Remove Financial Problems and Attract Wealth at Home
Vastu Tips to Remove Financial Problems and Attract Wealth at Home

Vastu Tips

హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందులు, తీరని అప్పులతో సతమతమవ్వడం అనేది నేటి కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. సంపాదన బాగున్నా, చేతిలో పైసా నిలవక అప్పుల ఊబిలో కూరుకుపోతుంటారు. ఇలాంటి పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి కష్టపడటంతో పాటు, మన చుట్టూ ఉండే పరిసరాల్లో సానుకూల శక్తి (Positive Energy) ఉండటం కూడా ఎంతో ముఖ్యం. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొంది, ఆర్థిక కష్టాల నుంచి విముక్తి పొందవచ్చు.

జ్యోతిష్య, వాస్తు పండితుల (Vastu Tips)అభిప్రాయం ప్రకారం.. ఇంట్లో ఈ ఐదు వస్తువులు ఉంటే అప్పుల బాధలు తొలగిపోయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది.

1. విఘ్నేశ్వరుడి విగ్రహం:

జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను తొలగించేవాడు గణనాథుడు. ఇంట్లో ఆర్థిక సమస్యలు తాండవిస్తుంటే, ఈశాన్య దిశలో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అందరికీ కనిపించేలా ఈ విగ్రహాన్ని ఉంచడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి రాకుండా ఉంటుంది. దీనివల్ల పనుల్లో ఆటంకాలు తొలగి, ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి.

2. వెండి వేణువు:

కృష్ణ పరమాత్మకు అత్యంత ప్రీతిపాత్రమైన వేణువు ఇంట్లో ఉండటం శుభప్రదం. వాస్తు ప్రకారం, ఇంటి గోడలకు అలంకరించే వస్తువుల్లో వెండి వేణువు ఉండేలా చూసుకోవాలి. దీనిని ఇంటికి ఉత్తర లేదా తూర్పు దిశలో అమర్చడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇది ఇంట్లోని వాస్తు దోషాలను పోగొట్టి, ప్రశాంతతను చేకూరుస్తుంది.

Vastu Tips to Remove Financial Problems and Attract Wealth at Home
Vastu-tips

3. లక్ష్మీదేవి – కుబేరుడి ప్రతిమలు:

సంపదకు అధిదేవత లక్ష్మీదేవి అయితే, ఆ సంపదను కాపాడేవాడు కుబేరుడు. అందుకే ఈ ఇద్దరి విగ్రహాలు లేదా ఫోటోలు ఇంట్లో ఉండటం వల్ల ధన వర్షం కురుస్తుంది. అయితే, ఈ విగ్రహాలను ఎప్పుడూ దుమ్ము పట్టకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. పరిశుభ్రత ఉన్న చోటే లక్ష్మీదేవి కొలువై ఉంటుందని మర్చిపోకూడదు.

4. శంఖం:

పూజా గదిలో శంఖం ఉండటం వల్ల ఆ ఇంట్లో ఎప్పుడూ దారిద్య్రం ఉండదు. శంఖం ఇంట్లో ఉంటే వాస్తు దోషాలు తొలగిపోయి ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఇది కేవలం సంపదనే కాకుండా, ఇంట్లో ఉన్న వారికి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది. నిత్యం శంఖం ఉన్న చోట ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తే ఫలితం త్వరగా ఉంటుంది.

5. కొబ్బరికాయ (శ్రీఫలం):

శాస్త్రాల ప్రకారం కొబ్బరికాయను ‘శ్రీఫలం’ అంటారు, అంటే లక్ష్మీదేవి స్వరూపం. ఇంట్లో ఎప్పుడూ కనీసం ఒక్క కొబ్బరికాయ అయినా ఉండేలా చూసుకోవడం వల్ల ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. ఒకవేళ ఇంట్లో కొబ్బరి చెట్టు ఉంటే అది ఇంకా శుభదాయకం. కొబ్బరికాయ ఉన్న ఇంట్లో దేవుడి ఆశీస్సులు మెండుగా ఉంటాయని నమ్మకం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తరచుగా అడిగే ప్రశ్నలు

Q1: ఇంట్లో గణపతి విగ్రహాన్ని ఏ దిశలో ఉంచాలి?

A: ఇంటి ఈశాన్య దిశలో గణపతి విగ్రహాన్ని అందరికీ కనిపించేలా ఉంచడం శుభప్రదం.

Q2: లక్ష్మీ–కుబేర ప్రతిమలను ఎక్కడ ఉంచాలి?

A: పూజా గది లేదా ఉత్తర దిశలో శుభ్రంగా ఉంచితే ధనస్థిరత్వం కలుగుతుంది.

Q3: శంఖం నిజంగా ఆర్థిక సమస్యలు తొలగిస్తుందా?

A: వాస్తు ప్రకారం శంఖం ఉన్న ఇంట్లో దారిద్య్రం దూరమై, ఆరోగ్యం మరియు ఐశ్వర్యం పెరుగుతాయి.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »