రియల్ మార్కెట్‌లో జోరు..ఈ రాశుల వారికి స్థిరాస్తి అమ్మకాల ద్వారా భారీ ధనలాభం!

ఈ బుధవారం గ్రహాల కదలికలు మిశ్రమ ఫలితాలను సూచిస్తున్నాయి. ఆర్థిక లాభాలు ఉన్నప్పటికీ అనవసర ఖర్చులు, మానసిక ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. మేషం నుంచి మీనం వరకు అన్ని రాశుల వారికి సంబంధించిన సంపూర్ణ దిన ఫలితాలను ఈ రాశిఫలంలో తెలుసుకోండి.

Today Horoscope Telugu – Daily Zodiac Predictions
Today Horoscope Telugu – Daily Zodiac Predictions

హైదరాబాద్: ఈ బుధవారం గ్రహాల కదలికలు మిశ్రమ ఫలితాలను సూచిస్తున్నాయి. బుధ గ్రహ ప్రభావంతో కమ్యూనికేషన్ రంగంలో ఉండేవారికి అనుకూలంగా ఉన్నప్పటికీ, సాధారణంగా మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఇవాళ ఆర్థిక లాభాలు ఉన్న చోటనే అనవసర ఖర్చులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా అనవసరమైన వాదనల వల్ల మనశ్శాంతి దెబ్బతినే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో స్త్రీల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉంటూ, కేవలం మీ పనిపై దృష్టి పెట్టడం ఎంతో శ్రేయస్కరం.

మేష రాశి: ఇవాళ మీకు ఆర్థికంగా కలిసివస్తుంది. గతంలో మీరు ఎవరికైనా ఇచ్చిన బాకీలు అకస్మాత్తుగా వసూలవుతాయి. అయితే, కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం, లేదంటే చిన్న గొడవ పెద్దది కావచ్చు. కొత్త వ్యాపార ఒప్పందాల విషయంలో అనుభవజ్ఞుల సలహాలు తీసుకోకుండా ముందడుగు వేయకండి.

వృషభ రాశి: మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి ఇవాళ అనుకూలంగా ఉంది. పాత అప్పులు తీర్చే ప్రయత్నంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ, ధైర్యంతో అధిగమిస్తారు. కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా తండ్రితో మాట్లాడేటప్పుడు ఓపిక అవసరం. భాగస్వామితో చిన్నపాటి మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది.

మిథున రాశి: వ్యాపారస్తులకు ఇవాళ లాభాలను కలిగే అవకాశం ఉంది. స్నేహితుల సహకారంతో ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. ఆఫీసులో మీ పనితీరుపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ వాదనను ఇతరులకు అర్థమయ్యేలా చెప్పడంలో విజయం సాధిస్తారు, ఇది మీ వృత్తికి ఎంతో మేలు చేస్తుంది.

కర్కాటక రాశి: శారీరక, మానసిక దృఢత్వం కోసం యోగా, ధ్యానం వంటివి చేయడానికి ఇది సరైన సమయం. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారికి భూమి లేదా ఆస్తుల అమ్మకాల ద్వారా మంచి లాభాలు లభిస్తాయి. ప్రియమైన వారితో కలిసి పిక్నిక్ లేదా చిన్న విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది.

సింహ రాశి: ఇవాళ మీరు ఎంతో శక్తివంతంగా పనిచేస్తారు. కానీ ఆఫీసులో తోటి ఉద్యోగుల పట్ల అప్రమత్తంగా ఉండాలి, మీ ఎదుగుదలను చూసి అసూయపడేవారు ఇబ్బంది కలిగించవచ్చు. ఇంటి బాధ్యతలు మానసిక ఒత్తిడికి కారణమవుతాయి. దంపతుల మధ్య చిన్నపాటి ఇబ్బందులు తలెత్తినప్పటికీ, తెలివిగా సర్దుబాటు చేసుకుంటారు.

కన్యా రాశి: పిల్లల చదువు లేదా ఉద్యోగానికి సంబంధించి శుభ సమాచారం అందుతుంది. ఇది ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. కెరీర్‌లో ఎదగాలనుకునే వారు ఇవాళ కొత్త విషయాలు లేదా స్కిల్స్ నేర్చుకోవడంపై దృష్టి పెట్టండి, ఇది మీ భవిష్యత్తుకు చాలా మేలు చేస్తుంది. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం వల్ల సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

తులా రాశి: ఆర్థిక పరంగా అనవసర ఖర్చులకు ఇవాళ దూరంగా ఉండాలి, ముఖ్యంగా విందు వినోదాల కోసం అధికంగా ఖర్చు చేస్తారు. మీ పనితీరులో వచ్చే మార్పు వల్ల అధికారుల మెప్పును, మంచి గుర్తింపును పొందుతారు. అనుకోకుండా అందే బహుమతులు ఈరోజు మిమ్మల్ని ఆశ్చర్యానికి, ఆనందానికి గురిచేస్తాయి.

వృశ్చిక రాశి: పర్యావరణం సంబంధించిన రంగాల్లో పెట్టుబడులు పెట్టేవారికి ఇవాళ లాభదాయకంగా ఉంటుంది. కుటుంబానికి సంబంధించిన పాత రహస్యం ఒకటి మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆఫీసు వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. బంధువులతో చిన్నపాటి విభేదాలు రావచ్చు, మౌనంగా ఉండటం వల్ల సమస్యలు సర్దుకుంటాయి.

ధనుస్సు రాశి: కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. అనుకోని శుభవార్త మీ ఇంట్లో అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. ఆఫీసులో మీ సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక స్థితి మెరుగుపడటానికి, ఆటంకాలు తొలగడానికి ఇవాళ వినాయకుడిని ఆరాధించడం చాలా ఉత్తమం.

మకర రాశి: చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ధన సంబంధిత సమస్యల నుండి ఇవాళ ఉపశమనం లభిస్తుంది. మీ సానుకూల ఆలోచనలు వలన వృత్తిలో విజయాన్ని పొందుతారు. ఆఫీసులో మీ పనితీరుతో సహోద్యోగులను మెప్పిస్తారు. ప్రశాంతంగా మీ పనులను మీరు పూర్తి చేయడం ద్వారా మానసిక తృప్తిని పొందుతారు.

కుంభ రాశి: మీ కష్టానికి తగిన ఫలితం, గౌరవం దక్కే అవకాశం ఉంది. మీ మాటకారి తనంతో అందరినీ ఆకట్టుకుంటారు, ఇది కొత్త సంబంధాలకు దారితీస్తుంది. అయితే, బంధువులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం, చిన్న మాట వలన బంధువులతో గొడవకు దారి తీయవచ్చు. ప్రయాణాల వల్ల కొంచెం అలసటగా అనిపించవచ్చు.

మీన రాశి: ముఖ్యమైన పనులపై శ్రద్ధ పెట్టండి. ఇవాళ మీరు కలిసే ప్రముఖ వ్యక్తుల మాటల నుండి భవిష్యత్తుకు ఉపయోగపడే సలహాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం వల్ల అవసరమైన కొనుగోళ్లు చేస్తారు. వైవాహిక జీవితంలో చిన్నపాటి విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి, కాబట్టి సంయమనం పాటించండి.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »