ఈరోజు శనివారం 28 ఫిబ్రవరి 2026 నాటి తాజా రాశి ఫలాలు మీ కోసం అందిస్తున్నాం. జ్యోతిషం విశ్వసించే వారు దిన ఫలాలు చదివిన తర్వాతే రోజువారీ కార్యకలాపాలు ప్రారంభిస్తుంటారు. మేషం నుంచి మీనం వరకు అన్ని 12 రాశుల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
మేషం (Mesha)
ఆకస్మిక ధనలాభం ఉంటుంది. రాజకీయ రంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అన్నింటా విజయాన్నే సాధిస్తారు. బంధు మిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది.
వృషభం (Vrushabha)
నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు ఆకర్షిస్తాయి. శుభవార్తలు వింటారు.
మిథునం (Mithuna)
పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి.
కర్కాటకం (Karkataka)
శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధు మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. సమాజంలో గౌరవమర్యాదలు లభిస్తాయి.
సింహం (Simha)
తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారవచ్చు. నూతన కార్యాలు ప్రారంభించకూడదు.
కన్య (Kanya)
వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. పోట్లాటలకు దూరంగా ఉండటం మంచిది. స్థిరాస్తుల విషయాల్లో తొందరపాటు పనికిరాదు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం.
తుల (Tula)
ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధు మిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురిచేస్తుంది. పిల్లలపట్ల అతిగా పట్టుదల పనికిరాదు. పగ సాధించే ప్రయత్నాలు వదిలివేయడం మంచిది.
వృశ్చికం (Vrushchika)
అన్ని కార్యాల్లో విజయం సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రుబాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు అధికమవుతాయి. కుటుంబంలో అభివృద్ధితోపాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది.
ధనుస్సు (Dhanusu)
తోటివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపార మూలకంగా ధననష్టం కలిగే అవకాశాలున్నాయి. వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. కుటుంబ విషయాల్లో అనాసక్తి ఉంటుంది.
మకరం (Makara)
రుణప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు. స్త్రీలకు స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. బంధు మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది.
కుంభం (Kumbha)
ధర్మకార్యాలు చేయడంలో ఆసక్తి పెరుగుతుంది. దైవదర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందం అనుభవిస్తారు. పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.
మీనం (Meena)
అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.