క్రికెటర్ – బాలీవుడ్ బ్యూటీ మధ్య పెరిగిన‌ దూరం… అన్‌ఫాలో వ్యవహారం హాట్ టాపిక్

గత కొంతకాలంగా ఇద్దరూ కలిసి కనిపించడంతో డేటింగ్ పుకార్లు జోరందుకున్నాయి. అయితే తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు చూస్తే, వీరి మధ్య ఏదో తేడా వచ్చినట్టే అనిపిస్తోంది.

Chahal Mahvash relationship

బాలీవుడ్ సెలబ్రిటీలు, క్రికెటర్ల మధ్య ప్రేమకథలు కొత్తేమీ కాదు. కొన్ని బంధాలు పెళ్లి వరకు వెళ్లి హ్యాపీ ఎండింగ్ అందుకుంటే, మరికొన్ని మధ్యలోనే బ్రేకప్‌తో ముగుస్తుంటాయి. స్మృతి మంధాన – పలాష్ ముచ్చల్ వ్యవహారం ఇంకా చర్చల్లో ఉండగానే, ఇప్పుడు మరో క్రికెటర్ – సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ మధ్య రిలేషన్‌షిప్ వార్తలు తెరపైకి వచ్చాయి. భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ఆర్జే మహ్వాష్ (RJ Mahvash) పేర్లు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. గత కొంతకాలంగా ఇద్దరూ కలిసి కనిపించడంతో డేటింగ్ పుకార్లు జోరందుకున్నాయి. అయితే తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు చూస్తే, వీరి మధ్య ఏదో తేడా వచ్చినట్టే అనిపిస్తోంది.

ఇద్దరూ ఒకరినొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడం నెట్టింట కొత్త చర్చకు దారితీసింది. చాహల్‌ను అన్‌ఫాలో చేసిన వెంటనే మహ్వాష్ చేసిన కొన్ని పోస్టులు మరింత ఆసక్తిని రేపాయి. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కారులో కూర్చుని జుట్టు సరిచేసుకుంటున్న వీడియోను షేర్ చేయడమే కాకుండా, దానికి అర్థవంతమైన క్యాప్షన్ జోడించింది. ఈ టైమింగ్‌నే చూసి నెటిజన్లు ఈ పోస్టులను బ్రేకప్‌కు హింట్‌గా భావిస్తున్నారు. అయితే దీనిపై అటు చాహల్ కానీ, ఇటు మహ్వాష్ కానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

Also Read: స్మృతి మంధాన–పలాష్ ముచ్చల్ పెళ్లి వివాదంలో ట్విస్ట్.. వివాహం రోజు వేరే అమ్మాయితో దొరికాడా?

వైరల్ అవుతున్న అంశాలు ఇవే:

  • యుజ్వేంద్ర చాహల్, ఆర్జే మహ్వాష్ ఒకరినొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడం
  • అన్‌ఫాలో తర్వాత మహ్వాష్ చేసిన ఎమోషనల్ టచ్ ఉన్న స్టోరీ పోస్టులు
  • “90 శాతం నేను జుట్టు సరిచేసుకుంటుంటే చూస్తారు, మిగతా సమయం జీవితాన్ని సరిచేసుకుంటాను” అనే క్యాప్షన్
  • “మీకు కొంత శాంతిని పంపుతున్నాను” అంటూ మరో మెసేజ్
  • ధనశ్రీ వర్మతో చాహల్ విడాకుల తర్వాతే మహ్వాష్‌తో ఆయన పేరు ఎక్కువగా వినిపించడం

2025లో విడాకులు :

  • ధనశ్రీ వర్మతో చాహల్ 2025లో విడాకులు
  • విడాకులు తీసుకున్న‌ప్ప‌టి నుండి వార్త‌ల‌లోకి చాహ‌ల్‌- మ‌హ్వాష్ జంట‌
  • పదే పదే జంటగా కనిపించడం వల్ల వాళ్ళిద్దరి రిలేషన్‌షిప్, డేటింగ్ గురించి పుకార్లు
  • తాము కేవలం మంచి స్నేహితులమని, అంతకు మించి ఏమీ లేదని ప‌లుమార్లు క్లారిటీ

ఇప్పటివరకు వీరిద్దరూ తమ మధ్య ఉన్నది కేవలం స్నేహమే అని చెప్పుకొచ్చారు. కానీ సోషల్ మీడియాలో జరిగిన ఈ అన్‌ఫాలో ఎపిసోడ్, మహ్వాష్ చేసిన పోస్టుల వల్ల మళ్లీ డేటింగ్, బ్రేకప్ ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఇది నిజంగా సంబంధానికి ముగింపా? లేక సోషల్ మీడియాలో జరిగిన ఓ సాధారణ పరిణామమా? అన్నది తెలియాలంటే… ఇద్దరిలో ఎవరో ఒకరు నోరు విప్పే వరకు వేచి చూడాల్సిందే.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »