చురుగ్గా నైరుతి రుతుపవనాలు.. ఉత్తర భారతంలో దంచికొడుతున్న ఎండలు..!

నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నాయి. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తుండగా ఉత్తర భారతంలో (Heatwave) తీవ్రత కొనసాగుతోంది. 16 రాష్ట్రాలకు చేరుకున్న రుతుపవనాలు త్వరలో ఉత్తర బెంగాల్‌ను తాకనున్నాయని (IMD Weather Forecast) వెల్లడించింది.

Southwest Monsoon Advances Across India, Heavy Rainfall in South, Heatwave Persists in North

IMD Weather | నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. జూన్ 4న కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు.. ఇప్పటికే 16 రాష్ట్రాలను తాకాయి. మరో మూడు నుంచి నాలుగు రోజుల్లో ఉత్తర బెంగాల్‌కు చేరే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. రుతుపవనాల ప్రభావంతో కేరళ, తమిళనాడు, తీర ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక జూన్ 11 నుంచి పశ్చిమ హిమాలయ ప్రాంతంలో పశ్చిమ అలజడి (వెస్ట్రన్ డిస్టర్బెన్స్) చురుకుగా మారే అవకాశం ఉంది. దాని ప్రభావంతో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో పాటు వాయువ్య భారతంలోని పలు ప్రాంతాలు, తూర్పు భారతంలోని బీహార్ తదితర ప్రాంతాల్లో వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి.

Read Also : తొలిసారిగా ఢిల్లీ రోడ్లపై హైడ్రోజన్‌ బస్సులు.. పర్యావరణ హిత రవాణాలో తొలి అడుగు..!

ఐఎండీ వివరాల ప్రకారం.. నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం కేరళ, తమిళనాడు, కర్నాటక, గోవా, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఈశాన్య భారతంలోని అన్ని ఏడు రాష్ట్రాలకు చేరుకున్నాయి. రాబోయే మూడు రోజుల్లో వాయువ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మిగిలిన ఈశాన్య రాష్ట్రాలు, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాలకు మరింత విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.

Read Also : కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్‌పై అదనంగా రూ.3 అదనంగా సుంకం..!

గత 24 గంటల్లో సబ్-హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, అసోం, మేఘాలయ ప్రాంతాల్లో అక్కడక్కడ 12 నుంచి 20 సెంటీమీటర్ల వరకు భారీ వర్షపాతం నమోదైంది. అలాగే కొంకణ్-గోవా, మధ్య మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, తీర కర్ణాటక, ఉత్తర అంతర్గత కర్ణాటక, తీర ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో 7 నుంచి 11 సెంటీమీటర్ల వరకు వర్షాలు కురిశాయి. ఒకవైపు దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా.. మరోవైపు ఉత్తర భారతం తీవ్రమైన ఎండలతో అల్లాడుతోంది.

Read Also : ఒకే కుటుంబంలో తండ్రీ కొడుకులకు కిసాన్‌ సమ్మానిధి వస్తుందా..? త్వరలోనే రైతుల ఖాతాల్లోకి 23వ విడత నిధులు..!

రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రత 45.6 డిగ్రీల సెల్సియస్‌కు చేరి దేశంలోనే అత్యధికంగా నమోదైంది. జాతీయ రాజధాని ఢిల్లీలో గరిష్ఠ ఉష్ణోగ్రత 42.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లోని ఫతేహ్‌గఢ్‌లో 44.8 డిగ్రీలు, వారణాసిలో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హర్యానాలోని రోహ్‌టక్ రాష్ట్రంలోనే అత్యధికంగా 45.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. పంజాబ్‌లోని పాటియాలాలో 42.6 డిగ్రీలు, జార్ఖండ్‌లోని డాల్టన్‌గంజ్‌లో 43.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రుతుపవనాల విస్తరణతో దక్షిణ, తూర్పు భారతంలో వర్షాలు పెరుగుతుండగా.. ఉత్తర భారతంలో మాత్రం ఎండల తీవ్రత కొనసాగుతోంది. రాబోయే రోజుల్లో పశ్చిమ అలజడి ప్రభావంతో అక్కడి వాతావరణంలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read Also : పట్టపగలే చుక్కలు కనిపించేలా అలుముకోనున్న చీకట్లు..! శతాబ్దంలోనే సుదీర్ఘ సూర్యగ్రహణం..!

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »