Abdul Halim Khan | భారత సంతతికి చెందిన ఇమామ్ అబ్దుల్ హలీమ్ ఖాన్ (54)కు బ్రిటన్ కోర్టు జీవిత ఖైదు విధించింది. కనీసం 20 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేసింది. తనకు జీని వంటి అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్మబలికి చిన్నారులు సహా పలువురు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడ్డాడు. ఈ కేసులో దోషిగా తేలడంతో స్నారెస్‌బ్రూక్ క్రౌన్ కోర్టు జీవిత ఖైదు విధించింది. 2005 నుంచి 2014 మధ్య కాలంలో ఈ దారుణానికి ఒడిగిట్టనట్లుగా తేలింది. ఇమామ్‌గా హోదాను అడ్డం పెట్టుకొని అదే సమాజానికి చెందిన ఏడుగురు మహిళలను, పలువురు బాలికలను లొంగదీసుకున్నాడు. బాధితుల్లో కొందరు అప్పటికి కేవలం 12 నుంచి 13 ఏళ్ల వయసులో ఉన్న వారు ఉన్నారని రికార్డులు తెలిపాయి.
Read Also : జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఎదురుదెబ్బ.. ఈడీ కేసులో పిటిషన్ వెనక్కి తీసుకున్న శ్రీలంకన్ బ్యూటీ..!
విశ్వాసాన్ని అడ్డం పెట్టుకొని..
సమాచారం మేరకు.. అబ్దుల్ హలీమ్ ఓల్డ్ ఫోర్డ్ రోడ్‌లో ఇమామ్‌గా పని చేస్తూ బాధితులను ఎవరూ లేని ప్రాంతానికి తీసుకువెళ్లి లైంగిక దాడులకు పాల్పడ్డాడు. కొన్నిసార్లు తాను ఆత్మల ప్రభావంలో ఉన్నానని, పలుసార్లు బాధితుల శరీరాల్లోకి ప్రవేశించిన దుష్ట శక్తులను వెళ్లగొడుతున్నట్లుగా నమ్మబలికినట్లుగా ఆరోపణలున్నాయి. ఓ బాధితురాలికి తాను మాత్రమే సమస్యను నయం చేయగలనని చెప్పి ఓ నిర్జన ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం చేసిన ఘటన సైతం వెలుగులోకి వచ్చింది. మొత్తం 21 కేసుల్లో దోషిగా తేలాడు. 2014లో ఈ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు సమాజంలో మత పెద్దగా గౌరవం పొంది చివరకు కటకటాల పాలయ్యడు. బాధితులు ఎక్కువగా బంగ్లాదేశ్ ముస్లిం సమాజానికి చెందినవారున్నారు. వారి విశ్వాసం, భయాలు, అనుమానాలను అడ్డం పెట్టుకొని ఈ దుశ్చర్యకు పాల్పడినట్లుగా కోర్టు పేర్కొంది. మతపరమైన అధికారాన్ని ఉపయోగించి ఎవరూ తనకు ఎవరూ అడ్డుపడరని ధైర్యంగా ఈ దారుణాలకు తెగబడినట్లుగా న్యాయమూర్తి లెస్లీ కత్బర్ట్ వ్యాఖ్యానించారు.
Read Also : ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు మంత్రం..! కాన్వాయ్‌లో వాహనాల తగ్గింపు..!
భక్తి, పవిత్రత పేరుతో ఆటలు..
ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ భక్తి, పవిత్రతత పేరుతో మహిళల విశ్వాసంతో ఆటలాడుకున్నాడని.. ఇది అత్యంత భయంకరమైన నేరంగా పేర్కొన్నారు. కోర్టులో పలువురు బాధితులు ఇచ్చిన వాంగ్మూలం ఇచ్చారు. ఓ బాధితురాలు తాను 13 ఏళ్ల వయసులో లైంగిక దాడికి గురయ్యాయనని చెప్పారు. తనకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్మించాడని.. ఎవరికి చెప్పినా తనకు కుటుంబానికి హాని జరుగుతుందని బెదిరించినట్లుగా తెలిపింది. మరికొంత మంది బాధితులు మాట్లాడుతూ లైంగిక దాడి తమ జీవితాలపై దీర్ఘకాలిక మానసిక ప్రభావం చూపాయని ఆవేదన వ్యక్తం చేశారు. మతాన్ని అడ్డుపెట్టుకొని ఇమామ్ చేసిన పాడు పనికి సంబంధించి బాధితులు చెప్పిన మాటలు పలువురిని తీవ్రంగా కలచివేశాయి.
Read Also : రాయదుర్గం భూములు వేలం వేయనున్న కాంగ్రెస్ సర్కారు..! ఒక్కో ఎకరానికి రూ.139 కోట్లు..!


