కిడ్నీ సమస్యలకు రణపాల ఆకులతో చెక్.. ఇంట్లోనే ఈ జ్యూస్ ఎలా తయారు చేయాలో తెలుసా?

రణపాల ఆకులు (Ranapala leaves)కిడ్నీ రాళ్లు, వాపు, మూత్ర సమస్యలకు సహజ పరిష్కారంగా పనిచేస్తాయి. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే రణపాల జ్యూస్ కిడ్నీలను శుద్ధి చేసి, మూత్ర విసర్జనను మెరుగుపరుస్తుంది. అయితే తీవ్రమైన కిడ్నీ సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి.

Ranapala leaves
Ranapala leaves

Ranapala leaves

  • రణపాల ఆకులు కిడ్నీల్లో పేరుకుపోయిన విషతుల్యాలను బయటకు పంపి, మూత్ర విసర్జనను సాఫీగా చేస్తాయి.

  • రణపాల జ్యూస్ చిన్న కిడ్నీ రాళ్లు కరిగి బయటకు వెళ్లేలా సహాయపడుతూ, వాపు మరియు ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.

  • ఇందులోని యాంటీఆక్సిడెంట్లు కిడ్నీ కణాలను రక్షించి, క్రియాటినిన్ స్థాయిల నియంత్రణకు తోడ్పడతాయి.

హైదరబాద్: ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మన ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. తగినంత నీరు తాగకపోవడం, చాలా సేపు కూర్చుని పనిచేయడం (శారీరక శ్రమ లేకపోవడం), అధిక బరువు, డయాబెటిస్ వంటి కారణాల వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడటం సర్వసాధారణమైపోయింది. శరీరంలో కాల్షియం, యూరిక్ యాసిడ్ వంటి ఖనిజాలు పేరుకుపోయి, అవి బయటకు వెళ్లలేక గట్టి గడ్డలుగా మారుతాయి. ఇవే కిడ్నీ స్టోన్స్‌గా మారి నరకాన్ని చూపిస్తాయి. మూత్రం వచ్చేటప్పుడు మంట, నడుము భాగంలో భరించలేనంత నొప్పి రావడం దీని ప్రధాన లక్షణాలు.

అద్భుత సంజీవని:

ఈ కిడ్నీ సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రకృతి మనకు అందించిన గొప్ప వరం ‘రణపాల’. దీనిని శాస్త్రీయంగా బ్రియోఫిల్లమ్ పిన్నేటమ్ (Bryophyllum pinnatum) అని పిలుస్తారు. ఇదొక అలంకరణ మొక్కలా కనిపించినా, దీని ఆకుల్లో అపారమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఒక్క ఆకును నాటినా కొత్త మొక్కలు పుట్టుకొచ్చే ఈ రణపాల, కిడ్నీలను శుద్ధి చేయడంలో దీనికి సాటిలేదు .

రణపాల జ్యూస్‌ను ఎలా సిద్ధం చేసుకోవాలి?

ఈ రసాన్ని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు

కావలసినవి: 5 నుండి 6 తాజా రణపాల ఆకులు, కొంచెం తేనె, నిమ్మరసం, చిటికెడు ఉప్పు.

తయారీ: ఆకులను శుభ్రంగా కడిగి, మిక్సీలో వేయండి. దానికి తగినంత నీరు, రుచి కోసం కొద్దిగా తేనె, ఉప్పు, నిమ్మరసం కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ రసాన్ని రోజూ ఉదయాన్నే తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Ranapala leaves
Ranapala leaves

మూత్రపిండాలపై ప్రభావం:

ఈ ఆకులోని గుణాలు కిడ్నీలలో పేరుకుపోయిన విషతుల్యాలను బయటకు పంపి, కిడ్నీలను పూర్తిగా శుభ్రపరుస్తాయి. మూత్ర విసర్జన సాఫీగా జరిగేలా చేసి, చిన్న చిన్న రాళ్లు కరిగి బయటకు వెళ్లేలా ప్రేరేపిస్తుంది. రక్తంలో పెరిగిన క్రియాటిన్ స్థాయిలను తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది, తద్వారా కిడ్నీ ఫెయిల్యూర్ వంటి ముప్పులు తప్పుతాయి. కిడ్నీల వాపును తగ్గించి, ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు కిడ్నీ కణాలకు రక్షణ కవచంలా పనిచేస్తాయి.

మందులతో పాటు ఇలాంటి ప్రకృతి సిద్ధమైన ఆహార నియమాలు పాటించడం వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయి. రణపాల ఆకు కేవలం కిడ్నీలకే కాకుండా రక్తపోటు నియంత్రణకు, చర్మ సమస్యలకు కూడా మేలు చేస్తుంది.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కిడ్నీ సమస్యలు తీవ్రంగా ఉన్నప్పుడు లేదా ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నప్పుడు, ఈ జ్యూస్ తీసుకునే ముందు డాక్టర్‌ను సంప్రదించడం తప్పనిసరి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తరచుగా అడిగే ప్రశ్నలు

రణపాల జ్యూస్ రోజూ తాగవచ్చా?

అవును. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్నవారు రోజూ ఉదయాన్నే తాగవచ్చు. అయితే కిడ్నీ సమస్యలు తీవ్రమైనవారు డాక్టర్ సలహా తీసుకోవాలి.

రణపాల జ్యూస్ ఎంతకాలం తీసుకోవాలి?

చిన్న కిడ్నీ రాళ్లు లేదా స్వల్ప సమస్యలుంటే 2–3 వారాలు తీసుకోవచ్చు. దీర్ఘకాలిక వినియోగానికి వైద్యుల సూచన అవసరం.

రణపాల ఆకులు ఇతర సమస్యలకు ఉపయోగపడతాయా?

అవును. ఇవి రక్తపోటు నియంత్రణకు, చర్మ సమస్యలకు, శరీర శుద్ధికి కూడా మేలు చేస్తాయని ఆయుర్వేదం చెబుతోంది.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »