పరిగడుపున మెంతి నీళ్లు తాగితే.. ఈ ప్రయోజనాలు మీకే

ఉదయం పరిగడుపున మెంతి నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ, రక్తంలో చక్కెర స్థాయిలు, కొలెస్టెరాల్, బరువు, జుట్టు, చర్మానికి కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకోండి.

fenugreek-water-benefits-drinking-on-empty-stomach
fenugreek-water-benefits-drinking-on-empty-stomach

ఉదయం లేచిన వెంటనే ఖాళీ కడుపుతో పరిగడుపున మెంతి నీళ్లు తాగి చూడండి. ఒక పది రోజులు తాగినా చాలు.. మంచి ఫలితాలు కనిపిస్తాయి. మెంతి నీళ్ల వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.

ప్రతి ఇంట్లోనూ మెంతులు ఉంటాయి. ఇక చేపల పులుసు వండేటప్పుడు ముందుగా నూనెలో మెంతులు వేసి వేయిస్తారు. దీనివల్ల మంచి రుచి వస్తుందని అంటారు. మెంతుల్లో ఫైబర్, విటమిన్లు, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్ వంటి ఎన్నో ఖనిజాలు అధికంగా ఉంటాయి. డైట్‌లో మెంతి నీటిని కూడా చేర్చుకుంటే, మీరు ఊహించని ప్రయోజనాలు చూస్తారు.

ప్రతిరోజూ ఉదయం పరిగడుపున మెంతి నీళ్లు తాగి చూడండి. మీరు ఊహించని ఫలితాలు కనిపిస్తాయి. మీకు మీరే ఆరోగ్యంగా ఫీల్ అవుతారు. మెంతి పిండిని లేదా మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం లేచాక ఆ నీటిని తాగాలి. దీనివల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.

మెంతుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి అజీర్ణ సమస్య రాదు. ఏది తిన్నా సులువుగా అరిగిపోతుంది. కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. అంతేకాదు, పోషకాలను శరీరం పూర్తిగా గ్రహించేలా సహాయపడుతుంది కూడా.

మెంతుల నీళ్లు ఆకలి వేసే ఫీలింగ్‌ను కూడా అడ్డుకుంటాయి. శరీరంలో జీవక్రియ రేటును పెంచుతాయి. శరీరంలోని రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల బరువు కూడా త్వరగా తగ్గుతారు.

మెంతుల నీటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి ఆర్థ్రైటిస్, ఆస్తమా వంటి వ్యాధుల నుంచి కూడా రక్షణ కల్పిస్తాయి.

మెంతి నీరు తాగడం వల్ల జుట్టు రాలే సమస్య చాలా వరకు తగ్గుతుంది. జుట్టు కూడా బాగా పెరుగుతుంది. తలపై చుండ్రు, దురద వంటి తల సమస్యలు ఉన్న వారికి వాటి నుంచి ఉపశమనం దక్కుతుంది.

మెంతి నీరు తాగడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలను చాలా వరకు నియంత్రణలో ఉంచుకోవచ్చు. డయాబెటిస్ ఉన్న వారు ప్రతిరోజూ మెంతి నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వారికి ఇది చాలా మేలు చేస్తుంది.

మెంతుల నీటిని రోజూ తాగడం వల్ల శరీరంలోని చెడు కొలెస్టెరాల్ పెరిగిపోకుండా ఉంటుంది. దీని వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మెంతుల నీటిలో ఫైటోఈస్ట్రోజెన్లు అధికంగా ఉంటాయి. ఇవి హార్మోన్ అసమతుల్యత సమస్య రాకుండా అడ్డుకుంటాయి. మెనోపాజ్ లక్షణాలతో బాధపడే మహిళలకు ఇది ఎంతో మేలు చేస్తుంది.

మెంతుల నీటిని రోజూ తాగే వారిలో మొటిమలు రావు. చర్మం కాంతివంతంగా మారిపోతుంది.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »